ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, నేపధ్య సంగీతం , సినిమాటోగ్రఫీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, నేపధ్య సంగీతం , సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ ,ఎడిటింగ్ , క్లైమాక్స్ , పోసాని కామెడీ ట్రాక్

నవీన్ చింతపండు(ప్రదీప్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి, అందంగా కనిపించిన అమ్మాయిలను ఆకర్షించి ప్రేమ లో పడేస్తూ ఉంటాడు. అలా ప్రేమించిన వాళ్ళలో చాలా మందికి నవీన్ నచ్చకపోగా చాలా మంది నవీన్ కి నచ్చరు. అలా తన జీవితం నడుస్తుండగా అతని జీవితంలో కి వస్తుంది శాలిని(ఇషా తల్వార్), నవీన్ కి శాలినితో పదేళ్ళ క్రితమే పరిచయం ఉన్న సంగతి గుర్తొస్తుంది, చిన్నప్పుడు నవీన్ శాలిని వెంట పడుతూ అల్లరి చేస్తూ ఉంటాడు, అతను వేసిన అల్లరి వేషాలు అన్ని గుర్తొస్తే ఇప్పుడు శాలిని తనను ప్రేమించదు ఏమో అనుకోని కంగారు పడుతూ ఉంటాడు. శాలిని కూడా నవీన్ గతం గురించి తెలియకుండా నవీన్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది కాని ఆ విషయం బయటకి చెప్పదు. ఇదిలా నడుస్తుండగా ఒకరోజు శాలిని కి నవీన్ గురించి నిజం తెలిసిపోతుంది. అప్పటి నుండి నవీన్ కి దూరంగా ఉంటుంది. అసలు శాలిని కోపం నవీన్ అల్లరి వేషాల వలన కాదని , భరత్(సత్యదేవ్) మరియు మాలతీ(మధుమిత) ల ప్రేమకథ వలన అని నవీన్ కి తెలుస్తుంది. తప్పును తెలుసుకున్న నవీన్ సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు.. అసలు భరత్ , మాలతిలు ఎవరు? వాళ్ళ ప్రేమకి నవీన్ కి ఉన్న సంభంధం ఏంటి? నవీన్ ప్రేమను శాలిని ఒప్పుకుందా? అన్నదే మిగిలిన కథ...

నవీన్ పాత్రలో కనిపించిన ప్రదీప్ ఆకట్టుకున్నాడు కాని కొన్ని సన్నివేశాలలో బాగా తడబడినట్టు తెలిసిపోతుంది. ఇషాతల్వర్, గతంలో గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం లో కనిపించి ఆకట్టుకున్న ఈ నటి ఈ చిత్రం మొదటి అర్ధ భాగం మొత్తం తన అందాలతో ఆకట్టుకుంది. మొదటి అర్ధ భాగం ఈ చిత్రానికి ప్లస్ అయ్యే విషయం ఇదే అని చెప్పుకోవచ్చు అంతే కాకుండా తన హావభావాలతో కూడా కాస్త ఆకట్టుకుంది. మొదటి అర్ధ భాగం తరువాత ఈ నటి చివరి వరకు కనిపించదు. ఇక రెండవ కథానాయకుడిగా నటించిన సత్యదేవ్ , ఈ చిత్రానికి ఒక హైలెట్ అని చెప్ప్పుకోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అతని నటన చిత్రానికి చాలా సహాయపడింది. అంతే కాకుండా ప్రేమలో విఫలమయిన ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనేది ఇతని నటనలో చాలా స్పష్టంగా కనబడింది. ఇక మధుమిత పాత్ర చాలా బాగుంది అంతే కాకుండా ఈ నటి నటన కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక సత్యదేవ్ మరియు స్వప్న మధురి మధ్య వచ్చే సన్నివేశం లో ఇద్దరు చాలా బాగా నటించారు. పోసాని కృష్ణ మురళి స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు అతను అతని పక్కన మహేష్ కత్తి ప్రేక్షకుడిని ఎంత వీలయితే అంత హింసించారు. వేణు అక్కడక్కడ తన టైమింగ్ తో కామెడీ పండించారు. వైవా హర్ష పాత్ర చిత్రంలో వ్యర్ధం అని చెప్పుకోవాలి ఇటు నటించలేకపోయాడు అటు నవ్వించలేకపోయాడు. ఉత్తేజ్ మరియు జబర్దస్త్ శీను తళుక్కుమని నవ్వించారు. వీరందరు కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో చిన్న పిల్లల పాత్రలు పోషించిన అందరు పిల్లలు చాలా బాగా నటించారు.

దర్శకుడు ప్రదీప్ మాడగుల గతంలో "బిల్లా రంగ" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుక్ వచ్చారు ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రదీప్ మంచి కథనే ఎంచుకున్నారు కాని కథనం లో చాలా తడబడ్డారు చిత్రంలో విషయం మొదలు పెట్టడానికి గంటకు పైగా తీసుకున్నారు ఇంటర్వెల్ వచ్చే వరకు అసలు దర్శకుడు చెప్పదలచుకున్నది ఏమిటి అనేది ప్రేక్షకుడికి అర్ధం కాదు, ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి నేరుగా ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇక ఆయన కామెడీ అనుకోని రాసుకున్న పోసాని ట్రాక్ మొత్తం అనవసరం అంతే కాకుండా గే కామెడీ తో ప్రేక్షకులకు ఎబ్బెట్టు కలిగేలా చేసారు. క్లైమాక్స్ ఇంకాస్త సమతుల్యతతో రాసుకొని ఉంటె చాలా బాగుండేది అర్ధంతరంగా ముగించేసినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అందించిన విశ్వ పనితనం చాలా బాగుంది, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలకు యెల్లో షేడ్ ఇచ్చి కవర్ చేసారు కాని పదేళ్ళ క్రితం అన్న ఫీలింగ్ రప్పించలేకపోయారు. ఈ విషయంలో మరి కాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్న చాలా చోట్ల బాగా పొడవు అయ్యాయి. ఎడిటింగ్ మరి కాస్త జాగ్రత్త వహించాల్సింది చాలా చోట్ల అనవసరమయిన కట్స్ గమనించవచ్చు. ఒక సన్నివేశం పూర్తి అవ్వకుండా మరొక సన్నివేశంలోకి ప్రవేశించిన భావం చాలా సన్నివేశాలలో కలుగుతుంది. ప్రదీప్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి నేపధ్య సంగీతం చాలా బాగుంది చిత్రానికి ఫ్రెష్ ఫీల్ ని తీసుకు రావడంలో ప్రదీప్ నేపధ్య సంగీతం చాలా సహాయపడింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

మైనే ప్యార్ కియా ఈ చిత్రం గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కాని ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. గత కొన్ని వారాలుగా చూస్తున్న చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం కాస్త బాగుంది ఇవి రెండు నిజాలు, ఇక చిత్రంలో ప్రతి నటుడి నటనలో క్వాలిటీ కనిపిస్తుంది వారి నుండి ఈ స్థాయి నటన రాబట్టుకునే విషయంలో దర్శకుడిని మెచ్చుకొని తీరాల్సిందే. కాని పోసాని గే ట్రాక్ లాంటివి ఎందుకు రాసుకున్నారు అన్నది దర్శకుడికి సూటి ప్రశ్న, ఎందుకంటే ఈ ట్రాక్ వలన చిత్రానికి ఒరిగింది ఏమి లేదు ఇటు నవ్వించలేకపోయింది అటు చిత్రానికి సహాయపడలేదు కూడా మరి ఇలాంటి ట్రాక్ లు ఎందుకు రాసుకున్నారు దర్శకుడు గారు అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. ప్రదీప్ మరియు ఇషా ల ట్రాక్ లో కొత్తగా చెప్పుకోడానికి ఎం లేదు ఎప్పుడు తీసే సన్నివేశాలతోనే నింపేసి అతను రాసుకున్న ట్విస్ట్ కోసం ఇంటర్వెల్ దాక సాగదీసాడు. రెండవ అర్ధ భాగం మొదలవ్వగానే ఒక పది నిమిషాల పాటు చిత్రం పరిస్థితి తెగిన గాలిపటం అయిపోయింది ఒక గమ్యం అంటూ లేకుండా సాగింది. ఒక్కసారి కథ ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళగానే చిత్రానికి ఊపిరి మొదలయ్యింది సత్యదేవ్ నటన మరియు మధుమిత నటన మాత్రమే కాకుండా చిన్న పిల్లల నటన కూడా బాగుండటంతో ప్రతి సన్నివేశం బాగుంది అనిపించింది. సత్యదేవ్ మరియు మధుమిత ట్రాక్ ముగియగానే చిత్రాన్ని చాలా హడావిడి గా ముగించారు. క్లైమాక్స్ లో పోసాని సన్నివేశం కన్నా ఇషా మరియు నవీన్ ల మధ్య ఏదయినా మంచి సన్నివేశం పెట్టి ఉంటె చిత్రం ప్రభావం చాలా బాగుండేది... ఇక చూడాలా? వద్దా? అంటే ఒక్కసారి ట్రై చెయ్యదగ్గ చిత్రం ఇది .. మీకు మరొక పనేం లేకపోతే సినిమా చూడాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే ఈ చిత్రానికి వెళ్ళిపొండి...

Pradeep Betno,Isha Talwar,Pradeep,Venkat Rao Sana,Santhosh Narayanan.మైనే ప్యార్ కియా - బాగోలేదు అనలేము బాగుంది అని కూడా అనలేదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: