మంచు విష్ణు,బేసిక్ ప్లాట్, రీ రికార్డింగ్మంచు విష్ణు,బేసిక్ ప్లాట్, రీ రికార్డింగ్ఆసక్తికరంగా లేని కథనం, సస్పెన్స్ లేకపోవడం, దర్శకత్వం, ఊహించేయదగ్గ ట్విస్ట్ లు, బలవంతంగా జొప్పించిన కామెడీ

హైదరాబాద్ నగరంలో ఒక టాక్సీ డ్రైవర్ సీతారాం(సూర్య) , ఇతనొక సైకో అతని కార్ ఎక్కిన అమ్మాయిలను అతని ఇంటికి తీసుకెళ్ళి అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. ఇతను చేస్తున్న హత్యలను దర్యాప్తు చెయ్యడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా గౌతం(మంచు విష్ణు) ని నియమిస్తుంది. అతి తక్కువ కాలంలో నే ఈ సైకో కిల్లర్ జనంలో భయభ్రాంతులు సృష్టించడం మొదలుపెడతాడు. శైలజ(రేవతి) ఒక మానసిక శాస్త్రవేత్త ,ఈ కేసు ను పరిష్కరించడంలో గౌతం కి సహాయపడుతుంటుంది. సీతారాం మాత్రం నగరంలో పలు చోట్ల అమ్మాయిలను కిడ్నాప్ చెయ్యడం చంపడం ఆపడు, ఇదే క్రమంలో సీతారాం.. ఆశ(మధు శాలిని) ని తన కార్ లో కి ఎక్కించుకొని చంపడానికి తన ఇంటికి తీసుకెళతాడు. ఇదిలా జరుగుతుండగా ఇన్ని హత్యలు జరుగుతున్నా సీరియల్ కిల్లర్ ని పట్టుకోలేకపోయాడన్న కారణంతో గౌతం ని సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం. ఆ తరువాత ఏం జరిగింది? అసలు గౌతం , సైకో ని పట్టుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెర మీదనే చూడాలి...

మంచు విష్ణు పోలీస్ పాత్రలో చాలా బాగా నటించారు సీరియస్ లుక్ తో అయన నటన అతని కెరీర్ లో ఒక మంచి ప్రదర్శన అని చెప్పుకోవచ్చు కాని ఈ పాత్రకు అయన అందించిన నటన పూర్తిగా సరిపోలేదు ఇంకాస్త ఇంటెన్సిటీతో నటించి ఉండాల్సింది. రేవతి పాత్ర అంతగా ఆకట్టుకోకపోయినా అందులో ఆమె నటన చాలా బాగుంది. విష్ణు టీంలో పోలీస్ ల పాత్రలో కనిపించిన శ్రావణ్ మరియు సుప్రీత్ ఆకట్టుకున్నారు. తేజస్వి మదివాడ మరియు మధు శాలిని ఉన్నంతలో పరవలేదనిపించారు. బ్రహ్మానందం మరియు కోట శ్రీనివాస రావు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు..

అనుక్షణం కథాపరంగా అంత గొప్పది ఏమి కాదు ఇప్పటికే చాలా చిత్రాలు ఇదే కథ మీద వచ్చాయి. కాని ఇలాంటి చిత్రాలకి ప్రధాన తేడా కథనంలో కనిపిస్తుంది. ఈ చిత్ర కథనం గురించి మాట్లాడుకుంటే అసలు ఆకట్టుకోలేదు, చిత్రంలో ఒక్క నిమిషం కూడా థ్రిల్లింగ్ గా అనిపించదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. అంతే కాకుండా ఈ చిత్రం పలు ఆంగ్ల చిత్రాలను పోలి ఉంటుంది. థ్రిల్లర్ అంటే ఉండాల్సిన మొదటి అంశం కథనంలో వేగం ఈ చిత్రంలో అదే లేదు అంతే కాకుండా తరువాత రాబోయే సన్నివేశం ఏంటో తెలిసిపోతే ఎం జరుగుతుంది అన్న ఆసక్తి ఉండదు ఈ చిత్రానికి ఇది కూడా మైనస్ అయ్యింది, ఇది నిడివి పరంగా చిన్న చిత్రమే అయినా కూడా ఆసక్తి కరంగా ఉండదు.. నిజానికి దగ్గరగా తీయాల్సిన చిత్రంలో డ్రామా కోసం జతపరిచిన అంశాలు బేసిక్ ప్లాట్ లో ఉన్న సీరియస్ నెస్ ని పోగొట్టేసింది. చిత్రంలో డైలాగ్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి "సచిన్ కి క్రికెట్ అంటే ఇష్టం నాకు చంపడం అంటే ఇష్టం" వంటి డైలాగ్స్ సైకో పాత్రను ఎలివేట్ చేస్తాయేమో కానీ చిత్రానికి కావలసిన ఇంటెన్సిటీ తీసుకు రాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఈ చిత్రానికి తగ్గ సంగీతం కూడా చేకూరింది. సాంకేతిక పరంగా ఈ చిత్రంలో తప్పులు లేక్కెట్టే అంశాలు తక్కువ... 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - ఎవి ఫిల్మ్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

రామ్ గోపాల్ వర్మ ఒక పరిశ్రమ అయితే ఈ మధ్య కాలంలో ఆ పరిశ్రమలో వచ్చిన కాస్త బెటర్ చిత్రం "అనుక్షణం" అని చెప్పుకోవాలి. కానీ కాస్త బెటర్ అన్నంత మాత్రాన బాగుంది అని అన్నట్టు కాదు. మంచు విష్ణు నటన కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అతనిలో ఇంత సీరియస్ నటుడు ఉన్నాడు అని గుర్తించినందుకు రామ్ గోపాల్ వర్మని మెచ్చుకొని తీరాలి. దాదాపుగా ప్రతి నెలా ఒక రామ్ గోపాల్ వర్మ చిత్రం వస్తుంది. కాని ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోతున్నాయి, అతని స్థాయికి తగ్గ చిత్రం ఒక్కటి కూడా రావట్లేదు. ఇది పక్కన పెట్టి ఈ చిత్రం గురించి మాట్లాడితే చంపడం ఇష్టం అనే ఒక సైకో పోలీస్ లతో దాగుడు మూతలు ఎందుకు ఆడతాడు? అన్న ప్రశ్నకి సమాధానం లేదు. గతంలో నిజంగా జరిగిన కొన్ని సంఘటనల గురించి అందులోని కొంతమంది సీరియల్ కిల్లర్స్ గురించి ప్రస్తావించిన దర్శకుడు ఆ స్థాయి ఇంటెన్సిటీ ని సృష్టించలేకపోయాడు. పోలీస్ ల ఇన్వెస్టిగేషన్ ని ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా అయిన తెరకెక్కించి ఉండాల్సింది లేదా బాధితురాలి మానసిక క్షోభ మీద అయిన దృష్టి సారించాల్సింది. ఈ చిత్రం రెండింటికి మధ్యలో నిలబడిపోయింది. అసలే ఆసక్తికరంగా లేని కథనం మరింత నెమ్మదిగా సాగి ప్రేక్షకుడిని విసిగిస్తుంది ఒక స్థాయి దాటాక చిత్రం ఆసక్తికరంగా ఉండకపోగా బోర్ కొట్టిస్తుంది.. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు మిస్ అయినట్టు అనిపిస్తుంది వాటిని కూడా జతపరిస్తే చిత్రం బాగుండేది ఏమో అన్న ఒక్క ఆశ మాత్రమే చివరికి ప్రేక్షకుడికి మిగిలేది.. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఎటువంటి ఇంగ్లీష్ సీరియల్ కిల్లర్ చిత్రాలు చూడకపోయుంటే మీకు కచ్చితంగా నచ్చే చిత్రం ఇది ...

Manchu Vishnu,Madhu Shalini,Tejaswini,Ram Gopal Varma.చివరగా : అనుక్షణం : అవిచక్షణ చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: