రకుల్ ప్రీత్ సింగ్, పృథ్వి ,బ్రహ్మానందం మరియు చంద్రమోహన్ పాత్రలు పండించిన కామెడీ ,నిర్మాణ విలువలు రకుల్ ప్రీత్ సింగ్, పృథ్వి ,బ్రహ్మానందం మరియు చంద్రమోహన్ పాత్రలు పండించిన కామెడీ ,నిర్మాణ విలువలు రొటీన్ కథనం ,మ్యూజిక్ ,కథ ,చిత్ర నిడివి.

వెంకటేశ్వరులు ( గోపీచంద్ ) వరంగల్ కుర్రాడు , వరంగల్ లో పెద్ద రౌడీ అయిన బాబ్జీ ( సంపత్ ) చెల్లెలిని పెళ్లి నుండి తీసుకెళ్ళి పోతాడు అప్పటి నుండి బాబ్జీ , శ్రీధర్ సీపాన అలియాస్ సిప్పీ ( బ్రహ్మానందం ) సహాయంతో వెంకిని వెతకడం మొదలు పెడతాడు. ఇదిలా నడుస్తున్న సమయంలోనే హైదరాబాద్ లో ఉన్న వెంకి, హైదరాబాద్ లో డాన్ అయిన సత్య ( రాహుల్ దేవ్ ) చెల్లెలు చంద్రకళ ( రకుల్ ప్రీత్ సింగ్ ) ప్రేమిస్తాడు. అప్పటి నుండి చందుని తన ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇదే సమయంలో బాబ్జి శత్రువు అయిన వరంగల్ కేశవ్ రెడ్డి (ముకేష్ రుషి) బాబ్జి చెల్లెలిని చంపాలి అని ప్రయత్నిస్తుంటాడు . సత్య , చందుని ఏం చేసాడు? బాబ్జికి వెంకి దొరికాడా ? చందు మరియు వెంకి ల ప్రేమ ఏమయ్యింది ? అసలు " లౌక్యం " అనే పేరుకి ఈ చిత్రానికి ఉన్న సంభంధం ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే .....

గోపీచంద్ నటనాపరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు, గతంలో ఎలా అయితే నటించాడో అదే నటన చూపించారు. ఈ చిత్రానికి అతని నటన పెద్దగా తోడ్పడింది లేదు.. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతున్నా కూడా ఆమెకి నటించడానికి ఎక్కువ అవకాశం దక్కలేదు అందుకేనేమో అందాలనే ఎక్కువగా నమ్ముకుంది ఈ విషయంలో ఈ నటి సఫలం అయ్యింది. చిత్రానికి ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ గోపీచంద్ మరియు రకుల్ ప్రీత్ మధ్య మధ్య కెమిస్ట్రీ సరిగ్గా వర్క్ అవుట్ అవ్వలేదు. బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అక్కడక్కడా బ్రహ్మానందం కామెడీ బాగా పేలింది, బ్రహ్మానందం మరియు చంద్రమోహన్, బ్రహ్మానందం మరియు సంపత్ మధ్యలో వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి . చంద్రమోహన్ చాలా రోజుల తరువాత కామెడీ పాత్ర లో కనిపించి నవ్వించారు. సంపత్ పాత్రకి తగ్గ నటన కనబరిచారు .. పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ ) నటన ఈ చిత్రానికి ఉన్న హైలెట్స్ లో ఒకటి.. చంద్రమోహన్ ,రాహుల్ దేవ్, ముకేష్ రుషి, భరత్, రఘుబాబు మొదలగువారు వారి వారి పాత్రల మేరకు నటించారు..

శ్రీధర్ సీపాన అందించిన కథ చిత్రంలో కనిపించదు లేదా అయన ఏం లేకుండానే కథ అని చెప్పెసారో తెలియట్లేదు చిత్రంలో కథ అని ఎక్కడా కనపడదు.. కథనం రాసిన కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఎప్పుడో కుట్టేసిన చొక్కాలోనే గోపీచంద్ ని దూర్చేసారు. గత పదేళ్ళలో ఇలాంటి చిత్రం కొన్ని వందల సార్లు వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు ... దర్శకత్వ పరంగా శ్రీవాస్ పరవాలేదనిపించుకున్నాడు .. మాటలు రచించిన శ్రీధర్ సీపాన ప్రాస కోసం పెట్టిన పరుగులో ప్రేక్షకులు అలసిపోయారు(వినలేక).. వెట్రి అందించిన సినిమాటోగ్రఫీ పరవాలేదు కానీ కొన్ని సన్నివేశాల వద్ద అనవసరం అయిన జూమ్ లు ఉపయోగించడం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతంలో పాటలు మరియు నేపధ్య సంగీతం రెండు ఆకట్టుకోలేదు.. ఎడిటింగ్ అందించిన ఎస్ఆర్ శేఖర్ పరవాలేదు. కానీ ఈ చిత్రం చాలా పొడవుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ...

తీసిన చిత్రాన్నే హీరోని మార్చి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు మరొక అవకాశం లేక జనం అవే చిత్రాలు చూస్తున్నారు. అంతేకాని హీరో ని మార్చినంత మాత్రాన కథకి కొత్తదనం వచ్చేయదు. ఈ చిత్ర విషయానికి వస్తే డీ, కందిరీగ, రెడీ చిత్రాల ఛాయలు చాలా కనిపిస్తాయి.. మొదటి అర్ధ భాగం కొన్ని కామెడీ సన్నివేశాలతో అలా అలా గడిచిపోతుంది. రెండవ అర్ధ భాగం మొదలవ్వగానే కథ మొత్తం పూర్తిగా కొత్తదిగా మారిపోతుంది. దాదాపు మొదటి అర్ధభాగంతో సంభంధం లేనంత మలుపు తిరుగుతుంది కథ.. హంస నందిని అందాలు, బ్రహ్మానందం మరియు చంద్రమోహన్ కామెడీ ఆకట్టుకుంటుంది కానీ క్లైమాక్స్ కి చేరుకునే కొద్దీ చిత్రం వేగం పూర్తిగా కోల్పోతుంది ఆ సమయంలో వచ్చిన పృథ్వి పాత్ర ఒక్క సారిగా చిత్ర వేగాన్ని పెంచుతుంది. ఇంత చెప్తున్నా కూడా హీరో గోపీచంద్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే అతని పాత్ర కూడా అంతే ఉంటుంది. రకుల్ ప్రీత్ అందాలను చూపించడంలో కనబరిచిన ఆసక్తి నటనలో కనబరచలేదు.. లౌక్యం అనే చిత్రం గతంలో చాలా సార్లు చూసిన చిత్రం.. గోపీచంద్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ కి మాత్రమే ఈ చిత్రం కొత్తది. ఇటు చేసిన వాళ్లకి, అటు చూసే వాళ్లకి ఈ సినిమా పాత చింతకాయ పచ్చడే ... మీరు రొటీన్ గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ సినిమాని ఒక్కసారి చూడచ్చు .. మిగిలిన వాళ్ళకి రొటీన్ గా కలిగే నిరాశే ఈ చిత్రానికి కూడా కలుగుతుంది....

Gopichand,Rakul Preeti Singh,Srivas,Anand Prasad,Anoop Rubens.లౌక్యం - పేరుకి మాత్రమే పరిమితం అయిన లౌక్యం

మరింత సమాచారం తెలుసుకోండి: