మూవీ కాన్సెప్ట్ , సినిమాటోగ్రఫీ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,మంచు లక్ష్మీ, మాస్టర్ ప్రేమ్ బాబు, బేబీ డాలీల పెర్ఫార్మన్స్ మూవీ కాన్సెప్ట్ , సినిమాటోగ్రఫీ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,మంచు లక్ష్మీ, మాస్టర్ ప్రేమ్ బాబు, బేబీ డాలీల పెర్ఫార్మన్స్స్టొరీ డెవలప్ మెంట్ ,వెరీ వెరీ బోరింగ్ స్క్రీన్ ప్లే ,వీక్ డైరెక్షన్ , అనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పలేక పోవడం , ఎడిటింగ్ ,డెడ్ స్లో అనిపించే నేరేషన్ ,లాజిక్స్ లేని క్లైమాక్స్

ఎలాంటి జబ్బునైనా నయం చేసే శక్తి తల్లి తండ్రుల స్పర్శకి, ప్రేమకి ఉందని అంటారు. అలా తల్లి తండ్రుల నుంచి సరైన ప్రేమ పిల్లల పట్ల లేకపోతే పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడమే ఈ ‘బుడుగు’. ఇక సినిమాలో చెప్పే కథ విషయానికి వస్తే.. ఓ హైఫై జాబ్ చేస్తూ ఓ గ్రేటెడ్ కమ్యూనిటీలో సెటిల్ అయిన ఫ్యామిలీ పూజ(లక్ష్మీ మంచు) – రాకేష్(శ్రీధర్ రావు)లది. బన్ని(మాస్టర్ ప్రేమ్ బాబు), ఆపిల్(బేబీ డాలీ)లు వారి సంతానం. చిన్ననాటి నుంచి తండ్రి ప్రేమ సరిగా లేకపోవడం వలన బన్ని అందరికన్నా కాస్త డిఫరెంట్ గా పెరుగుతాడు. దాంతో బన్ని కరెక్ట్ గా లేడని బోస్టన్ స్కూల్ లో వేస్తారు. ఆ బోస్టన్ స్కూల్ లో బన్ని విచిత్రంగా ప్రవర్తించి భయపెట్టడంతో అక్కడి నుంచి పంపేస్తారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన బన్ని రోజు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు. అలాగే చనిపోయిన దియా తనతో మాట్లాడుతుందని చెబుతుంటాడు. దాంతో పూజ బన్నిని చైల్డ్ సైకాలజిస్ట్ అయిన గీత రెడ్డి(ఇంద్రజ) దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఏం జరిగింది.? అసలు సైకాలజిస్ట్ ఏం చెప్పింది.? బన్ని ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు.? ఏ కారణం చేత బన్నికి దియా కనబడుతోంది.? అబ్నార్మల్ గా బిహేవ్ చేసే బన్ని చివరికి మామూలు మనిషి అయ్యాడా.? లేదా.? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి.

సినిమా మొత్తం మీద మనకు కనిపించే కీలక పాత్రలు ఐదే ఐదు.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మంచు లక్ష్మీ గురించి. ఒక మదర్ పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచింది. చాలా సన్నివేశాల్లో పిల్లల పట్ల తల్లి పడే ఆవేదనని చాలా బాగా చూపించింది. సెకండాఫ్ లో వచ్చే హర్రర్ సీన్స్ లో తను చూపిన నటన ప్రేక్షకులను కట్టి పడేస్తది. మాస్టర్ ప్రేమ్ బాబుకి ఇది మొదటి సినిమా అయినా సీనియర్ యాక్టర్స్ తో పోటీ పది పెర్ఫార్మన్స్ చేసాడు. ప్రేమ్ చూసే కోపమైన చూపులు, దెయ్యం ఉందని అతను క్రియేట్ చేసే కొన్ని ఫీలింగ్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఇక బ్యూటీ క్యూట్ గా ఉండే డాలీ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ చెప్పినా పెర్ఫార్మన్స్ మాత్రం ఇరగదీసింది. మాటలు రాని పిల్లగా కనిపిస్తూ కళ్ళతోనే భావాలు పలికించడం మెచ్చుకోదగినది. శ్రీధర్ రావు ఒక ఫాదర్ గా చాలా డీసెంట్ గా చేసాడు. సెకండాఫ్ లో లక్ష్మీ – ప్రేమ్ – శ్రీధర్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక చైల్డ్ సైకాలజిస్ట్ గా ఇంద్రజ కూడా బాగా నటించింది. తన పాత్ర చాలా కీలకం, కానీ ఆ పాత్ర ద్వారా అనుకున్న కాన్సెప్ట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోయాడు. 

ఓ సినిమాకి కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్టర్.. కథ – కథనంలో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నా ఒక్క డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే, అనుకున్న పాయింట్ రీచ్ అయ్యేలా ఆద్యంతం ఆసక్తిగా చెప్పగలిగితే ఆ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే సినిమాలు చూసే ప్రతి ఒక్కరిలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తీస్తే సూపర్ గా ఉంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు, కానీ ఆ పాయింట్ ఓ అందమైన కథలా అల్లుకొని, అంతే ఆసక్తిగా చెప్పగల సత్తా ఉన్నోడే డైరెక్టర్ అవుతాడు. ఇలానే నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ కత్తి కేక.. అనుకోని గుడ్డిగా వచ్చి సినిమాలు చేసే చాలా మంది దర్శకులు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని, ఫెయిల్యూర్ డెబ్యూ డైరెక్టర్ గా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళ లిస్టులో తాజాగా బుడుగు డైరెక్టర్ మన్మోహన్ కూడా చేరాడు.. ఎందుకనే విషయానికి వస్తే.. మన్మోహన్ కి తన బంధువుల ఇంట్లో ఎదురైన ఓ సమస్య ఏ.డి.హెచ్.డి అనగా అటేన్షన్ డెపిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ రోగాన్ని బేస్ చేసుకొని తను చెప్పాలి అనుకున్న పాయింట్ తల్లి తండ్రులు పిల్లలతో కాస్త సమయం కేటాయించాలి, ప్రేమని ఇవ్వాలి.. ఒకవేళ పిల్లలతో సరిగా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయన్నది చూపించడానికి ట్రై చేసాడు. ఈ మధ్య కాలంలో తల్లి తండ్రులు అస్సలు పిల్లలతో టైం స్పెండ్ చేయట్లే, కావున డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ మెచ్చుకోదగినది. ఇంత వరకూ ఓకే.. కానీ సినిమాకి వచ్చిన ప్రేక్షకులని చివరి దాకా కూర్చోబెట్టాలి అంటే ఒక మంచి పాయింట్ ఉంటే సరిపోదు, ఆ మంచి పాయింట్ ని ఎంతో ఎంగేజింగ్ గా ఆడియన్స్ చెప్పాలి. డైరెక్టర్ మన్మోహన్ కథని ఎక్కడా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. ఎక్కడా ఆడియన్స్ కి థ్రిల్స్ ఇవ్వలేకపోయాడు. చివరికి ఎదో చేసెయ్యాలి అనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్ తో అనుకున్న పాయింట్ ని కూడా సరిగా చెప్పలేకపోయాడు. సైకలాజికల్ థ్రిల్లర్ అంటే లాజికల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, లేని దాన్ని కూడా పర్ఫెక్ట్ గా నమ్మించగలగాలి. కానీ ఇందులో లాజిక్స్ లేవు, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే మేజిక్స్ కూడా చెయ్యలే. ఉదాహరణకి దియా పాత్రని ఒకలా చూపుతారు, కానీ చివరికి ఎండ్ లో చూపించే దానికి అస్సలు సంబంధం ఉండదు. అలాగే బన్ని పాత్ర రకరకాలుగా బిహేవ్ చేస్తుంటుంది, అసలెలా చేయగలిగాడు, అనేవాటికి లాజికల్ గా సమాధానం చెప్పలేదు. బన్ని తల కిందులుగా ఎలా నడవగలిగాడు, బాత్ రూమ్ లో ఉండాల్సిన వాడు బయట ఎలా ఉన్నాడు.? ఇంట్లో అన్నీ పగలు కొట్టి ఏదేదో గోడల మీద రాస్తే అది ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని తనకి ఎలా తెలిసింది.? ఇలాంటివి చాలానే సినిమాలో ఉంటాయి. ఇక్కడ ఇంకో సిల్లీ పాయింట్ ఏమిటి అంటే ఫాదర్ ఏ కారణం చేత బన్నితో సరిగా ఉండడు అనేదాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇకపోతే పాయింట్ ని బాగానే ఉన్నా దాన్ని కథలా రాసుకున్న విధానం బాలేదు, దానికి తోడు రాసుకున్న కథనం ఇంకా బోరింగ్ గా ఉంది. ఎక్కడా ఆడియన్స్ ని సీట్లో కూర్చో బెట్టాలి అన్న ప్రయత్నం చేయలేదు. ఇక డైరెక్టర్ గా పెర్ఫార్మన్స్ లు రాబట్టుకున్నా ఎంగేజింగ్ గా కథని మాత్రం చెప్పలేకపోయాడు. డైరెక్టర్ అనేవాడు ఈ రేంజ్ లో ఫ్లాప్ అయినప్పుడు సినిమా రిజల్ట్ కూడా అలానే ఉంటుంది.                

ఇక దాని నుంచి పక్కకి వస్తే సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ సూపర్బ్.. ఓ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన లైటింగ్ ఎఫెక్ట్స్ ని పర్ఫెక్ట్ గా వాడాడు. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకి మరో పెద్ద అసెట్, సినిమా ఎంత అర్ధవంతంగా పోతున్నా కేవలం మ్యూజిక్ నెక్స్ట్ ఎదో జరిగిపోద్ది అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం వల్లే ఆడియన్స్ కాస్తో కూస్తో సీట్లో కూర్చోగలిగారు. శ్యాం మెంగ ఎడిటింగ్ బాలేదు, డైరెక్టర్ అలానే కావాలని చెప్పడం వల్ల అనుకుంటా ఆయన ఎలా అడిగితే అలా కట్ చేసేసాడు, కానీ సినిమా ఎంత బాగా వస్తోంది అన్న విషయం మరచిపోయాడు. రామ్ ఆర్ట్ వర్క్ వెరీ డీసెంట్. భాస్కర్ – సారిక శ్రీనివాస్ ల ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. 

సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్ ఒక్కటే బాగుంటే సరిపోదు.. ఆ లైన్ చుట్టూ అల్లుకునే కథ, కథనం, డైరెక్షన్ కూడా బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది, ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుంది అని ప్రూవ్ చేసిన మరో సినిమానే ‘బుడుగు’. ఇప్పటి వరకూ లైన్ మాత్రం కేక, ఎగ్జిక్యూషన్ మాత్రం చెడగోట్టేసాడు అని చెప్పుకున్న చాలా సినిమాల లిస్టులో ‘బుడుగు’ కూడా చేరిపోయింది. ఎప్పుడు నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా చెప్పడం చాలా కష్టం అయిన పని. ఆ కథని మనం ఫీలయ్యేలా చెప్పగలిగినప్పుడే అందులోని ఫీలింగ్ ని ఆడియన్స్ క్యారీ చేస్తారు, కానీ ఈ సినిమా విషయంలో డైరెక్టర్ అది చేయలేకపోయాడు. బుడుగు సినిమాలో ఆడియన్స్ కి నచ్చేది ఏమన్నా ఉంది అంటే నేటితరం తల్లి తండ్రులకు తను ఇవ్వాలనుకున్న మెసేజ్, అది తప్ప తన జేబులోని డబ్బు పెట్టుకొని వచ్చిన ప్రేక్షకుడు రెండు గంటల పాటు ఎంజాయ్ చేయగల స్టఫ్ బుడుగులో లేదు. డైరెక్టర్ కి ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పేస్తున్నామన్న ఫీలింగ్ తప్ప ఆ కాన్సెప్ట్ ని ఎంతో ఆసక్తిగా ఆడియన్స్ కి చెప్పాలి అన్న విషయం మాత్రం గాలికి వదిలేసాడు. దాని రిజల్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ‘జంప్ జిలానీ’. ఫైనల్ గా ప్రేక్షకుల గుండెల్లో పడే పిడుగు పాటే ఈ ‘బుడుగు’. 

Manchu Lakshmi,Sreedhar Rao,Manmohan,Bhaskar,Sarikar Srinivas,Sai Kartheek.పంచ్ లైన్ : బుడుగు – ప్రేక్షకుల పాలిట ‘పిడుగు’

మరింత సమాచారం తెలుసుకోండి: