సినిమాటోగ్రఫీ,మిక్కీ జె మేయర్ సాంగ్స్సినిమాటోగ్రఫీ,మిక్కీ జె మేయర్ సాంగ్స్అనుకున్న స్టొరీ పాయింట్ ని చెప్పలేకపోవడం,కథనం,నత్తకన్నా స్లోగా సాగే నెరేషన్,ఎడిటింగ్,అవసరానికి మించిపోయిన ఫైట్స్, సందర్భానుసారంగా రాణి పాటలు,నటీనటులకి పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ లేకపోవడంఈ సినిమా కథ కాకినాడలో జరుగుతుంది. అర్జున్ - ముకుంద మంచి ఫ్రెండ్స్. అదే ఊర్లో ఉండే ముస్సిపల్ చైర్మెన్ సుబ్రహ్మణ్యం(రావు రమేష్) రాజకీయనాయకుడి ముసుగులో రౌడీయిజం చేస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం కి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్దమ్మాయిని అర్జున్ ప్రేమిస్తాడు. అది తెలిసిన సుబ్రహ్మణ్యం అర్జున్ ని చంపడానికి ట్రై చేస్తుంటే, ఎప్పటికప్పుడు ముకుంద అర్జున్ ని కాపాడుతూ ఉంటాడు. అదే టైంలో ముకుంద సుబ్రహ్మణ్యం రెండవ కుమార్తె అయిన పూజ(పూజ హెగ్డే)ని చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా ఊరి మంచి కోసం వార్డ్ ఎలక్షన్స్ లో ముకుంద సుబ్రహ్మణ్యంకి పోటీగా ప్రకాష్ రాజ్ ని నిలబెడతాడు. అనుకున్నట్టుగానే ఆ ఎలక్షన్స్ లో సుబ్రహ్మణ్యం ఓడిపోతాడు. ఎలక్షన్స్ లో ఓడిపోయిన సుబ్రహ్మణ్యం ముకుందని ఏం చేసాడు.? అలాగే ముకుంద తన ప్రేమని పూజకి చెప్పాడా.? లేదా.? పూజ కూడా ముకుందని ప్రేమించిందా.? లేదా. ? అలాగే ముకుంద అర్జున్ ని తను ప్రేమించిన అమ్మాయితో కలిపాడా.? లేదా.? ఇదే సమయంలో సుబ్రహ్మణ్యం చేసిన ప్లాన్ లో ఎవరన్నా బలైపోయారా.? అనేది తెలియాలంటే మీరు ఈ ముకుంద మూవీ చూడాల్సిందే..చెట్టు మంచిదైతే కాయలు వాటంతట అవే బాగుంటాయి అనే సామెత గుర్తుందా... అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి స్టార్ ఇమేజ్ వస్తే చాలు ఆ పేరు చెప్పుకొని లేదా ఆ ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. అలా మెగాస్టార్ చిరు మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయమైన 6వ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా 'ముకుంద' ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇక మన న్యూ మెగా హీరో వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఈ సినిమా ట్రైలర్ లో రావు రమేష్ చెప్పిన డైలాగ్ గుర్తుందా... మొన్నే చూసా మీ అబ్బాయిని కుర్రాడు బాగున్నాడు.. చెప్పినట్టుగానే వరుణ్ తేజ్ చూడటానికి ఒడ్డు, పొడుగు, లుక్స్ అన్ని బాగున్నాయి. అలాగే వరుణ్ తేజ్ చూపించిన మానరిజమ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ హీరో అవడానికి ఇవి మాత్రం ఉంటే సరిపోవు, కాస్తో కూస్తో నటనాపరంగా అవగాహన ఉండాలి. కనీసం నటనలో అ, ఆలు అన్నా నేర్చుకొని వచ్చి ఉంటే బాగుండేది. అవికూడా నేర్చుకోకపోవడంతో ఆడియన్స్ ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా అంతా చూడాల్సి వచ్చింది. దీన్ని బట్టి బాబు ఇకనన్నా నటన నేర్చుకోవడం మొదలు పెట్టాలి ఎందుకంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పెర్ఫార్మన్స్ పరంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న పాత్రకి న్యాయం చెయ్యలేకపోయాడు. ఇలాంటి ఇంటెన్స్ పాత్ర చెయ్యాలి అంటే కాస్త అనుభవం ఉండాలి. అది వరుణ్ తేజ్ లో లేకపోవడంతో అనుకున్న రీతిలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వలేదు. వరుణ్ తేజ్ ముందు ముందు రానున్న సినిమాల్లో డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్స్ పై కూడా చాలా శ్రద్ద తీసుకోవాలి. ఇక హీరోయిన్ గా పూజ హెగ్డే లూక పరంగా బాగుంది. ముఖ్యంగా నందలాల, గోపికమ్మ సాంగ్స్ లో చూడటానికి చాలా బాగుంది. కథా పరంగా పూజ పాత్రకి ఆవగింజంత కూడా ప్రాముఖ్యత లేకపోవడంతో పూజ పెర్ఫార్మన్స్ పరంగా చెయ్యడానికి ఏమీ లేదు.

హీరో హీరోయిన్ తర్వాత చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించి.. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రావు రమేష్ పెర్ఫార్మన్స్ ఆదరగోట్టేసాడు. చెప్పాలంటే పెర్ఫార్మన్స్ పరంగా ఈ సినిమాకి హీరో ఎవరు అంటే రావు రమేష్ అనే చెప్పాలి. అంతలా సినిమాకి ప్రాణం పోసాడు. తనుకూడా లేకపోతే సినిమా ది బెస్ట్ బోరింగ్ సినిమా అయ్యుండేది. ఇకపోతే ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్ సినిమాలో అసలు ఎందుకు ఉన్నడా అనిపిస్తుంది. అలాగే అతనికి ఓ పర్ఫెక్ట్ క్యారెక్టర్ లేదు. దాంతో ఆడియన్స్ కి టార్చర్ లా అనిపిస్తుంది ప్రకాష్ రాజ్ ట్రాక్.. పరుచూరి వెంకటేశ్వరరావు, నాజర్, సత్యదేవ్, రఘు బాబులు చేసిన పాత్రలు చిన్నవే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసారు. కానీ ఈ పాత్రల వల్ల సినిమాలో లూప్ హోల్స్ ఎక్కువైపోయాయి.నటీనటుల డిపార్ట్ మెంట్ లో రావు రమేష్ మాత్రమే తన పాత్రకి పూర్తి న్యాయం చేసినట్టు టెక్నికల్ టీంలో కూడా కొందరు తన డిపార్ట్ మెంట్స్ పరంగా సినిమాని సూపర్బ్ అనిపించడానికి ట్రై చేసారు. వారిలో ప్రముఖులుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ మనికందన్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మరియు డైలాగ్స్. మనికందన్ సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. ఇచ్చిన లోకేషన్స్ తక్కువే అయినా ఉన్నంతలో బాగా చూపించాడు. అలాగే పాటలని చాలా కలర్ఫుల్ గా చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో హీరో మానరిజమ్స్ మరియు పోస్టర్స్ ని బాగా చూపించాడు. ఇకపోతే సినిమా స్లో అయిపోఅతున్న ప్రతిసారి మిక్కీ జే మేయర్ మాత్రం తన మ్యూజిక్ తో ఆడియన్స్ లో కాస్ట్ ఊపు తేవడానికి ట్రై చేసాడు. ఇకపోతే మిక్కీ జే మేయర్ చాలా మంచి సాంగ్స్ అందించాడు, పిక్చరైజేషన్ కూడా బాగుంది, కానీ కథలో మాత్రం ఒక్క పాట కూడా అవసరం లేదని అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇకపోతే ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ చాలా వరకూ కత్తెర వేసి ఉండవచ్చు. కానీ ఆయన అలాంటి కేర్ ఏమీ తీసుకోలేదు. ఎంతసాగదీసి తీసిన 2 గంటల్లో పూర్తి చేయాల్సిన ఈ సినిమాని గంటల 22 నిమిషాలకి సాగదీసి ఆడియన్స్ కి నరకం చూపించారు. ఇకపోతే శ్రీకాంత్ అడ్డాల గురించి చెప్పాలి. శ్రీ కాంత్ అడ్డాల చేఇస్న ఈ సినిమా 1990లలో రావాల్సిన కథ కానీ 2014 చివర్లో వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలు పలు తెలుగు కమర్షియల్ సినిమాలు కనపడతాయి. శ్రీ కాంత అడ్డాల తన రూటు మార్చి కమర్షియల్ ఎంటర్ టైనర్ చెయ్యాలనుకొని తన చెయ్యి తనే కాల్చుకున్నాడు. కథాపరంగా మీరు ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర మాత్రమే కాస్త థ్రిల్ ఫీలవుతారు. అలాగే ఆ తర్వాత అనుకున్న రీతిలో ఎలివేట్ చెయ్యకుండా క్లైమాక్స్ ని కూడా చాలా సింపుల్ గా ముగించేయడం బాలేదు. కథనం అస్సలు బాలేదు. చాలా బోరింగ్ గా చెప్పడం అస్సలు బాలేదు. ఇకపోతే డైరెక్టర్ గా కూడా శ్రీ కాంత్ అడ్డాల ఫెయిల్ అయ్యాడు. న్యూ హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు తన నుంచి నటనని ఎంతవరకూ రాబట్టుకున్నాడు అనేది డైరెక్టర్ మీదే డిపెండెంట్ అయ్యి ఉంటుంది. కానీ ఆ విషయంలో డైరెక్టర్ గా కూడా శ్రీ కాంత్ అడ్డాల ఫెయిల్ అయ్యాడు. నల్లమలపు బుజ్జి - ఠాగూర్ మధు నిర్మాణ విలువలు బాగున్నాయి.ఇప్పటివరకూ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసింది రెండు సినిమాలే.. అవి కూడా తెలుగుదనం కనపడే స్వచ్చమైన కుటుంబ కథా చిత్రాలు.. ఆ రెండింటిని సమర్ధవంతంగా డీల్ చెయ్యడంలో శ్రీ కాంత్ అడ్డాల సక్సెస్ అయ్యాడు. కానీ మొదటిసారి తనకు బాగా తెలిసిన జోనర్ నుంచి కాస్త బయటకి వచ్చి ఓ లవ్ స్టొరీకి యాక్షన్ ప్లస్ హీరోయిజంని మిక్స్ చేసాడు. అలా చేసిన 'ముకుంద' సినిమా చూస్తున్న ఆడియన్స్ కి గుదిబండలా అనిపించింది. దీనికి కారణం శ్రీకాంత్ అడ్డాల కొత్త కొత్త అంశాలను ట్రై చేసి దెబ్బైపోవడమే.. ఇలా డబ్బైపోవడం వలన కంటెంట్ తక్కువై, ఫైట్స్ మాత్రమే మిగిలాయి.. ఇదంతా ఒక ఎత్తైతే సినిమా మొత్తం హీరో - హీరోయిన్ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు కానీ డ్యూయెట్ల మీద డ్యూయెట్స్ వస్తుంటాయి. దాంతో ఆడియన్స్ కి చిరాకొస్తుంది. అసలు లవ్ ట్రాక్ చూపించకుండానే డ్యూయెట్స్ ఏందిరా బాబు అని తల పట్టుకుంటారు.. సినిమాలో ఫస్ట్ హాఫ్ ని భరించడమే కష్టం అనుకుంటే దానికన్నా దారుణంగా సెకండాఫ్ ఉంటుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్ చేత నరకానికి స్పెల్లింగ్ రాయించారు. ఈ సినిమా చూసాక మాకు ఒకటే అర్థమైంది.. ఏ డైరెక్టర్ అయినా ఒక కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తియ్యాలి అంటే అనాదిగా వస్తున్న ఒకటే ఓల్డ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఈ సినిమా పరంగా కూడా శ్రీ కాంత్ అడ్డాల కూడా అదే చేసాడు, కానీ ఆడియన్స్ ని మెప్పించేలా అటెంప్ట్ చెయ్యలేకపోయాడు. దాంతో సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బొక్క పడింది. ఓవరాల్ గా బోరింగ్ ఫస్ట్ హాఫ్, దానికన్నా టార్చర్ గా అనిపించే సెకండాఫ్, ఆడియన్స్ కి అస్సలు కనెక్ట్ కాని లవ్ ట్రాక్, 4 ఫైట్స్ అవసరం అయితే 8 ఫైట్స్ ఉండడం చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.. సినిమా ద్వారా హీరోయిజం ఎలివేట్ చెయ్యాలి, మాస్ ఇమేజ్ రావాలి అంటే కథలో కంటెంట్ ఉండాలి, అంతేకానీ ఫైట్స్ ఉంటే మాస్ ఇమేజ్ వస్తుందనుకోవడం ఓ పెద్ద భ్రమ. ఇకనైనా డైరెక్టర్స్ ఈ విషయం తెలుసుకోవాలి.. వరుణ్ తేజ్ సినిమా ఎంట్రీని అన్యాయంగా హుస్సేన్ సాగర్ లో ముంచేసిన సినిమా 'ముకుంద'.Varun Tej,Pooja Hegde,Srikanth Addala,Tagore Madhu,Nallamallapu Srinivas, Mickey J Meyer.పంచ్ లైన్ : ముకుంద - వరుణ్ తేజ్ ని ముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: