ఒరిజినల్ స్టొరీ లైన్ , సినిమాటోగ్రఫీ , బాగా నవ్వించే కొన్ని కామెడీ సీన్స్ఒరిజినల్ స్టొరీ లైన్ , సినిమాటోగ్రఫీ , బాగా నవ్వించే కొన్ని కామెడీ సీన్స్మేజిక్ రిపీట్ చెయ్యలేని డైరెక్షన్ , సాగదీసినట్టు ఉండే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సాంగ్స్ మిస్ ప్లేస్ మెంట్, నేటివిటీ ఫీల్ మిస్ అవ్వడంగడ్డం దాస్(రాజశేఖర్) ఒక కిడ్నాపర్. కానీ అందరిలా కాకుండా తనకంటూ ఒక సెపరేట్ రూల్స్ రాసుకొని డిఫరెంట్ గా కిడ్నాప్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉంటాడు. అదే టైంలో గడ్డం దాస్ కి నిరుద్యోగులైన రమేష్(సత్యం రాజేష్), సురేష్(అచ్చు), పండు పరిచయం అవుతారు. అలా పరిచయం అయిన ఈ ముగ్గురికి గడ్డం దాస్ కిడ్నాపింగ్ స్టైల్ నచ్చి అతనితో కలిసి కిడ్నాప్స్ చేస్తుంటారు. ఒకరోజు వాళ్ళు కిడ్నాప్ చేసిన వారిలో ఒకరైన నమ్మినబంటు(కాదంబరి కిరణ్) వాళ్ళ కిడ్నాపింగ్ స్టైల్ నచ్చి ఆర్ధిక శాఖ మంత్రి ధర్మరాజు(సీనియర్ నరేష్) కొడుకుని కిడ్నాప్ చెయ్యమని, చేస్తే ఓ భారీ అమౌంట్ ఇస్తానని చెబుతాడు. ఆ డీల్ నచ్చిన గడ్డం దాస్ గ్యాంగ్ మినిస్టర్ ధర్మరాజు కొడుకుని కిడ్నాప్ చేస్తారు. అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతూ ఉండడం వలన గడ్డం గ్యాంగ్ కి పలు సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలేమిటి.? అసలు ఎవరి వల్ల ఆ సమస్యలు వస్తున్నాయి.? ఆ సమస్యల నుండి తప్పించుకోవడానికి గడ్డం గ్యాంగ్ చేసిన సాహసాలు ఏమిటనేది మీరు సిల్వర్ స్క్రీన్ పైనే చూసి ఎంజాయ్ చెయ్యాలి.. ఈ సినిమాకి హీరో అంటూ చెప్పుకునే పేరు డా. రాజశేఖర్ కావున ముందుగా ఆయన గురించే చెబుతా.. గడ్డం దాస్ పాత్రలో రాజశేఖర్ పెర్ఫార్మన్స్ తెలుగు సినిమాలో కావాల్సిన దానికన్నా ఎక్కువగా, తమిళ్ సినిమాకి కావాల్సిన దానికన్నా చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు అన్నాను అంటే.. తెలుగులో రాజశేఖర్ పాత్రకి అవసరం అయిన మోతాదులో కొన్ని సీన్స్ లో మాత్రమే చేసాడు మిగతా అన్ని చోట్లా పాత్ర పావలా పెర్ఫార్మన్స్ అడిగితే రూపాయి పావలా చేసినట్టు అనిపిస్తుంది. ఐదు పదుల వయసులో కూడా పాత్రకి తగ్గట్టుగా కనిపించడానికి బాగా ట్రై చేసాడు, కొన్ని చోట్ల డీసెంట్ గా కనిపించినా, కొన్ని చోట్ల మాత్రం బాగా ఏజ్ అయిన వాడిలా కనిపిస్తాడు. పేరుకి ఈ సినిమాలో హీరోయిన్ గా షీన కనిపించింది. కానీ ఆ పాత్రని హీరోయిన్ అని చెప్పాలా లేక అతిధి పాత్ర అని చెప్పాలా అన్నది మాత్రం మిస్టరీ.. తమిళ్లో ఈ పాత్ర అందరినీ అట్రాక్ట్ చేస్తే తెలుగులో మాత్రం ఆడియన్స్ కి తలనొప్పిగా తయారయ్యింది. సో స్కిన్ షో పరంగా తప్ప కథకి ఉపయోగంలేని పాత్ర షీన చేసింది.. మొదటి సారి స్క్రీన్ పై కనిపించిన మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు చాలా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. కమెడియన్ సత్యం రాజేష్, పండు పాత్ర చేసినతను, నాగబాబు ఆడియన్స్ ని అక్కడక్కడా బాగానే నవ్వించారు. సత్య హరిశ్చంద్ర పాత్ర చేసిన యంగ్ యాక్టర్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా యోగ్ జప్పె మంచి నటనని కనబరిచాడు. కానీ ఆ పాత్ర గురించి డైరెక్టర్ ఆడియన్స్ కి కాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. సీనియర్ నరేష్, సప్తగిరి, రఘుబాబు, గిరిబాబులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. ఒక సినిమాకి కెప్టెన్ ఎవరు అంటే డైరెక్టర్ అంటారు కాబట్టి డైరెక్టర్ నుంచే మొదలు పెడతా.. తమిళ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ స్క్రిప్ట్ ఇక్కడ ఆ మేజిక్ క్రియేట్ చెయ్యలేకపోవడానికి ఏకైక కారణం సంతోష్ పీటర్ జయకుమార్ డైరెక్షన్. కథ ఒక్కటి బాగుంటే చాలు సినిమా ఎలా తీసినా ఆడేస్తుంది అనుకోవడం డైరెక్టర్ పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే గడ్డం గ్యాంగ్ విషయంలో డైరెక్టర్ సంతోష్ అదే ఫాలో అయ్యాడు. కథ బాగుంది, సినిమా ఆల్రెడీ చూసాం.. సో సీన్ టు సీన్ తీసెయ్, తమిళ్ తెలుగు తెలిసన వారిని పెట్టుకొని డైలాగ్స్ మక్కికి మక్కి దించెయ్.. అంతే రీమేక్ సినిమా రెడీ అయిపొయింది అనేలానే సంతోష్ డైరెక్షన్ ఉంది తప్ప, ఒక ప్యూర్ తమిళ్ కంటెంట్ ని తెలుగు వారికి కనెక్ట్ అయ్యేలా చెప్పాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నం మనకు ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. డైరెక్టర్ కూడా తమిళవాడు కావడం వలనే అనుకుంటా సినిమాలో తమిళ ఛాయలు ఎక్కువగా, తెలుగు ఛాయలు తక్కువగా కనిపిస్తాయి. కనీసం తెలుగు కమెడియన్స్ ని అన్నా ఎక్కువగా పెట్టుకొని, కామెడీ పై ఇంకాస్త వర్కౌట్ చెయ్యాల్సింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే డైరెక్టర్ సరిగా డీల్ చేయలేకపోవడం వలన ఓ మంచి కాన్సెప్ట్ ని రీమేక్ పేరుతో చెడగొట్టారు.. మిగిలిన డిపార్ట్ మెంట్స్ లో డెమెల్ ఎక్స్ ఎడ్వర్డ్స్ సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. లొకేషన్స్ ని బాగా చూపించాడు. ఎడిటర్ రిచర్డ్ కెవిన్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసేలా ఫాస్ట్ గా ఉండేలా ఎడిటర్ చెయ్యాలి కానీ అది మిస్ అయిపొయింది, సినిమాకి దెబ్బడిపోయింది. అచ్చు సాంగ్స్ చాలా బాగున్నాయి, కానీ సినిమాలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ టైంలో పడలేదనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మైనస్ అనే చెప్పుకోవాలి. మేజర్ ఎలివేషన్ సీన్స్ లో అచ్చు సరైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఆర్ట్ డిపార్ట్ మెంట్ వెంకట్ పెద్దగా కష్టపడలేదు. తమిళ్ లో ఎలా ఉంటాయో లొకేషన్స్ వాటినే రీ క్రియేట్ చేసాడంతే.. శివాని - శివాత్మిక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. ఒక రీమేక్ సినిమా అంటే అదేదో భాషలో హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి, దానిలోని సీన్స్ ని కెమెరా షాట్స్ తో సహా యాజిటీజ్ గా తియ్యడం కాదని, అందులో ఉన్న కంటెంట్ లేదా ఎమోషన్ ని మన తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చెప్పడం అని ఎప్పటికి తెలుసుకుంటారో.. ఓపెన్ గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ కి తమిళ ఆడియన్స్ కి తెలుగు ఆడియన్స్ కి మధ్య ఉన్న తేడా తెలియకపోవడం వలనే తమిళంలో సూపర్ హిట్ అయిన 'సూదు కవ్వం' లాంటి ఒక న్యూ కాన్సెప్ట్ తెలుగులో బూడిదలో పోసిన పన్నీరు అయిపొయింది. రీమేక్ వెర్షన్ అయిన 'గడ్డం గ్యాంగ్' సినిమాలో కాస్తో కూస్తో మీకు ఊరటని ఇచ్చేది అంటే అది ఒరిజినల్ కాన్సెప్ట్, కొన్ని కామెడీ సీన్స్, కొందరి పెర్ఫార్మన్స్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. అసలు సినిమాలో హీరోయిన్ హీరోకి మాత్రమే ఎందుకు కనిపిస్తుంటుంది.? అసలు ఎవరికీ కనపడని తను యాక్సిడెంట్ లో ఎలా చనిపోతుంది.? పోలీస్ రివెంజ్ టైంలో పాట ఎందుకు వస్తుంది.? అనే లాజికల్ లూప్ హోల్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. వీటికి తోడు ఆడియన్స్ కి కనెక్ట్ కాని స్లో స్క్రీన్ ప్లే, తెలుగు సినిమా అనే ఫీల్ మిస్ అవ్వడం సినిమాని బాక్స్ ఆఫీసు వద్ద ఎక్కువ రోజులు నిలవనీయకుండా చేసాయి. ఫైనల్ గా మీరు తమిళ ఒరిజినల్ వెర్షన్ సూదు కవ్వం చూసి ఉంటే ఈ గడ్డం గ్యాంగ్ ని సింపుల్ గా స్కిప్ చెయ్యండి, లేదంటే మీకు ఓ డిఫరెంట్ సినిమా చూడాలి అనే ఫీలింగ్ ఉంటే ట్రై చెయ్యచ్చు.. కానీ మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరిచేలా మాత్రం సినిమా ఉండదు.. Rajasekhar,Sheena Shahabadi,Santhosh P,Jeevitha,Achu.పంచ్ లైన్ : గడ్డం గ్యాంగ్ - హిట్ ని ఫట్ చేసిన 'గడ్డం గ్యాంగ్'

మరింత సమాచారం తెలుసుకోండి: