కొన్ని హర్రర్ ఎలిమెంట్స్, కార్తీక్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,ఆండ్రియా జెరేమియా పెర్ఫార్మన్స్కొన్ని హర్రర్ ఎలిమెంట్స్, కార్తీక్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,ఆండ్రియా జెరేమియా పెర్ఫార్మన్స్రొటీన్ హర్రర్ కామెడీ స్టొరీ,ఊహాజనితమైన కథనం,పలు సినిమాల నుంచి స్ఫూర్తిగా తీసుకున్న సీన్స్,సినిమా రన్ టైం, నాశిరకమైన విజువల్ ఎఫెక్ట్స్, సాగదీసిన క్లైమాక్స్, సాంగ్స్,ఎడిటింగ్ మురళి(వినయ్ రాయ్) కుటుంబానికి చెందిన ఓ జమిందార్ బంగ్లా చల్లపల్లిలో ఉంటుంది. ఆ రాజభవనాన్ని వేరేవారికి అమ్మేయడం కోసం మురళి, తన భార్య మాధవి(ఆండ్రియా) మరియు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాజభవనానికి వస్తారు. అక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళందరికీ కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతుంటాయి. అప్పుడే ఆ ఇంటికి మాధవి అన్న అయిన రవి(సుందర్ సి) వస్తాడు. ఆ ఇంట్లో జరుగుతున్న భయానక సంఘటనల వెనకున్న కారణాలు తెలుసుకోవాలనుకునే టైంలో రవికి తన చెల్లికే దెయ్యం పట్టిందని తెలుస్తుంది. దానికి కారణం చంద్రకళ(హన్సిక) అని రవి తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రవి ఏం చేసాడు.? అసలు ఈ చంద్రకళ ఎవరు.? తన గతం ఏంటి.? చంద్రకళకి ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి.? అసలు గతంలో ఏం జరిగింది.? చివరికి మాధవికి పట్టిన దెయ్యం వదిలిందా.? లేదా.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..ఈ సినిమాలో పాత్రలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచిన నటీనటుల నుంచి చెప్పడం మొదలు పెట్టి దిష్టికి తప్ప ఎందుకూ పనికిరాని బూడిద గుమ్మడికాయలా, సినిమాలో గ్లామర్ కి తప్ప పెద్దగా ఉపయోగంలేని పాత్రలతో ముగిస్తాను.. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. అందులో మేజర్ క్రెడిట్ దక్కించుకున్న హీరోయిన్ ఆండ్రియా జెరేమియా.. ఆండ్రియా సినిమాలో అటు గ్లామరస్ గా ఉంటూనే చీరల్లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది లుక్స్ పరంగా, ఇక నటన పరంగా వస్తే దెయ్యం పట్టినట్టు చేసే కొన్ని సీన్స్ చాలా బాగా చేసింది, అక్కడక్కడా ఆడియన్స్ భయపెట్టింది కూడా.. అది కాకుండా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ రొమాంటిక్ సీన్ లో ఆడియన్స్ కి కైపెక్కించేసింది. ఇక చెప్పాల్సింది హన్సిక గురించి.. ఈ భామ సినిమాలో కనిపించేది ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే అయినా ఉన్నంతలో బాగా చేసింది . ఓన్లీ గ్లామర్ పాత్రలే చేసే హన్సిక ఈ సినిమాలో కాస్త డీ గ్లామర్ పాత్ర చేసింది. ఇక సుందర్ సి విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకుడిగానే కాకుండా ఓ కీ రోల్ ని కూడా చేసాడు. ఒక లాయర్ గా తన చెల్లికి ఏమైంది, ఎందుకలా చేస్తోంది, దానికి పరిష్కారం ఏమిటి అని వెతికే పాత్రలో మంచి నటననే కనబరిచాడు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ తనే ఈ సినిమాకి హీరో అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఓ ఫైట్, ఓ పాట, హీరోయిన్, రొమాన్స్ అని ఇలా చాలా సీన్స్ క్రియేట్ చేసేసాడు. చెప్పాలంటే ఈ సినిమాకి అవన్నీ అవసరం లేదు. వీటి గురించి క్లుప్తంగా కింద సెక్షన్స్ లో చెబుతా.. ఇక చెప్పాల్సింది కమెడియన్ సంతానం గురించి.. ఈ సంతానం కామెడీ ట్రాక్ అక్కడక్కడా వర్కౌట్ అయ్యింది, కానీ చాలా చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే కమర్షియల్ అనే పాయింట్ కొసం ఈ సంతానం పాత్రని బలవంతంగా కథలో దూర్చారే తప్ప సినిమా కథకి అనవసరం. రాయ్ లక్ష్మీ కేవలం ఒక గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే.. తన సీన్స్ లో మాత్రం బాగా గ్లామరస్ గా చూపించి ఆడియన్స్ కి కాసేపు నేత్రానందాన్ని కలిగించి ఆ తర్వాత క్రికెట్ లో ఓ ఎక్స్ట్రా ప్లేయర్ లా వెనుక నిలబెట్టేసారు. అందాల ఆరబోత పరంగా ఆడియన్స్ ని మెప్పించింది. ఇకపోతే కోవై సరళ, మనోబాల ట్రాక్ కూడా ఆడియన్స్ ని కాస్త నవ్విస్తుంది. ఇకపోతే వినయ్ రాయ్ పాత్రేమో హీరో, కథ మొత్తం అతని చుట్టే తిరగాలి. కానీ తను మాత్రం చాలా తక్కువ సమయం కనపడతాడు. దానికి తోడు పెర్ఫార్మన్స్ కూడా అంతంతమాత్రంగా ఉంది. ఇకపోతే చిన్న చిన్న పాత్రల్లో కనిపించే కోట శ్రీనివాసరావు, నితిన్ సత్య, శరవణన్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం లో ది బెస్ట్ అని చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రాఫర్ యు.కె సెంథిల్ కుమార్ అందించిన విజువల్స్ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా ఒకే బిల్డింగ్ లో షూట్ చేసిన సీన్స్ ని చాలా బాగా షూట్ చేసాడు. అలాగే హన్సిక ఎపిసోడ్ లో విలేజ్ నేటివిటీని బాగా చూపించాడు. సిజి ఎఫెక్ట్స్ సరిగా లేవు దానికి కారణం సెంథిల్ కుమార్ కాదు కావున తన పని తను పర్ఫెక్ట్ గా చేసాడు. ఇకపోతే చెప్పాల్సింది.. భరత్వాజ్ అందించిన సాంగ్స్ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. తమిళ్ లోనే పెద్దగా ఆకట్టుకొని ఈ సాంగ్స్ తెలుగులో డబ్ అయ్యే సరికి ఇంకా దారుణంగా తయారయ్యాయి. పాటలు ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ కాకపోయినా కార్తీక్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. హర్రర్ సీన్స్ కొన్ని అయినా ఆడియన్స్ కి నచ్చడానికి కార్తీక్ రాజా సంగీతమే ప్రధాన కారణం.. ఎన్.బి శ్రీకాంత్ ఎడిటింగ్ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే కరెక్ట్ గానే కత్తెర వేసాడు అని చెప్పవచ్చు కానీ ఆడియన్స్ పరంగా చూసుకుంటే ఒక హర్రర్ కామెడీ సినిమాకి 146నిమిషాలు ఎందుకు.. అనవసరమైన ఫైట్స్, సాంగ్స్, కథ నుంచి పక్కకి తీసుకెళ్తున్న పలు కామెడీ ట్రాక్స్ ని లేపేసి ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. ఎడిటర్ బ్లైండ్ గా డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోకుండా తన ఆలోచనలని కూడా కాస్త వాడిఉంటే బాగుండేది. ఇక ఈ సినిమాకి చేసిన విజువల్ ఎఫెక్ట్స్ చాలా నాశిరకంగా అనిపిస్తాయి. ఎక్కడా హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు. దెయ్యం అనే దాన్ని ఆడియన్స్ భయపడేలా చూపించాలి అనే విషయంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

ఇక డైరెక్టర్ సుందర్.సి విషయానికి వద్దాం.. ముందుగా ఈయన ఒక హర్రర్ కామెడీ సినిమా తీయాలనుకున్నాడు..కథ కోసం పెద్దగా కష్టపడకుండా, పాత ఇంటికి కొత్త రంగులు వేసినట్టు, పాత హర్రర్ కామెడీ కథలనే తీసుకొని దానికి చిన్న చిన్న మార్పులు చేసి కథ రెడీ చేసేసారు. ఇంకా చెప్పాలి అంటే 'చంద్రముఖి', 'కాంచన' సినిమాలని మక్కికి మక్కి దించేసినట్టు కనపడుతుంది. ఇక కథనంలోకి వస్తే సుందర్ సి - రామదాసు కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే లో కూసింత కొత్తదనం కూడా కనిపించలేదు. ప్రతి హర్రర్ కామెడీలో ఉండే ఫార్మాట్ నే ఇక్కడా ఫాలో అవ్వడానికి ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లే రాయడం ఎందుకో.. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత నుంచి ఆడియన్స్ థ్రిల్ అయ్యే కథనం ఎక్కడా ఉండదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కథనంలో హర్రర్ కంటే కామెడీనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కామెడీ పరంగా మంచి గ్రిప్ ఉన్న సుందర్ సి ఈ సినిమాలో కూడా కామెడీని అక్కడక్కడా బాగానే డీల్ చేసాడు, కానీ అసలైన హర్రర్ ని మాత్రం తుస్సుమనిపించాడు. హర్రర్ కామెడీ అని చెప్పుకొని సినిమాకి వచ్చిన ఆడియన్స్ కి కేవలం కామెడీ మాత్రమే చూపించడం వలన ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఈ సినిమాలో మేజర్ కీ రోల్ అయిన పాత్రలో వేరెవరినైనా ఉంచి సుందర్ సి పర్ఫెక్ట్ గా కథ - కథనం - డైరెక్షన్ మీద కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సరిగాలేవు. అందుకే తమిళ్ లో సక్సెస్ అయిన అంతగా ఇక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి రాసిన తెలుగు డైలాగ్స్ కూడా పెద్దగా పేలలేదు. తమిళ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కాసులు వసూలు చేసిన 'అరన్మనై' అనే హర్రర్ కామెడీ సినిమాని 'చంద్రకళ'గా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తమిళ్ లో హర్రర్ వర్కౌట్ కాకపోయినా సంతానం కామెడీ వర్కౌట్ అయ్యింది. కానీ తెలుగుకి వచ్చే సరికి డబ్బింగ్ సరిగా కుదరక పోవడంతో ఆ కామెడీ కూడా పూర్తిగా వర్కౌట్ అవ్వలేదు. ఇక దీన్ని సీరియస్ గా విశ్లేషించడం మొదలు పెడితే.. చంద్రముఖిలో ఓ రాజమహల్ ని కొనుక్కొని అందులోకి వస్తారు, అప్పుడు జ్యోతికని చంద్రముఖి ఆవహిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకు ఉన్న ఓ రాజమహల్ ని అమ్మేయడానికి వస్తే ఆండ్రియాని చంద్రకళ ఆవహిస్తుంది. కట్ చేస్తే అక్కడ రజినీకాంత్ - వడివేలు కామెడీ ట్రాక్ ఉంటుంది, ఇక్కడ సుందర్.సి - సంతానం కామెడీ ట్రాక్ ఉంటుంది. అక్కడ వర్కౌట్ అయ్యింది ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అక్కడ ఇష్టపడిన ప్రియుడిని చంపేస్తారు, ఇక్కడ ప్రియుడిని వదిలి ప్రియురాలిని చంపేస్తారు. కామన్ గా పగ ప్రియురాలిదే.. కానీ అక్కడ పగ తీరడం కోసం కొన్ని తరాలు మారుతాయి కానీ ఇక్కడ సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఇలా మక్కికి మక్కి దించేసిన ఈ సినిమా చూడటం బెటర్ గా ఉంటుందా లేక చంద్రముఖిని ఇంకోసారి చూడచ్చా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం.. ఇక ఈ సినిమాలో నేనే హీరోని అని చెప్పుకోవడం కోసం ఒక ఇంట్రడక్షన్ ఫైట్.. హీరోని పరిచయం చేయడం కోసం కథకి అవసరం లేకపోయినా కచ్చితంగా ఓ ఇంట్రడక్షన్ ఫైట్ ఉండాలి అనే ఫార్ములాని ఇంకా ఎన్ని రోజులు వాడతారో.. ఈ సినిమాలో కూడా ఇదే రీతిలో పెట్టిన ఓ ఫైట్ సినిమా లెంగ్త్ ని పెంచడానికి తప్ప మిగతా దేనికీ ఉపయోగపడలేదు. పాటల పొజిషన్ కూడా అంతే, ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యడానికి కాకుండా వారి సహనాన్ని పరీక్షించడానికే పెట్టినట్టుంది.క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా బాగా సాగదీసారు. అంతేకాకుండా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ మరియు వాటి విజువల్స్ అస్సలు బాలేవు. ఇక లాజిక్స్ అనేవి అస్సలే లేవు.. ఉదాహరణకి .. గుళ్ళో దొంగిలించిన నగలు ఏమయ్యాయి.? ఎక్కడో భూమిలో భూడ్చిన శవం పైకి ఎలా వచ్చింది.? చనిపోయి కొన్ని రోజులైన బాడీ లోంచి రక్స్తం ఎలా వచ్చింది. ఒక హర్రర్ సినిమాని పర్ఫెక్ట్ కమర్షియల్ ఫార్మాట్ లో తీయాలని దానికి కామెడీ, గ్లామర్ ని మిక్స్ చేసి ఆడియన్స్ కి రొటీన్ సినిమాని అందించాడు. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇకపోతే ప్రతి వారం రొటీన్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చూస్తున్న వారికి ఈ డబ్బింగ్ సినిమా కూడా అంతకన్నా రొటీన్ రుచిని చూపించి ప్రేక్షకులను నిరాశపరిచింది.Hansika Motwani,Andrea Jeremiah,Sundar.C,C Kalyan,Karthik Raja.పంచ్ లైన్ : చంద్రకళ - ఇది ఒక పీడకల.!

మరింత సమాచారం తెలుసుకోండి: