అల్లరి నరేష్ న్యూ క్యారెక్టరైజేషణ్ , పిజి విందా సినిమాటోగ్రఫీ , కళ్యాణి కోడూరి మ్యూజిక్ అల్లరి నరేష్ న్యూ క్యారెక్టరైజేషణ్ , పిజి విందా సినిమాటోగ్రఫీ , కళ్యాణి కోడూరి మ్యూజిక్ మొదటి నుంచి స్లోగా ముందుకెళ్ళడం , నరేష్ సినిమా రేంజ్ కామెడీ లేకపోవడం , రొటీన్ కి స్టొరీ , నత్తకన్నా స్లోగా సాగే కథనం , బోరింగ్ సెకండాఫ్ అలా అని ఫస్ట్ హాఫ్ సూపర్ కాదండోయ్ , సందర్భం లేకుండా వచ్చే సాంగ్స్ , రన్ టైం శ్రీ రాజేశ్వరి చిట్ ఫండ్ కి ఓనర్స్ ముగ్గురు వాళ్ళే మకరంద్ర రావు(తనికెళ్ళ భరణి)- శేషగిరి(రావు రమేష్)- భలే బాబు(పోసాని కృష్ణమురళి). వీళ్ళకి నమ్మిన బంటుగా ఉన్న అకౌంటెంట్ సత్యనారాయణ ఉంటాడు. కానీ వీళ్ళు ముగ్గురు ఈ చిట్ ఫండ్ అమౌంట్ ని నొక్కేసి ఆ నేరాన్ని సత్యనరాయణపై తోసేస్తారు. దాంతో వాళ్ళపై ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలనుకున్న సత్యనరాయణ కుమార్తె జాహ్నవి(ఈశ) దొంగనాయాళ్ళని దోచుకునే విశ్వ అలియాస్ విశ్వనాథ్(అల్లరి నరేష్) కలిసి అతనికొక డీల్ ఇస్తుంది. ఆ డీల్ ఏంటంటే తన తండ్రిని మోసం చేసిన ముగ్గురి నుంచి కుదిరినంత అమౌంట్ ని కొట్టేసి, వాళ్ళ పరువు పోగొట్టి రోడ్డు మీదకి లాగేయాలి. ఈ డీల్ కి ఒప్పుకున్న విశ్వ సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిని ఎలా మోసం చేసాడు.? వాళ్ళ కెరీర్ ని ఎలా దెబ్బ తీసాడు.? దానికి ఎవరెవరి సాయం తీసుకున్నాడు.? అనేది మీరు వెండితెరపై చూడాలి.. అల్లరి నరేష్.. ఈ పేరు వింటే ప్రేక్షకులు మనం కడుపుబ్బా నవ్వుకునే సినిమా చూడచ్చుఅని ఫీలయ్యే స్థాయికి వెళ్ళాడు.. కానీ మధ్యలో దారి తప్పి దెబ్బతిన్నాడు. ఆ దెబ్బల(బాక్స్ ఆఫీస్ ఫ్లాపుల) నుండి కాస్త తేరుకొని బ్రదర్ అఫ్ బొమ్మాళి సినిమాతో కాస్త ఫాంలోకి వచ్చిన అల్లరి నరేష్ చేసిన టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ బందిపోటు.. మామూలుగా అడపాదడపా అల్లరి నరేష్ చేసే మల్టీ స్టారర్ సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తాడు. కానీ మొదటిసారి తను సోలో హీరోగా చేస్తున్న సినిమాలో కామెడీ కంటే నటనకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమా చేసాడు అదే బందిపోటు. ఈ సినిమాలో నరేష్ కొత్త పాత్రని ఎంచుకున్నాడు కానీ ఆ పాత్రలో చూపిన పెర్ఫార్మన్స్ సెటిల్ గా ఉన్నా ఇంతకముందు ఎప్పుడో చూసినట్టే ఉంటుంది. ఒక తెలివైన దొంగ పాత్రలో తన నటనతో అందరినీ కన్విన్స్ చేసాడు. నటన పరంగా అల్లరి నరేష్ ఓకే అనిపించినా కానీ అల్లరి నరేష్ అంటే ఆడియన్స్ కాస్త అల్లరి ఆశిస్తారు, ఆ అల్లరి మాత్రం బాగా తగ్గింది. ఒకే మూస ధోరణిలో వెళ్తున్న నరేష్ ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు అతనిని మెచ్చుకొని తీరాలి. హీరోయిన్ ఈశకి ఇది రెండవ సినిమా అయినా తెలుగమ్మాయి కావడం వలన కథలోని కంటెంట్ ని అర్థం చేసుకొని ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసింది. సినిమాలో మోడ్రన్ గా, పాటల్లో కాస్త గ్లామరస్ గా కనిపించి తనలోని అందాలను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. సినిమా మొదట్లో తన పాత్ర సినిమాకి ముఖ్యం అని అనిపించినా ఆ తర్వాత పాటలకి మాత్రమే సరిపోయింది. ఈ సినిమాకి కామెడీ పరంగా హెల్ప్ అయిన వారిలో మొదటి వాడు మన బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. అది కూడా ఇంట్రడక్షన్ సీన్ లో మాత్రమే. ఆ ఒక్క సీన్ లోనే ఆడియన్స్ బాగా నవ్వుతారు. తర్వాత తను హీరో పక్కన ఓ పాత్రధారిగా మిగిలిపోయాడు. ఇక సందర్భానుసారంగా తనికెళ్ళ భరణి - శ్రీనివాస్ అవసరాలల పెర్ఫార్మన్స్ సీన్స్ కి తగ్గట్టుగా ఉన్నాయి. రావు రమేష్ పాత్రని డిఫరెంట్ గా అనిపిస్తుంది. పోసాని కృష్ణమురళిలు చాలా రొటీన్ పాత్ర ఇందులో చేసాడు. ఇలాంటి పాత్రలు ఇప్పటికి చాలానే చూడడం వలన ఆడియన్స్ కి అస్సలు నవ్వు రాలేదు. చంద్ర మోహన్, శుభలేక సుధాకర్ తదితరులు పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిపోయారు. ఈ సినిమాని బాక్స్ ఆఫీసు వద్ద నిట్ట నిలువునా ముంచేసిన క్రెడిట్ మాత్రం ఇంద్రగంటి మోహన కృష్ణకే చెందుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా నిలిచి, నాలుగు మేజర్ డిపార్ట్ మెంట్స్(మాటలు - కథ - కథనం - దర్శకత్వం)ని డీల్ చేసి వాటిలో ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి. నరేష్ చేత రెగ్యులర్ పాత్రలు కాకుండా కొత్త పాత్ర చేయించాలి అని ఓ ఇంటెలిజెంట్ దొంగ పాత్ర రాసుకోవడం బాగుంది, పాత్ర రాసుకున్నారు సరే అదే రేంజ్ లో ప్రెజెంట్ కూడా చెయ్యాలి కదా. అక్కడ ఫెయిల్ అయ్యారు. నరేష్ పాత్ర కొత్తగా ఉన్నా పెర్ఫార్మన్స్ చాలా రెగ్యులర్ గా ఉంటుంది. అతనితో కామెడీ చేయించాడ్డు అనుకున్నప్పుడు అయినా కామెడీగా ఉండేలా చూసుకోవాలి లేదా పక్కన సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళతో (సంపూర్నేష్ బాబు) అయినా నవ్వించాలి. అది కూడా చెయ్యకపోవడం వలన ఆడియన్స్ కి ఈ చిఎన్మా అస్సలు కనెక్ట్ కాదు. ఇక ప్రతి సినిమాలోనూ ఓ కొత్త పాయింట్ ని, ఓ వైవిధ్యాన్ని చూపించే మోహన క్రిశంకి ఏం పూనిందో కానీ కమర్షియల్ అనే బాటలోకి వచ్చి పాత చిత్రాల కథని తీసుకొని దాని అంతకన్నా రొటీన్ గా చూపించాడు. ఈ సినిమా కథని మనం 'అతడే ఒక సైన్యం', 'శ్రీమన్నారాయణ' మొదలైన సినిమాలలో చూసాం. ఇన్ని చెడగొట్టినా కనీసం కథనం అన్నా స్పీడ్ గా ఉండాలి కదా.. దాన్ని కూడా ముసలి అవ్వ కర్ర పట్టుకొని గంటకో అడుగు వేసినట్టు స్లోగా నడిపించడంతో ప్రేక్షకులు సింపుల్ గా థియేటర్ నుంచి వాకౌట్ చేసారు. ఇక ఆయన రాసిన డైలాగ్స్ లో మాత్రం కొన్ని బాగున్నాయి. ఇక ఓ డైరెక్టర్ గా ఇంద్రగంటి లాజికల్ గా చెప్పలేనన్ని తప్పులు చేసాడు.. ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్ కమర్శియాలిటీ వెంట పడితే ఇలానే తప్పులు చేసి తమ చేతుల్ని తామే కాల్చుకుంటారు ఏమో.. సో ఓవరాల్ గా ఈ ఫెయిల్యూర్ కి ఇంద్రగంటినే కారణం అని చెప్పాలి.

డైరెక్టర్ మోహనకృష్ణకి ఈ సినిమా విజువల్స్ పరంగా మరియు అల్లరి నరేష్ ని ఇంత డిఫరెంట్ గా చూపించడంలో ఎంత ఇమాజినేషన్ ఉన్నా దానిని పర్ఫెక్ట్ గా తెరపైన చూపించిన క్రెడిట్ మాత్రం సినిమాటోగ్రాఫర్ పిజి విందాకే చెందుతుంది. తను చూపిన ప్రతి విజువల్ మరియు నటీనటుల్ని కొత్త తరహాలో చూపించదానికి తను వాడిన లైటింగ్ ఎఫెక్ట్స్ సింప్లీ సూపర్బ్. ఇలాంటి సూపర్బ్ విజువల్స్ కి కళ్యాణ్ కోడూరి సంగీతం మరింత మాధుర్యాన్ని చేర్చింది. కళ్యాణ్ కోడూరి పాటలు అన్నీ క్యాచీగా లేకపోయినా ఛీ అనే రేంజ్ సాంగ్స్ కూడా ఈ ఆల్బంలో లేవు. సో యావరేజ్ పాటలకి మంచి విజువల్స్ తోడవడంతో విజువల్ గా బాగుంటాయి. ముఖ్యంగా స్పెయిన్, మిలాన్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో తీసిన సాంగ్స్ విజువల్స్ అల్లరి నరేష్ రేంజ్ కి కెవ్వు కేక అనిపిస్తాయి.. ఇక కళ్యాని మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్ అయ్యింది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదు. కనీసం స్లోగా సినిమా ఉందని ఎడిటర్ కూడా పట్టించుకోలేదు. కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. చాలా రోజుల తర్వాత ఈవివి సినిమా బ్యానర్ ని రీ స్టార్ట్ చేసి నరేష్ - రాజేష్ కలిసి చేసిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కథని నమ్మి బాగానే ఖర్చు పెట్టి ఈ సినిమా తీసారు. కానీ రిజల్ట్ మాత్రం వారి అంచనాలను ముంచేసింది. మోహన కృష్ణ ఇంద్రగంటి.. ఈ డైరెక్టర్ సినిమా సినిమాకీ అస్సలు సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తుంటాడు. ఈయన చేతిలో అల్లరి నరేష్ పడ్డాడు అంటే రొటీన్ కి భిన్నమైన సినిమా ఎదో వస్తుందనే మీరు ఊహించి ఈ సినిమాకి వెళ్ళాలి. అలా వెళ్తేనే ఈ సినిమాని మీరు తట్టుకోగలరు. లేదంటే మీ నోటి నుంచి బూతు పురాణం వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈయన చెప్పాలనుకున్న కథని మనం ఇదివరకే చూసేసాం. అల్లరి నరేష్ లాంటి కామెడీ హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసినా చివరిగా ఆడియన్స్ కోరుకునేది ఎంటర్టైన్మెంట్, కావున దాన్ని మిస్ చెయ్యకూడదు. చెప్పాలంటే కొంతవరకూ సందర్భానుసారంగా వచ్చే కామెడీతో నవ్వించడానికి ట్రై చేసినా అది కొన్ని సీన్స్ కె పరిమితం అయ్యింది. కానీ ఇదే కామెడీని సినిమా మొత్తం ఫాలో అవ్వలేకపోయాడు. ఇది అల్లరి నరేష్ నుంచి వచ్చి కామెడీ ఎంటర్ టైనర్ కాదు. స్లోగా సాగుతూ మీకు బోర్ కొట్టించే డ్రామా. కనీసం దాన్నైనా వేగవంతంగా చెప్పకుండా నిధానంగా ఎక్కించాలని ట్రై చేసాడు. ఆ నిధానం కాస్త ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. అల్లరి నరేష్ సినిమాని బోర్ కొట్టిస్తే రిజల్ట్ ఏమిటనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..డైరెక్టర్ అన్నాక ప్రతిసారి ఓ కొత్త పాయింట్ చెప్పాలని ఏం లేదు కానీ మనం తీసుకునే నటీనటుల్ని బట్టి రొటీన్ కథని కూడా ఆసక్తికరంగా చెప్పగలగాలి. అదీ అల్లరి నరేష్ లాంటి ఓ హీరోని పెట్టుకొని కనీసం బేసిక్ కామెడీ ఉండేలా అన్నా రాసుకోవాలి అదికూడా మిస్ అయితే థియేటర్ లో చూసే ఆడియన్స్ కి పిచ్చ బోర్. అదే ఈ సినిమాకి జరిగింది. కామెడీ అల్లరి నరేష్ తో కామెడీ చేయించ కూడదు కొత్తగా ఉండాలి అనుకున్నారు అలాంటప్పుడు సందర్భానుసారంగా అన్నా కామెడీ పండాలి కదా ఇంద్రగంటి గారు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అల్లరి నరేష్ కామెడీ మార్క్ అస్సలు లేని సినిమానే 'బందిపోటు'. అల్లరి నరేష్ మార్క్ లేదు, సందర్భానుసారంగా వచ్చే కామెడీ లేదు, సపోర్ట్ కమెడియన్స్ లేరు.. ఇన్ని లేని ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం కూడా కష్టమే.. ది బెస్ట్ ఏంటి అంటే అల్లరి నరేష్ తన ఇమేజ్ ని పక్కకి పెట్టి ఇలాంటి ఓ సినిమాని అటెంప్ట్ చెయ్యడమే.. సో ఫ్రెండ్స్ థియటర్ కి వెళ్ళే మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే అంశాలు అతి తక్కువ ఉన్న సినిమా 'బందిపోటు'. Allari Naresh,Eesha,Indraganti Mohan Krishna,Aryan Rajesh,Kalyani Malik.Coming Soon....

మరింత సమాచారం తెలుసుకోండి: