ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వాల్యూస్ ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వాల్యూస్ పాతకాలం కథ ,బోరింగ్ కథనం , డైరెక్షన్ , సందర్భానికి సింక్ కాని డైలాగ్స్ ,వరస్ట్ ఫస్ట్ హాఫ్ , వరస్ట్ కామెడీ , సందర్భం లేని పాటలు , సుత్తి కొట్టించే ఎడిటింగ్ , చెప్తే ఇంకా చాలానే ఉన్నాయి అందుకే ఆపేస్తున్నా.. ఈ సినిమా కథ మలేషియాలో మొదలై.. మలేషియా టు అమెరికా, అమెరికా టు ఇండియా, ఇండియా టు మలేషియా వచ్చి అక్కడే సుఖాంతం అవుతుంది. అమెరికాలో పని చేస్తున్న కృష్ణ అలియాస్ క్రిష్(అభిజిత్) ఓ రోజు టీవీలో సస్య(నందిత)ని చూసి ప్రేమలో పడడమే కాకుండా వెంటనే ఇండియా వచ్చి ప్రేమించడం మొదలు పెడతాడు.

కొద్ది రోజులకి సస్య మరియు వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత సస్య కోరిక మేరకు క్రిష్ తన జాబ్ ని మలేషియాకి షిఫ్ట్ చేయించుకొని, సస్యని తీసుకొని మలేషియా వెళ్తాడు. కట్ చేస్తే మలేషియా వెళ్ళిన మొదటి రోజే సస్య తను ప్రేమించిన అబ్బాయి కోసం వెళ్లిపోతున్నానని, తన కోసం వెతకవద్దని లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.

అప్పుడు ఏం చెయ్యాలో తెలియని క్రిష్ ఒంటరిగా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఈ జర్నీలో క్రిష్ కి రామ్(హవిష్) తగులుతాడు. అక్కడి నుంచి క్రిష్ లైఫ్ లో కొన్ని మార్పులు వస్తాయి. అలా క్రిష్ లో వచ్చిన మార్పులు ఏమిటి.? అసలు రామ్ ఎవరు.? రామ్ కావాలనే క్రిష్ కి దగ్గరయ్యాడా.? అసలు సస్య లవ్ చేసింది ఎవరిని.? సస్య - రామ్ ల మధ్య ఏమన్నా సంబంధం ఉందా అనే విషయలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. నటీనటుల్లో పాజిటివ్ గా చెప్పుకోవాల్సిన వాళ్ళలో ప్రధమంగా ఉండాల్సింది హీరో - హీరోయిన్.. కానీ ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన ఒక్కరూ సరైన నటన కనబరచలేదు. ఇక ఒక్కొక్కరి విషయానికి వస్తే.. హవిష్ కి ఇది మూడవ సినిమా.. అందుకేనేమో ఈ సినిమాలో 3% నటనని మాత్రమే ఇంప్రూవ్ చేసుకున్నాడు.

ఇక్కడ నా పాయింట్ ఏమిటి అంటే.. 90 మార్కులు వచ్చే కుర్రాడు ఒక 3 మార్కులు పెంచి 93 స్కోర్ చేస్తే అది సూపర్బ్ రిజల్ట్, కానీ 10 మార్కులు వచ్చే వాడు నేను కూడా 3 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నానని సంకలు గుద్దుకుంటే ప్రయోజనం ఏముంది. 10 తెచ్చుకున్నా 13 తెచ్చుకున్నా ఫెయిల్ ఏగా.. ఇందులో హవిష్ పెర్ఫార్మన్స్ కూడా అలానే ఉంది. హవిష్ పాత్రలో చెయ్యాల్సింది పనసకాయంత నటన, కానీ చేసింది ద్రాక్ష పండంత.

ఇక హవిష్ పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉండుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. ఇక అభిజిత్ మొదటి సినిమాలో బానే చేసాడు, ఈ సినిమాలో కూడా బాగానే ట్రై చెయ్యాలని ట్రై చేసాడు, కానీ అది డైరెక్టర్ మహిమో, లేక పక్కన నటుల సావాస దోషమో కానీ అభిజిత్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు. ఇక నందితకి ఇచ్చింది హీరోయిన్ రోల్ కానీ కంటిన్యూగా సినిమాలో ఉండదు. అప్పుడప్పుడు సందర్భం పాడు లేకుండా ఓ మెరుపు తీగలా కనిపించి ఓ లైన్ హమ్ చేసి వెళ్లిపోతుంటుంది.

చెప్పాలంటే నందిత పాత్ర పాటల్లో ఇద్దరు హీరోల పక్కన డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపించడానికే ఉంది తప్ప ఈ ట్రై యాంగిల్ లవ్ స్టొరీలో లీడ్ రోల్ లాగా లేదు. కావున నందిత పెర్ఫార్మన్స్ కూడా జీరో.. కామెడీ కోసం అలీని వాకింగ్ అన్నారు, ఈయన్ అకార్ కంటే స్పీడ్ గా వాకింగ్ చేసేస్తాడు, డైరెక్టర్ గారు ఇందులో ఏమన్నా లాజిక్ ఉందా పోనీ కార్ కన్నా వేగంగా వెళ్తాడు అనగానే ఆడియన్స్ ఎలా నవ్వేస్తారని అనుకున్నారు.? ఆహా ఎలా అని అడుగుతున్నా.? ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వచ్చిన ఓ దొంగ పాత్రకి రంగోలి అనే దెయ్యం ముసుగు వేసి సప్తగిరి పాత్రతో నవ్వించడానికి తెగ ట్రై చేసారు. కానీ ఆడియన్స్ కి నవ్వు రాకపోగా డోఖు వచ్చేలా చేసారు.

ఫేమస్ కమెడియన్ ని పెడితే నవ్వు రాదు, కమెడియన్ పాత్రలో కామెడీగా ఉండి, సందర్భం వర్కౌట్ అయితేనే నవ్వు వస్తుంది, అలాంటి లాజిక్ ని కూడా మిస్ అయ్యి డైరెక్టర్ ఈ సినిమా తీసాడు.. కావున ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే సినిమా ప్రమోషన్స్ లో ఎవరైనా ఈ సినిమాలో సప్తగిరి, అలీ కామెడీ హైలైట్ అని చెప్పుంటే వారి మాటలు నమ్మకండి. ఎందుకంటే అదో సుత్తి కామెడీ. ఇక భాను చందర్, నాగినీడు, అనిత చౌదరి, కృష్ణుడు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటిస్తే, గెస్ట్ రోల్ లో అక్ష బాగానే చేసింది. ఇక ఐటెం సాంగ్ లో కనిపించిన మదాలస శర్మ మాస్ ఆడియన్స్ ని ఆకర్షించింది. ఇక్క డ ముందు బెస్ట్ చెప్పాలా వరస్ట్ చెప్పాలా అర్థం కావట్లేదు.. ఓకే ప్లస్ అంటే ఉన్నవి రెండే కాబట్టి ముందు అవి చెప్పేసి మిగతా వాళ్ళని ఓ ఆట ఆడుకుందాం.. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి విజువల్స్ సింప్లీ సూపర్బ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకూ మలేషియాలో చాలా సినిమాలు షూట్ చేసినా, ఇందులో గోపాల్ రెడ్డి చాలా కొత్తగా చూపించాడు. నటీనటుల్ని, లోకేషన్స్ ని బాగా చూపించాడు. ఇకపోతే దాసరి కిరణ్ కుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

గోపాల్ రెడ్డి గారి పనితనం వల్ల 36 రోజుల్లో సినిమాని పూర్తి చేసినా సినిమాలో ఎక్కడా లో క్వాలిటీ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు. ఇక సినిమాని చెడగొట్టిన వారి దగ్గరికి వస్తే అందులో ప్రధముడు, ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అయిన శ్రీపురం కిరణ్ అని చెప్పాలి. ఈయన రాసిన కథ ఏమిటంటే ఇద్దరు ప్రేమించుకోవడం కానీ ఆ మ్మాయిని వేరెవరో పెళ్లి చేసుకోవడం, వాడి కోసం లవర్ ఆ అమ్మాయిని త్యాగం చెయ్యడం.. ఈ పాయింట్ ని నాకు తెలిసి నేనే చడ్డీలు వేసుకునే టైంనుంచి చూస్తున్నా, అంతకుముందు నుంచే కూడా ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలానే ఉన్నాయి.

సో ఇందులో కొత్తదనం ఉంది అన్నవారికి కంటిన్యూగా గ్యాప్ లేకుండా 5 సార్లు ఈ సినిమాని చూపించాలి. ఇక కథ పాతదైనా కథనంతో మేజిక్ చెయ్యచ్చు కానీ కిరణ్ ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అని ఇక్కడో కామెడీ బిట్ ఇక్కడో సాంగ్ బిట్ ఇక్కడో సీన్ అన్నట్టు కథలోని పార్ట్స్ ను ముక్కలుగా చల్లుకుంటూ కథనం రాసేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక 10 నిమిషాల తర్వాత ఆగిపోయిన కథ క్లైమాక్స్ లో కదులుతుంది. అంటే ఈ మధ్యలో అంతా ఆడియన్స్ కి మద్దెల దరువే.. అనవసరపు కామెడీ, అనవసరపు సాంగ్స్ తో ఆడియన్స్ చేత సరిగమలు పలికించాడు. బాగా పేరున్న కమెడియన్ ని పెట్టేస్తే ఆడియన్స్ నవ్వేస్తారు అని కొందరు అనుకుంటున్నారు.

ఇకనైనా మారితే చాలా బెటర్. కథ – కథనంలోనే కాదు ఒక డైరెక్టర్ గా నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా చెప్పుకునే డైరెక్టర్ ఇన్నింటిలో ఫెయిల్ అయ్యాక సినిమా ఎలా బాగా వస్తుంది... డైరెక్టర్ తర్వాత ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ కూడా సినిమాపై, చూసే ఆడియన్స్ పై కానీస కనికరం కూడా లేకుండా ఎడిట్ చేసారని అనిపిస్తుంది. డైరెక్టర్ తో కూర్చొని ఇది ఇక్కడ ఎందుకు సార్ సినిమా దారి తప్పుతుంది అని చెప్పడం పోయి ఎక్స్ట్రాలు షాట్స్ యాడ్ చేసాడు.

ఇక మ్యూజిక్ ఇచ్చింది చిన్నా ఈయన కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకే అనేలా ఉన్నాయి, వాటికి విజువల్ బాగా తోడవడంతో చూడటానికి కూడా ఓకే.. ఒక్కదానికి కూడా సందర్భం లేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఫుల్ యాక్షన్ మూవీకి కొట్టినట్లు బాగా లౌడ్ గా ఇచ్చాడు. సీన్ కి అంత అవసరం లేకపోయినా ఆడియన్స్ చెవులు పగిలేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ కూడా తమకు తోచింది చేసాయి. నచ్చితే మీ లక్ నచ్చకపోతే మీ బాడ్ లక్. హవిష్ నుంచి వచ్చిన మరో డంబ్ ప్రాజెక్ట్ రామ్ లీల.. ఈ సినిమాకి రామ్ లీల అని కాకుండా నస లీల లేదా టార్చర్ లీల అని పెట్టి ఉంటే బాగుండేది. ఇలా ఎందుకు అంటున్నాను అంటే.. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అవుతాయి, వరస్ట్ గా ఉంటాయి కానీ వారు అనుకున్న పాయింట్ కి జస్టిఫికేషన్ చెయ్యడానికి డైరెక్టర్ అనే వాడు ఎక్కడో ఓ చోట ట్రై చెయ్యాలి. కనీసం ఒక్క సీన్ లో అయినా.. కానీ ఇందులో ఒక్క సీన్ లో కూడా నయం చెయ్యలేకపోవడం బాధాకరం. డైరెక్టర్ ఎంతో ఎమోషనల్ గా రాసుకున్న సీన్స్ ని కూడా చాలా కామెడీగా తీయడం ఆడియన్స్ లో చిరాకుని తెప్పిస్తుంది.

ఉదాహరణకి.. రామ్ ని రౌడీలు కొడుతుంటే క్రిష్ రియలైజ్ అవ్వాలి కానీ ఆ సీన్ చూసే ఆడియన్స్ కి చాలా ఫన్నీ గా ఉంటుంది. ఆడియన్స్ హీరో రియలైజేషన్ ని ఫీలవ్వాలి అంతేగానీ కామెడీని కాదు. కామెడీ చెయ్యాల్సిన చోట దాన్ని వదిలేయడం, ఎమోషన్స్ పలికించాల్సిన చోట కామెడీ చేయడం వలన ఆడియన్స్ చిరాకు పడతారు. కాన్సెప్ట్ ని చెడగొట్టడం ఎలాగ అనేది తెలుసుకోవడం కోసం ఈ సినిమాని చూడాలి. మీ జేబులో ఉన్న పైసా సేవ్ అవ్వాలి, మీ మూడ్ ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ సినిమాకి దూరంగా ఉండండి. Havish,Abijeeth Duddala,Nanditha,Sripuram Kiran,Dasari Kiran Kumar,Chinnaపంచ్ లైన్ : రామ్ లీల - కేరాఫ్ నస..!

మరింత సమాచారం తెలుసుకోండి: