కొత్తగా అనిపించే కాన్సెప్ట్ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని బెస్ట్ సీన్స్కొత్తగా అనిపించే కాన్సెప్ట్ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని బెస్ట్ సీన్స్బోరింగ్ సెకండాఫ్ , స్లో నేరేషన్ , ఎడిటింగ్ , ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే , ఆడియన్స్ ని ఉత్కంఠ కలిగించలేకపోవడం , సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడంసూర్య(నిఖిల్) బై బర్త్ 'పోర్ఫిరియా'(సింపుల్ గా చెప్పాలి అంటే ఈ జబ్బు ఉన్న వారికి బ్లడ్ లో ఉండే హిమోగ్లోబిన్ తక్కువ కావడం వల్ల సూర్యున్ని చూస్తే ఒక 15 నిమిషాల్లో చనిపోవడం) అనే జబ్బుతో బాధపడుతుంటాడు. దీనివల్ల సూర్య పగలంతా బయటకి రాకూడదని, సూర్యుడు అస్తమించాక అనగా సాయంత్రం 6: 30 నిమిషాల నుంచి బయట తిరగవచ్చని డాక్టర్ చెబుతాడు. దాంతో పగలంతా నిద్రపోతూ ఇంట్లోనే ఉండే సూర్య రాత్రి వేళల్లో బయటకి వస్తుంటాడు. నైట్ కాలేజ్ లో చేరిన సూర్య ఓ రోజు సంజన (త్రిదా చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయికి నైట్ లైఫ్ కంటే డే లైఫ్ అంటేనే ఇష్టం కానీ కొద్ది రోజులకి త్రిదా కూడా సూర్యని ప్రేమిస్తుంది. ఒకరోజు సూర్య సమస్య తెలియగానే సంజన సూర్యకి దూరం అవుతుంది. ఆ తర్వాత సూర్య అతని ప్రేమని కాపాడుకోవడం కోసం ఏం చేసాడు.? సంజన ప్రేమని దక్కించుకోవడం కోసం పగటి పూట బయటకి వచ్చాడా.? లేక ప్రేమని త్యాగం చేసాడా.? ఒకవేళ సంజన చివరికి సూర్య ప్రేమ కోసం తిరిగి వచ్చిందా.? అనే అంశాలను మీరు వెండితెరపైనే చూడాలి. ఈ సినిమాలో పాత్రలన్నిటికీ ప్రాపర్ ఎలివేషన్ లేదు. పరిచయాలు పరవాలేధనిపించినా లాజికల్ గా మాత్రం ఎక్కడా ఎలేవేట్ చెయ్యలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే.. గత రెండు సినిమాల నుంచి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త పాయింట్ ని ట్రై చేస్తూ, పాత్రలో వైవిధ్యాన్ని చూపుతున్న నిఖిల్ ఈ సినిమాలోనూ ఒక కొత్త కాన్సెప్ట్ ని మరియు ఓ కొత్త రోల్ ని ట్రై చేసాడు. ఇక ఓకే చేసిన రోల్ ని ఎలా చేసాడు అనే విషయానికి వస్తే సూర్య పోర్ఫిరియా అనే జబ్బు ఉన్న కుర్రాడు. చాలా సీన్స్ లో ఆ పాత్రకి తగ్గట్టే చేసాడు. కానీ కొన్ని సీన్స్ లో తన లోని ఫీలింగ్స్ ని పూర్తిగా బయటకి చూపించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సీన్స్ లో కూడా డల్ గా చేయడం వలన ఆడియన్స్ ఆ సీన్స్ కి కనెక్ట్ కాలేకపోతారు. ఓవరాల్ గా నిఖిల్ పెర్ఫార్మన్స్ సంతోషం అవార్డ్స్ కి ఎక్కువ నంది అవార్డ్స్ కి తక్కువ అన్నట్లు ఉంది. లుక్స్ పరంగా మాత్రం నిఖిల్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. హీరోయిన్ త్రిద చౌదరి తెలుగు రాకపోయినా బాగానే హావ భావాలను పలికించింది. కొన్ని రొమాంటిక్ సీన్స్ లో బాగా చేసింది. ఎమోషనల్ సీన్స్ వచ్చేసరికి సరిగా చేయలేకపోయింది. చెప్పాలంటే ఈ రొమాంటిక్ లవ్ స్టొరీలో కొన్ని లవ్ సీన్స్ ఓకే అనిపించినా, మేజర్ సీన్స్ లో నిఖిల్ - త్రిదల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక మధుబాల చాలా రోజుల తర్వాత కనిపించింది. సినిమాలో బాగా వయసైన ఆమెలా కనిపించడమే కాకుండా అక్కడక్కడా శృతిమించి నటించింది. కొన్ని సీన్స్ మాత్రమే సెటిల్ గా చేసింది. సత్య రెగ్యులర్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. తనికెళ్ళ భరణి పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఆ ఏజ్ లో కూడా ఆయన ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన ట్రై చేసిన కొన్ని మాడ్యులేషన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. నా వరకూ మాత్రం తనికెళ్ళ భరణిలోని ఎనర్జీలో సగం హీరో పాత్రలో ఉండి ఉంటే చాలా బాగుండేది కానీ లేదుగా అందుకే సినిమాలో అందరి పెర్ఫార్మన్స్ లు యావరేజ్ గా ఉన్నాయి. హైదరాబాద్ లోకల్ మూవీస్ లో కనిపించే మస్త్ అలీ కాసేపు నవ్వించాడు. రావు రమేష్, సాయాజీ షిండే, వైవా హర్ష, తాగుబోతు రమేష్, ప్రవీణ్ తదితరులు చిన్న చిన్న పాత్రల్లో నటించి వెళ్ళిపోయారు. ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన పాయింట్స్, అలాగే సినిమా ఫీల్ ని చెడగొట్టిన పాయింట్స్ ని డీల్ చేసింది కూడా టెక్నికల్ డిపార్ట్ లోనే ఉన్నాయి. ఒక కొత్త పాయింట్ ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా చెప్పడం కాస్త కష్టమైన పని. అందుకే చాలా మంది డైరెక్టర్స్ రెగ్యులర్ పాయింట్స్ నే కథలుగా ఎంచుకొని తీసేస్తుంటారు. కానీ అలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే సినిమా తీసి ప్రేక్షుకులను మెప్పించాలని ప్రయత్నం చేసిన కార్తీక్ ఘట్టమనేనిని మెచ్చుకోవాలి. ఇక ఆయన పనితీరు విషయానికి వస్తే కార్తీక్ 'పోర్ఫిరియా' అనే పాయింట్ ని తీసుకొని దానికి రొమాంటిక్ లవ్ స్టొరీ ని మిక్స్ చేసాడు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే హీరోకి చూపించిన జబ్బు అనే పాయింట్ తప్ప మిగతా కథలో ఎక్కడా కొత్తదనం లేదు. కాన్సెప్ట్ తో ఆసక్తిని పెంచినా సినిమాని చివరి దాకా ఆద్యంతంగా నడిపించలేకపోయాడు. ఎంచుకున్న కాన్సెప్ట్ ని ఒక చిన్న జబ్బుగా మాత్రమే చూపించి వదిలేయకుండా కాస్త సస్పెన్స్ ఉండేలా ఆ జబ్బే కథని నడిపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ ట్రైలర్ చూసిన వారందరూ ఈ కథ మొత్తం 'పోర్ఫిరియా' అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది అనుకుంటారు కానీ ఇక్కడేమో ఎక్కువగా లవ్ ట్రాక్ మీద ఉండడం వలన 2 గంటల పాటు ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. రొమాంటిక్ ట్రాక్ ని మెయిన్ స్టొరీ చేసుకోవడం వలన స్క్రీన్ ప్లే కూడా చాలా స్లో అయ్యింది. సెకండాఫ్ ఐ కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏమి చెయ్యాలో తెలియక ముందుగా ఏదో డైలాగ్స్ రాసుకొని వాటికి సీన్స్ రాసుకున్నారా అనిపిస్తుంది. కాన్సెప్ట్ లో లాజికల్ గా చెప్పాలంటే.. సూర్య అతనికి ఉన్న జబ్బు వల్ల చిన్నప్పటి నుంచి అస్సలు చదువుకోడు, కానీ ఎలా కాలేజ్ లో బిఎస్సి మాథమాటిక్స్ లో చేరాడు అనేది మిలియన్స్ డాలర్స్ ప్రశ్న. సెకండాఫ్ ని అనవసరపు సీన్స్ తో బాగా లెంగ్తీ గా తీసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా సిల్లీగా ఉండడం, దానికి సొల్లు కామెడీ జత చేసి చిరాకు పుట్టించారు. ఇకపోతే డైరెక్టర్ గా కూడా నటీనటులతో మేజిక్ ని క్రియేట్ చేయలేకపోయాడు. కార్తీక్ ఎప్పటిలానే సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రం ది బెస్ట్ అనిపించుకున్నాడు. తను చూపిన లొకేషన్స్, నైట్ షాట్స్ ని చాలా బాగా చూపించాడు. ఇక కార్తికేయ డైరెక్టర్ చందూ మొండేటి డైలాగ్స్ బాగున్నాయి. సత్య మహావీర్ మ్యూజిక్ బాగుంది. కానీ తను ఇచ్చిన కొన్ని సాంగ్స్ బాగా లౌడ్ గా ఉంటాయి కానీ విజువల్స్ మాత్రం ఆ రేంజ్ కి సింక్ అవ్వలేదు. గౌతమ్ నేరుసు ఎడిటింగ్ చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆడియన్స్ నిదరపోవాలనే ఎడిటింగ్ చేసినట్టు ఉంది. టిఎన్ ప్రసాద్ ఆర్ట్ వర్క్ బాగుంది. మల్కాపురం శివ కుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా లో బడ్జెట్ మూవీ అని తెలియకుండా చేసారు. రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వరుసగా హిట్స్ అందుకున్న నిఖిల్ ఈ సారి ఆ రేంజ్ ని హిట్ ని అందుకోలేకపోయాడు. దానికి కారణం స్టొరీ లైన్ లో మాత్రం కొత్తదనం ఉంటే సరిపోదు, అంతే కొత్తగా పూర్తి కథని, కథనాన్ని రాసుకోవాలి. ఆ విషయంలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఫెయిల్ అయ్యాడు. అంత ఆసక్తికరమైన పాయింట్ట్ ని తీసుకొని కేవలం ఒక లవ్ స్టొరీ మాత్రమే రాసుకోవడం, కథన్నని మరీ స్లోగా రాసుకోవడం బిగ్గెస్ట్ మైనస్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని కిందా మీదా పది ఎలాగో లాగించేసిన సెకండాఫ్ ని పూర్తిగా పడుకోబెట్టేసి ఆడియన్స్ కి కూడా నిద్రపుచ్చాడు. చెప్పాలంటే సెకండాఫ్ 5 నిమిషాల తర్వాత ఆడియన్స్ పడుకొని క్లైమాక్స్ లో లేచినా కథలో వాళ్ళు మిస్ అయ్యింది ఏముండదు. అంత సాగదీశాడు. ఇదొక లవ్ స్టొరీ అమ్మాయి అబ్బాయి చుస్కోవడం ప్రేమించుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం. ఇక్కడ లవర్స్ విడిపోయి కలుస్తున్నారు అన్నారు అంటే ఆ పాయింట్ ఆడియన్స్ మదిని పిండేసేలా ఉండాలి, మళ్ళీ వాళ్ళిద్దరూ కలవడానికి పడే స్ట్రగుల్ ఆడియన్స్ ఫీలయ్యేలా ఉండాలి. అలా ఫీలయ్యేలా ఉంటేనే ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవుతారు. ఈ చిఎన్మాలొ విదిపోయేదే ఒక సిల్లీ పాయింట్, మళ్ళీ వాళ్ళిద్దరూ కలవడం కోసం చేసిన సీన్స్ ఇంకా దారుణంగా అనిపిస్తాయి. ఓవరాల్ గా సూర్య vs సూర్య సినిమా నిఖిల్ కి హ్యాట్రిక్ హిట్ ని ఇవ్వకపోగా, మంచి కాన్సెప్ట్ ని సరిగా చేయలేకపోయారు అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. ట్రైలర్ క్రియేట్ చేసిన అంచనాలతో ఈ సినిమాకి మీరు వెళితే బాగా నిరుత్సాహపడచ్చు. అదే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళితే మీ ఫీలింగ్ కాస్త బెటర్ గా ఉంటుంది. ఇక్కడ బెటర్ అంటే హిట్ అని కాదు. మరీ నిరుత్సాహపడే వారు పర్లేదు అనే ఫీలింగ్ తో బయటకి రావచ్చు. Nikhil,Tridha Choudhury,Karthik Ghattamaneni,Markapuram Sivakumar,Satya Mahavir.పంచ్ లైన్ : సూర్య vs సూర్య - హ్యాట్రిక్ మిస్ అయిన నిఖిల్.!

మరింత సమాచారం తెలుసుకోండి: