ట్రైన్ అయిన డాగ్ టామీ పెర్ఫార్మన్స్ , రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మన్స్ట్రైన్ అయిన డాగ్ టామీ పెర్ఫార్మన్స్ , రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మన్స్ఎమోషన్స్ లేని పాత్రలు , డెడ్ స్లో నేరేషన్ , ఎడిటింగ్ , లౌడ్ రికార్డింగ్ , సాగదీసిన క్లైమాక్స్భీమవరంలో మంచి పేరున్న కాలేజ్ ప్రోఫెషర్ విశ్వం (రాజేంద్ర ప్రసాద్). ప్రతో రోజూ భీమవరం నుండి నరసాపురం వెళ్లి చదువు చెప్పి వచ్చే విశ్వం ఫ్యామిలీ లో భార్య కూతురు ఉంటారు. ఒక రోజు భీమవరం స్టేషన్ లో ఒంటరిగా ఉన్న ఓ కుక్క కనపడుతుంది. దాన్ని విశ్వం ఇంటికి తీసుకెళ్ళి టామీ అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. మొదట్లో విశ్వం భార్య సీతకి తామీ అంటే ఇష్టం ఉండదు. కానీ అతి తక్కువ కాలంలోనే టామీ వాళ్ళ ఇంట్లో ఓ మెంబర్ అయిపోతుంది. రోజూ విశ్వంతో పాటు టామీ స్టేషన్ కి వెళ్ళడం, సాయంత్రం పికప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా హ్యాపీగా సాగిపోతున్న లైఫ్ సాగిపోతుండగా ఓ రోజు సత్యం ని స్టేషన్ కి వెళ్ళద్దని టామీ మారాం చేస్తుంది. కానీ అది కాదని వెళ్ళిన విశ్వంకి ఏమయ్యింది.? అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే పాయింట్స్ ని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో ఉన్నది చాలా తక్కువ పాత్రలు కానీ అందరూ చాలా మంచి నటనని కనబరిచారు. టామీ రోల్ చేసిన డాగ్ చూడటానికి చాలా ముద్డొస్తూ సీన్స్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ హావ భావాలను పలికించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రోఫెషర్ పాత్రలో జీవించాడు. ముఖ్యంగా టామీతో రాజేంద్ర ప్రసాద్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక మిగిలిన సీత, సురేష్, ఎల్.బి శ్రీరాం లాంటి వారు తమ పాత్రల పరిధిమేర నటించారు. వేణు మాధవ్ - రఘు బాబు కలిసి నవ్వించాలనుకొని నవ్వించలేక చతికిలబడ్డారు. ఇక మిణుగురులు ఫేమ్ దీపక్ సరోజ్ తనకిచ్చిన చిన్న పరవాలేదనిపించాడు.1940లో హచికో అనే ఒక డాగ్ తన మాస్టర్ కి ఇచ్చిన ఎనలేని గౌరవం, చూపిన వినయ విధేయతల కంటే స్వచ్ఛమైనది మరొకటి లేదు. ఆ కథ తెలిసిన వారందరూ దీన్ని ఒప్పుకుంటారు. వారి ఇద్దరి మధ్య ఉన్నది అవధులు లేని స్వచ్చమైన ప్రేమ, అది ఎంతో స్థిరమైనది మరియు నిజమైనది కూడా.. అలా 1940లో జరిగిన ఈ హచికో అనే డాగ్ యొక్క స్వచ్చమైన కథని తీసుకొని తెలుగులో చేసిన సినిమా 'టామీ'. ఈ నిజమైన కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు లేదా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు రాసుకోలేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. చెప్పాలంటే ఇదొక సూపర్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అయ్యుండాలి కానీ అన్ని సినిమాల్లానే ఇది కూడా మంచి కాన్సెప్ట్ ని వృధా చేసిన వన్ అఫ్ ది ఫెయిల్యూర్ ప్రోడక్ట్. 'హాచి - ది డాగ్స్ టేల్' అనేది వేరే దేశంలో వేరే టైం పీరియడ్ లో వచ్చిన సినిమాని, దానిని ప్రస్తుతానికి అన్వయించుకుంటున్నప్పుడు కథ ఆ రియల్ ఇన్సిడెంట్ కి మ్యాచ్ అయ్యేలా రాసుకోవాలి కానీ ఇక్కడేమో అవేమి పాటించలేదు. ఇక స్క్రీన్ ప్లే మొదటి నుంచి పడుకొని పాకుతుంటుందే తప్ప ఒక్కసారన్నా లేచి పరిగెడదాం, కనీసం నడవనన్నా నడుద్దాం అనే పాపాన పోలేదు. రొమాన్స్ లేని లవ్ స్టొరీలా సినిమా చాలా నీరసంగా సాగుతుంది. పాత్రలకి సరిపోయే రీతిలో స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది. ఇక లాజికల్ గా చూసుకుంటే ప్రోఫెషర్ కూతురు టామీని ముందు రోజు నువ్వు మాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్లకూడదని ప్రేమనంతా ఒలకబోసి, మరుసరోజు రాగానే గెట్ అవుట్ అని గెట్ తెరచి బయటకి పొమ్మంటుంది. అంటే దీని ప్రకారం కుక్క చెయ్యాల్సిన పని కుక్క చెయ్యాలే తప్ప ఫ్యామిలీలో కలవలేందు అని చెప్పాడు. అంటే యువత వాళ్ళకి నచ్చింది చేస్తారు తప్ప దేన్నీ పట్టించుకోరు. ఈ సినిమా పరంగా ఇదొక పెద్ద నాన్సెన్స్ అనిపిస్తుంది. అలాగే 10 సంవత్సరాల తర్వాత సీత విశ్వం సమాధిని చూడటానికి వచ్చినప్పుడు స్టేషన్ లో ఇంకా తన మాస్టర్ కి విధేయతతో ఉన్న టామీని చూసి చాలా సింపుల్ గా రియాక్ట్ అవుతుంది. ఇదేమి లాజిక్ ఒక జంతువు ఇంట్లో ఉంది అంటే అది ఒక్క యజమానితోనే కాదు ఇంతో అందరితోనూ మంచి రిలేషన్ ని డెవలప్ చేసుకుంటుంది. చెప్పాలంటే చాలా యానిమల్స్ యకమాని కంటే ఇంట్లో వారితోనే ఎక్కువ రిలేషన్ ని ఏర్పరుచుకుంటాయి. ఇలాంటి మిస్టేక్స్ మనకు హాలీవుడ్ సినిమాలో కనిపించవు. ఇక డైరెక్టర్ గా లాజికల్ గా చాలా తప్పులే చేసాడు. ఇక డైరెక్టర్ రాజ వన్నెం రెడ్డి పూర్తిగా ఫెయిల్అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. చక్రి సాంగ్స్ మాత్రం బాగున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మరీ లౌడ్ గా ఉంది. ఎడిటర్ సినిమాని సెకండాఫ్ లో దాదాపు 15నిమిషాల వరకూ కట్ చేసి ఉండవచ్చు. బాబు పిక్చర్స్ విలువలు జస్ట్ యావరేజ్. ఒక డ్రామా పాయింట్ ని బేస్ చేసుకొని సినిమా చేస్తున్నాం అంటే అందులో ఎమోషన్స్ అనేవి బాగా పండాలి. పాత్రల మధ్య బంధాన్ని చూపించాలి. కానీ టామీ సినిమాలో జెన్యూన్ ఎమోషన్స్ లేవు, పాత్రల మధ్య బందాన్ని చూపించలేదు. ఇక ఈ సినిమా ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది చెప్పండి. ఈ సినిమాకి మాతృక అయిన హచి రన్ టైం కేవలం 93 ఉంటూ ప్రతి మొమెంట్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేసింది. కానీ టామీ సినిమా రన్ టైం ని 110 నిమిషాలకు పెంచి మరి ఒరిజినల్ వెర్షన్ లోని ఫీల్ లో 10 పెర్సెంట్ కూడా తీసుకురాలేకపోయారు. ఇక్కడ నా వెర్షన్ ఏమిటంటే మనం ఒక సినిమాని ఇన్స్పైర్ అయ్యి సినిమా చేస్తున్నాం అంటే అందులోని ఒక 50% మేజిక్ ని అయినా ఆన్ స్క్రీన్స్ చూపగలిగితే ఆ సినిమా హిట్ అవుతుంది. అలా కాకుండా చేసావో సినిమా డిజాస్టర్స్ లిస్టులో చేరిపోతుంది. టామీ కూడా ఆ లిస్టులోనే చేరిపోయింది. చివరిగా హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయిన మరో సినిమా కూడా తీయడంలో ఫెయిల్ అయ్యింది. Rajendra Prasad,Seetha,Raja Vannam Reddy,Chegondi Hari Babu,Bonam Chinna Babu,Chakri.పంచ్ లైన్ : టామీ - సూపర్ హిట్ కి ఫెయిల్యూర్ ఫ్రీమేక్.!

మరింత సమాచారం తెలుసుకోండి: