అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ ఓల్డ్ కాన్సెప్ట్ , కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే స్క్రీన్ ప్లే , ఫస్ట్ హాఫ్ సగంలోనే క్లైమాక్స్ తెలిసిపోవడం , డైరెక్షన్ , నో క్యారెక్టరైజేషన్స్ , హీరో సినిమాలలో నటుడవ్వాలనుకునే లక్ష్యం ఉన్న కుర్రాడు పృథ్వి(ప్రదీప్ నందన్). పృథ్వి స్వీట్ ఫ్యామిలీలో నాన్న రాఘవయ్య మరియు దివ్య(ఉష శ్రీ) ఉంటారు. హ్యాపీగా గడిచిపోతున్న పృథ్వి లైఫ్ లోకి భాను(ఖేనిష చంద్రన్) ఎంటర్ అవుతుంది. మొదట పరిచయం, ఆ తర్వాత ప్రేమ అంతా అలా అలా జరిగిపోతాయి. ఓ రోజు పృథ్వికి రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తుంది. దాంతో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడానికి బయటకి వెళ్తాడు. కానీ వచ్చే సరికి పృథ్వి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. చెల్లెలు దివ్య కనిపించదు. అసలు ఉన్నపాటుగా పృథ్వి వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయాడు.? చెల్లెలు ఏమైంది.? ఎవ్వరూ శతృవులు లేని పృథ్వి జీవితంలోకి ప్రవేశించి తన జీవితాన్ని గెలికేసిన ఆగంతకులు ఎవరు.? ఎందుకు చేసారు.? చివరికి దివ్య దొరికిందా.?లేదా.? అనే విషయాలు మీరు వెండితెరపై జరిగే నాటకం చూసి తెలుసుకోవాల్సిందే.. ఈ సినిమాలో నటించిన వారిలో ఒక్కొక్కరి గురించి ఉన్నది ఉన్నట్టుగా సూటిగా సుత్తి లేకుండా చెప్పుకొస్తాను. మెయిన్ హీరో ప్రదీప్ నందన్.. ఈ కుర్రాడిలో ఏదో చేసేయ్యాలనే ఈజ్, ఎనర్జీ ఉంది. కానీ దానిని సరిగా ప్రెజెంట్ చేసుకునే వయసు లేదు. ఒక సీన్ కి ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలి అనేది పర్ఫెక్ట్ గా తెలియలేదు. నటనలో ఇంకా స్కూల్ స్టేజ్ లోనే ఉన్నాడు. ఏదో ఈ సినిమాకి వాళ్ళ నాన్నే నిర్మాత కాబట్టి ప్రదీప్ హీరో అయ్యాడు, అలా కాకుండా వేరే హీరోని పెట్టుకొని చేసి ఉంటే ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యి ఉండేది. సో ప్రదీప్ యాక్టింగ్ ఈ సినిమాకి మైనస్. ఇకపోతే హీరోయిన్ ఖేనిష చంద్రన్ తెలుగమ్మాయి కాకపోయినా చీరల్లో బాగా చూపించారు. అలాగే పెర్ఫార్మన్స్ పరంగా కూడా డీసెంట్ అనిపించుకుంది. ఈ సినిమాలో దొంగగా చేసిన అభినవ్ తెలంగాణ కుర్రాడి పాత్రలో బాగా చేసాడు. అభినవ్ తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన కొన్ని ఫన్నీ డైలాగ్స్ బాగున్నాయి. కానీ ఆ డైలాగ్స్ కి సరిపడా సందర్భాలే కుదరలేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వచ్చిన శ్రీధర్ చూడటానికి మాత్రమే కాదు పెర్ఫార్మన్స్ పరంగా కూడా బాగానే చేసాడు. ఉషశ్రీ హీరోకి చెల్లెలి పాత్రలో కనిపించి పరవాలేదనిపించుకుంది. వీళ్ళు కాకుండా పలువురు పాత్రలు సినిమాలో ఉన్నాయి కానీ వాళ్ళందరూ దాదాపు కొత్త వాళ్ళే.. వాళ్ళ గురించి చెప్పుకునేంత పాత్రలు వాళ్ళకి ఇవ్వలేదు. పైన చెప్పిన ప్రదీప్ నందన్ గురించే ఇక్కడా ఎక్కువగా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒకటి కాదు రెండు కాదు మొత్తం 5 డిపార్ట్ మెంట్స్ ని ప్రదీప్ నందన్ డీల్ చేసాడు. సినిమా చూడక ముందు అబ్బా ఈ కుర్రాడు సూపర్బ్ టాలెంట్ ఏమో అనుకుంటారు కానీ సినిమా చూసాక ఎందుకయ్యా నీకు అన్ని డిపార్ట్ మెంట్స్.. ప్రాపర్ గా రెండు లేదా మూడు చేసుకోవచ్చుగా.. ఈ ఐదు డిపార్ట్ మెంట్స్ ని డీల్ చేసింది చాలదన్నట్లు హీరోగా కూడా చేయడం వలన అనుకున్న కాన్సెప్ట్ ఎటో వెళ్ళిపోయింది అని పెదవి విరుస్తారు. ఇక అసలు విషయంలోకి వస్తే ప్రదీప్ ఏమీ ఓ మైండ్ బ్లాక్ అయ్యే కథని ఏమీ రాసుకోలేదు.. పాత కాలం నాటి రివెంజ్ డ్రామానే రాసుకున్నాడు. కానీ దాన్ని ప్రెజెంట్ - పాస్ట్ స్క్రీన్ ప్లే తో కాస్ట్ థ్రిల్లింగ్ గా తీయాలనుకొని తీసాడు రిజల్ట్ కూడా థ్రిల్లింగ్ గానే వచ్చింది. ప్రజంట్ - పాస్ట్ స్క్రీన్ ప్లే బేస్ మీద సినిమా వెళ్తున్నప్పుడు ప్రజంట్ లో ఒక్క దగ్గరే కంటిన్యూషణ్ ఉంటే సరిపోతుందా, పాస్ట్ లో అవసరం లేదా. పాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే చాలా సీన్స్ లో కంటిన్యుటీ ఉండదు. సరే ఆ కంటిన్యుటీ లేని సీన్స్ లోని గాప్స్ ని క్లైమాక్స్ లో ఏమన్నా పూడ్చాడా అంటే అదీ లేదు. సినిమాలో ఫస్ట్ ఫైట్ కి ముందు వెనుక అసలు లింక్ ఉండదు. హీరో అని చెప్పుకోవడానికి మొదట్లో ఓ ఫైట్ కావాలి సో పెట్టేసారు. అలాగే కథలో ఒక్క పాత్రని పర్ఫెక్ట్ గా రాసుకోలేదు. హీరో అనే వాడు సినిమాలలో ట్రై చేస్తుంటాడు అని చెప్పడమే తప్ప దాని చుట్టూ అతని పాత్రని రాసుకోలేదు, ఏదో రిచ్ కిడ్ లాగా జీప్ వేసుకొని తిరుగుతూ ఉండడం. హీరోయిన్ పాత్రని అలానే చేసారు. ఇక దొంగగా చూపించిన అభినవ్ కి కూడా ఒక కచ్చితమైన క్యారెక్టరైజేషణ్ లేదు. ఏదో కామెడీ అనేది పెట్టాలి కాబట్టి మధ్య మధ్యలో ఆ పాత్ర వస్తుంటుంది. అలాగే సినిమాకి మెయిన్ పాయింట్ అయిన విలన్ బ్యాచ్ కి కూడా ఒక సరైన ఎందుకు.? ఏమిటి.? ఎలా.? రూపాన్ని ఇవ్వలేదు. ఇలా చాలా పాత్రలకి సరైన క్యారెక్టరైజేషన్ ని ఇవ్వలేదు. కథలోనే ఉన్నా కథకి సంబంధం లేకుండా తోలు బొమ్మల్లా పాత్రలు అలా వచ్చి వెళ్తుంటాయి. అందుకే ఏ పాత్ర పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు.

ఇకపోతే అనుకున్న పాయింట్ చాలా చిన్నది, దానికోసం లవ్ స్టొరీ, దొంగ రోల్, అజయ్ రోల్ రాసుకున్నాడు. లవ్ స్టొరీ అన్నా ఆసక్తికరంగా ఉందా, ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఉందా అంటే అదీ లేదు. ఖేనిష ఏదో సీన్ కి తగ్గట్టు చెయ్యడానికి ట్రై చేస్తే హీరో ఏమో సొంత తెలివితేటలు ఉపయోగించి లవ్ ఫీల్ ని జెనరేట్ చేయలేకపోయాడు. డైరెక్షన్ కూడా చాలా వీక్ గా అనిపిస్తుంది. అందువల్లనే ఆడియన్స్ ని సీట్లో కూర్చోబెట్టలేకపోయాడు. డైలాగ్స్ కొన్ని చాలా బాగున్నాయి. కానీ సందర్భానికి మాత్రం సింక్ అవ్వలేదు. సినిమాలో చాలా డైలాగులు బాగానే ఉన్నా డైలాగ్స్ కి - సీన్స్ కి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉంటుంది. డైలాగులలో ఉన్న ఫీల్ ని ఆ సీన్స్ లో క్రియేట్ చెయ్యలేదు. ఇక ఇలాంటి థ్రిల్లింగ్ లో కంటెంట్ ని ఎంగేజింగ్ గా ముందుకు తీసుకెళ్ళకుండా మధ్యలో పాటలొచ్చి విసుగుతెప్పిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ అందించిన సాంగ్స్ బిలో యావరేజ్, వాటిని పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ లో సీన్ లో అంత డెప్త్ లేకపోయినా అతని మ్యూజిక్ వల్ల సీన్ నడిచేస్తుంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ వెరీ గుడ్. ఈ సినిమాకి ఏ రేంజ్ ఉండాలో ఆ రేంజ్ లో ఉంది. నైట్ షాట్స్ ని బాగానే తీసాడు. ఎడిటర్ చంద్రశేఖర్ సినిమాని మరీ మరీ ముక్కలు చేసేసారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఎంత స్క్రీన్ ప్లే ప్రకారం అనుకున్నా సీన్స్ అన్నీ చేతికొచ్చిన దాన్ని మధ్య మధ్యలో అతికించుకుంటూ పోయారని అనిపిస్తుంది. రవి స్టంట్స్ ఓకే బట్ ఈ హీరోకి మ్యాచ్ అవ్వలేదు. ఆదిశేష రెడ్డి నిర్మాణ విలువలు ఓకే. ఇప్పటి వరకూ ఎంతో మంది కొత్త దర్శకులు, సీనియర్ దర్శకులు హాలీవుడ్ సినిమాలను చూసి స్ఫూర్తిగా తీసుకొని పాత చింతకాయ పచ్చడి లాంటి కాన్సెప్ట్ కే స్క్రీన్ ప్లే లేదా ఎంటర్టైన్మెంట్ అని డిఫరెంట్ రంగులు వేసి మన ముందుకు తీసుకు వస్తుంటారు. అందులో అతి తక్కువ మంది సక్సెస్ అయితే చాలా ఎక్కువ శాతం మంది ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అయిన వారి లిస్టులో ఈ జగన్నాటకం కూడా వచ్చి చేరింది. డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ నందన్ హాలీవుడ్ మూవీ 'వాకన్సీ' సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడి స్క్రీన్ ప్లే బేస్ ని ఇక్కడ ప్రెజెంట్ వెర్షన్ లో వాడుకున్నాడు. దానికి బ్యాక్ డ్రాప్ ఏదో ఉండాలి కాబట్టి ఒక రెగ్యులర్ ఓల్డ్ పాయింట్ ని పెట్టేసాడు. కానీ దానిని తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రీతిలో తీయడంలో ఫెయిల్ అయ్యాడు. ప్రతిసారి పండక్కి ఇంటికి రంగులేయించినట్టు, ప్రతి సంవత్సరం వచ్చే పాత కాన్సెప్ట్ లకి రంగులేసుకొని చాలా సినిమాలు వస్తాయి. కానీ కాస్త నాశిరకమైన మెటీరియల్(సరికా కథ - స్క్రీన్ ప్లే పైన వర్క్ చేయకపోవడం వలన) వాడడం వలన ఇంటి రంగు వేలిసిపోయింది. అదే కోవలోకే ఈ రోజు వచ్చిన జగన్నాటకం సినిమా వెళ్తుంది. పాత కాన్సెప్ట్ కి కొత్తగా వేసిన రంగులు వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర ఓ వీధి నాటకంలా అలా వచ్చి వెళ్ళిపోతుంది. Sridhar,Usha Sri,Pradeep Nandan,Aadisesha Reddy Indupuru,Pradeep Nandan.పంచ్ లైన్ : జగన్నాటకం - ఈ నాటకం పాతదే.

మరింత సమాచారం తెలుసుకోండి: