గోపీచంద్ - ఊర్వశి కాంబినేషన్ సీన్స్ , గోపీచంద్ - కబీర్ లుక్స్ , సినిమాటోగ్రఫీ , గిబ్రాన్ మ్యూజిక్ , సాంగ్స్ పిక్చరైజేషన్ గోపీచంద్ - ఊర్వశి కాంబినేషన్ సీన్స్ , గోపీచంద్ - కబీర్ లుక్స్ , సినిమాటోగ్రఫీ , గిబ్రాన్ మ్యూజిక్ , సాంగ్స్ పిక్చరైజేషన్ స్టొరీ - స్క్రీన్ ప్లే , ఊహాజనితమైన అండ్ సాగదీసిన సెకండాఫ్ , సెకండాఫ్ లో ఎమోషన్స్ ని కనెక్ట్ చేయలేకపోవడం , కామెడీ గా అనిపించే క్లైమాక్స్

జిల్ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది.. ఒక పవర్ఫుల్ ఫైర్ ఆఫీసర్ జై(గోపీచంద్). తన ఏరియాలో ఎలాంటి ఆపద వచ్చిన తెగించి కాపాడతాడు. అలాగే తనకు తెలిసి ఎలాంటి అన్యాయం జరిగినా ప్రశ్నించి అడ్డుకునే మనస్తత్వం ఉన్నవాడు. అలాంటి జై ఓ రోజు సావిత్రి(రాశి ఖన్నా)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా కొద్ది రోజులకి ఇద్దరిలోనూ ప్రేమ మొదలవుతుంది. ఇలా ఉండగా ఒకరోజు హోటల్ లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ అగ్ని ప్రమాదంలో రంగనాథ్(బ్రహ్మాజీ)ని కాపాడతాడు. కానీ రంగనాథ్ జై చేతిలో చనిపోతాడు. కట్ చేస్తే ముంబై మాఫియా డాన్ చోట నాయక్(కబీర్) రంగంలోకి దిగుతాడు. రంఘనాథ్ చివరిగా జై తో మాట్లాడాడని తెలిసి అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అటాక్ లు జరుగుతుంటాయి.


ఫైనల్ గా చోట నాయక్ జై ప్రేమించే సావిత్రిని కిడ్నాప్ చేస్తాడు. మరి మన హీరో జై చోట నాయక్ నుంచి సావిత్రిని కాపాడుకున్నాడా.? లేదా.? అసలు చోట నాయక్ జై ని ఎందుకు టార్గెట్ చేసాడు. అసలు చోట నాయక్ కి రంగనాథ్ కి ఉన్న సంబంధం ఏంటి.? అనే విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..

ఆరడుగుల పొడవు ఉండే మన హీరో గోపీచంద్ ని ఇప్పటి వరకూ మాస్ లుక్ లోనే చూపించారు. కానీ ఫస్ట్ టైం గోపీచంద్ ని స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో చూపించారు. ఈ రోల్ లో గోపీచంద్ కూడా స్టైలిష్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. రాశి ఖన్నా స్లిమ్ అండ్ మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తూ పాటల్లో బాగా ఆకట్టుకుంది.


ఇక సినిమా పరంగా తన రొమాంటిక్ ట్రాక్ ఒక చిన్న సబ్ ఫ్లాట్ కావడం వలన చెప్పుకునే రేంజ్ పెర్ఫార్మన్స్ లేదు. ముఖ్యంగా గోపీచంద్ - రాశి ఖాన్నలు ఆన్ స్క్రీన్ చూడటానికి చాలా బాగున్నారు.ఒక చోట నాయక్ గా కనిపించిన కబీర్ సింగ్ లుక్ మాత్రం టెర్రిఫిక్ గా అనిపిస్తుంది. కానీ తనకి తగిన పాత్రని మాత్రం సరిగా డిజైన్ చేయలేదు. అందుకే పాత్ర పరంగా పెద్దగా లేదు అనిపిస్తుంది. ఇకపోతే చలపతి రావు, శ్రీనివాస్ అవసరాల, భరత్ తమ పాత్రలకు న్యాయం చేసారు. ప్రభాస్ శ్రీను, ఊర్వశి, పోసాని కృష్ణమురళి ల కామెడీ పరవాలేదని పిస్తుంది కానీ సినిమాకి పెద్ద హెల్ప్ కాలేకపోయాయి.

జిల్ సినిమా కోసం రాధాకృష్ణ ఎంచుకున్న స్టొరీ లైన్ చాలా సింపుల్ గా ఉంది. రాధాకృష్ణ స్టొరీ సింపుల్ అయినా పాత్రలతో మేజిక్ చేద్దాం అని అనుకున్నాడు. అలా చేసి ఉంటే బాగుండేది కానీ అలా చేయకపోవడం వలెనే ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమాలో చూపించే సంఘటనలు ఆడియన్స్ కన్విన్స్ అవ్వడానికి దూరంగా ఉండడమే కాకుండా, స్టొరీ పరంగా మీనింగ్ ఫుల్ అనిపించదు అలాగే చాలా ఊహాజనితంగా కథ ముందుకు వెళ్తుంది. కొన్ని సీక్వెన్స్ లను థ్రిల్ చెయ్యడానికి ప్లాన్ చేసారు, అలాగే కొన్ని కామెడీ సీన్స్ ని ప్లాన్ చేసాడు.. కానీ ఈ రెండిటిలో ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోకపోగా, సినిమాని ఇంకా పడిపోయేలా చేసాయి. రాధాకృష్ణ ఓకే ప్యాకేజ్ ఎంటర్ ట్రైనర్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చెయ్యాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే కలర్స్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, ఆటో మొబైల్స్, ప్రాపర్టీస్ మొదలైన వాటిని స్టైలిష్ గా ఎంచుకొని చూపించాడు. కానీ కథా పరంగా ప్యాకేజ్ ఎంటర్ ట్రైనర్  అనేదాన్ని సరిగా ఫుల్ ఫిల్ చేయలేదు.


ఇక స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే చిన్న కథ అయినా గ్రిప్పింగ్ గా చెప్పాలి కానీ చెప్పలేకపోయాడు. ఇకపోతే డైరెక్టర్ గా పరిచయమైనా రాధాకృష్ణ అటు డైరెక్టర్ గా, ఇటు స్టొరీ టెల్లర్ గా రెండు విధాల ఫెయిల్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఓకే కొత్త డైరెక్టర్ ఇంత సింపుల్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే తో ఫస్ట్ సినిమాని ప్లాన్ చేసుకోవడం బాధాకరమైన విషయం. ఇక డైరెక్టర్ చాలా పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు.. ఆ ఫైర్ యాక్సిడెంట్ ముందు చూపించే చలపతి రావు పాత్ర ఆ సీన్ తర్వాత ఏమైందనేది చూపించలేదు, అలాగే ఎవ్వరితోనూ సరిగా మాట్లాడకుండా, సైలెంట్ గా ఉండే వ్యక్తి సడన్ గా ఎవరో తెలియని వ్యక్తికి పెద్ద సీక్రెట్ ని ఎలా చెప్పాడు. ఓవరాల్ గా డైరెక్టర్ స్టైల్ మీద దృష్టి పెట్టాడే తప్ప, సినిమాలోని కథ, మెయిన్ రోల్స్ మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ మీద మరియు పాత్రల మధ్య వచ్చే బాండింగ్ ఎమోషన్స్ మీద కూసింత కూడా శ్రద్ధ పెట్టలేదు అలా పెట్టి ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేది.


ఇక మగతా డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే శక్తి శరవనన్ సినిమాటోగ్రఫీ చ్సిమ్ప్లీ సూపర్బ్. తను వాడిన కలరింగ్, లైట్ ఎఫెక్ట్స్ మరియు అతను చూపించిన ఆస్ట్రేలియా, స్పెయిన్, న్యూజీ ల్యాండ్ అందాలు చాలా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అంతగా బాలేదు. ఆయన ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. జిబ్రాన్ అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆన్ స్క్రీన్ మీ కళ్ళను ఊగేలా చేస్తాయి కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా జస్ట్ ఓకే. అనల్ అరసు డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ గా ఉన్నాయి. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా హై రేంజ్ లో, చాలా గ్రాండ్ గా ఉన్నాయి. వీళ్ళ ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి కావున సినిమాకి మంచి హెల్ప్ అవుతాయి. 

యువి క్రియేషన్స్ నుంచి మూడవ ప్రాజెక్ట్ జిల్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదొక రొటీన్ కమర్షియల్ సినిమా. మన టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్టైనర్స్ అనేది చాలా కామన్.. కాకపోతే ఆ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో ఎమోషన్స్, రొమాంటిక్ ట్రాక్, యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీ, సాంగ్స్ లాంటి వాటిని బాగా సమకూర్చుకొని చెయ్యాలి. రాధాకృష్ణకి ఇలా అన్నిటిని సమకూర్చే అవకాశం ఉన్నా సరిగా రాసుకోలేకపోయాడు.


సినిమా మొదలైనప్పటి నుంచి, సినిమా చాలా ఊహాజనితంగా ఎక్కాడా ఆడియన్స్ ఊహని నిరుత్సాహపరచకుండా ముందుకు వెళ్తుంది. ఇంటర్వల్ బ్లాక్ రొటీన్ గా ఉంటుంది అలాగే సెకండాఫ్ లో ఒక్క ఫైట్ ఎపిసోడ్ ని పక్కన పెడితే మిగతా అంతా స్లోగా ఉంటూ మీ సహనాన్ని, పరీక్షించేలా ఉంటుంది. జిల్ అనే సినిమాని చాలా స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చెయ్యాలని అటెంప్ట్ చేసారు, కానీ అది సగం ఉడికిన కిచిడీలా తయారయ్యింది. ఈ సినిమాకి వెళ్ళాలంటే కాస్త రిస్క్ తీసుకుంటాను అంటే వెళ్ళండి.. 

Gopichand,Rashi Khanna,Radha Krishna Kumar,Pramod Uppalapati,Vamsi Krishna Reddy,Gibran.పంచ్ లైన్ : జిల్ - థ్రిల్ చేయలేకపోయిన జిల్.!

మరింత సమాచారం తెలుసుకోండి: