మా కర్మకాలి మేము ఈ సినిమా చూడటం , సినిమాటోగ్రఫీ మా కర్మకాలి మేము ఈ సినిమా చూడటం , సినిమాటోగ్రఫీ ఒక్కటేంటి అన్నీ ఉన్నాయి , హీరో - హీరోయిన్ ల ఇమ్మెచ్యూర్ పెర్ఫార్మన్స్ , క్రీస్తుపూర్వం నాటి కథ , పరమ బోరింగు కథనం , వేగం లేని నెరేషన్ , వీక్ డైరెక్షన్ , వీక్ లవ్ స్టొరీ అండ్ వీక్ ఎమోషన్స్

చదువు పూర్తి చేసుకొని వీరయ్య పాలెం గ్రామంలో ఆకతాయిగా తిరిగే కుర్రాడే మన డెబ్యూ హీరో చంటి(నాగ అన్వేష్). చంటి తన ఫ్రెండ్స్ అయిన వీర్రాజు(శకలక శంకర్), చారి(జబర్దస్త్ శీను), సుబ్బు(హరీష్)లతో కలిసి ఎలాంటి పని లేకుండా రోజూ ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. మన చంటి సీరియస్ గా చేసే పని ఒక్కటే తన చిన్ననాటి ఫ్రెండ్, ఊరి పెద్ద చౌదరి(ప్రకాష్ రాజ్)గారి అమ్మాయి జానకి(కృతిక జయకుమార్)ని సిన్సియర్ గా లవ్ చేయడం. రోజూ తన వెంటపడే చంటి తన ప్రేమని మాత్రం ఎప్పుడూ జానకికి తెలియచేయడు. కానీ ఫ్రెండ్స్ కి మాత్రం జానకి, తను లవర్స్ అని చెప్పుకుంటూ ఉంటాడు మన చంటి. అలా సాగిపోతున్న టైంలో చౌదరి జానకికి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ టైములో చంటి తన ప్రేమని చెప్పినా తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని జానకి చెబుతుంది. దాంతో బాధ పడుతున్న చంటికి ఏమన్నా హెల్ప్ చెయ్యాలని ఆలోచించిన ఫ్రెండ్స్ శీను(అలీ) సాయంతో పెళ్లి మండపం నుంచి జానకి మరియు చంటిలను కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ తో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి ఏం జరిగింది.? కిడ్నాప్ అయిన వాళ్ళు ఏమయ్యారు.? చివరికన్నా జానకి చంటి ప్రేమని అర్థం చేసుకొని తనతో ప్రేమలో పడిందా.? లేదా.? అన్నది వెండితెరపై చూడాలి.   

వినవయ్యా రామయ్యా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో నాగ అన్వేష్.. నాగ అన్వేష్ లో ఏదో చెయ్యాలనే ఈజ్, తపన ఉన్నాయి కానీ ఏం చెయ్యాలి.? ఎలా చెయ్యాలి.? అనేదానిపై పెద్ద క్లారిటీ అండ్ మెచ్యూరిటీ లేవు, అదీకాక డైరెక్టర్ కూడా సరిగా చెప్పకపోవడంతో అతని నటన బాగా తేలిపోయింది. దాంతో మొదటి సినిమాకి కావాల్సిన కనీస పెర్ఫార్మన్స్ ని కూడా ఆన్ స్క్రీన్ చూపలేకపోయాడు. నటనలో తనకి తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత.. ఇకపోతే ఈ కుర్రాడు డాన్సులు బాగా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన దృశ్యం ఫేం కృతిక జయకుమార్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా తనకి అనుభవం లేదు, అలాగే తనకు ఎవరూ గైడ్ చెయ్యలే.. అందుకే స్క్రీన్ ప్రెజన్స్ మీద పెద్దగా ఐడియా లేనట్టు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. చూడటానికి 90% సీన్స్ లో ఓవర్ మేకప్ తోనే కనిపిస్తుంది. పెర్ఫార్మన్స్ పరంగా నిల్ అయినా లుక్ పరంగా లంగా ఓనీల్లో బాగుంది. అలాగే పాటల్లో గ్లామరస్ గా కనిపించింది. కృతికలో మంచి ఈజ్ ఉంది, దాన్ని సరిగా వాడుకోగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. వీరి తర్వాత మిగతా నటీనటుల విషయానికి వస్తే.. చౌదరిగా ప్రకాష్ రాజ్ డీసెంట్ గా ఉన్నాడు. కానీ ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ చేసేంత డెప్త్ లేదు. బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, షకలక శంకర్, జబర్దస్త్ శ్రీను, హరీష్ లు అక్కడక్కడా బానే నవ్వించడానికి ట్రై చేసారు. ఈ సినిమాలో రిలీఫ్ గా అనిపించేది వీరు కనిపించే కొన్ని నిమిషాలు మాత్రమే. విలన్ గా చేరన్ బాగా చేసాడు. చలపతిరావు, హేమ, సీనియర్ నరేష్, తులసి తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సినిమా రిలీజ్ కి ముందు ఈ చిత్ర హీరో నాగ అన్వేష్ 'నేను నాన్న కలిసి 60కి పైగా కథలు విన్న తర్వాత ఈ స్టొరీని ఫైనలైజ్ చేసామని' చెప్పాడు.. వీళ్ళు ఇన్ని కథలూ వినీ ఫైనల్ గా సెలక్ట్ చేసుకుంది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఓల్డ్ అండ్ ఓల్డెస్ట్ ఫార్మాట్ అయిన పాత చింతకాయ పచ్చడిలాంటి స్టొరీనే కావడం విశేషం.. సరే స్టొరీ లైన్ పాతదే అయినా సీన్స్ ఏమన్నా కొత్తగా రాసుకున్నారా అంటే అదీ లేదు. అన్నీ అదే ఓల్డ్ ఫార్మటు సీన్స్.. ఇక్కడ మారింది ఏంటి అంటే నటీనటులు మారడమే.. అంతకన్నా సినిమాలో మీకు ఎలాంటి కొత్తదనం లేదు.. సినిమా ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ ఫ్రేం వరకూ కథ అనే పాయింట్ ని వదిలేసి కమర్షియాలిటీ అనే యాంగిల్ చుట్టూ ఈ చిత్ర టీం పరుగులు తీసింది.. కథలో దమ్ముంటే కమర్షియల్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి అంటే కానీ కమర్షియాలిటీ అని చెప్పి కథకి సంబంధం లేని సీన్స్, అవసరం లేని అనవసరపు పంచ్ డైలాగ్స్ ఉండకూడదు. ఈ విషయంలో డైరెక్టర్ రామ్ ప్రసాద్ పూర్తిగా రాంగ్ వే లో వెళ్ళాడని తెలుస్తుంది. ఆయన సినిమాలో కమర్షియాలిటీ కోసం పరుగెత్తి కథ అనేదాన్ని పూర్తిగా పక్కనెట్టి నాలుగు కామెడీ సీన్స్, నాలుగు పాటలు, రెండు ఫైట్లు అన్న ఫార్ములాని బాగా ఫాలో అయ్యారు. అదీకాక రామ్ ప్రసాద్ బెస్ట్ అనిపించుకున్న కామెడీ విషయంలో కూడా సక్సెస్ కాలేకపోయాడు. అలాగే లెక్క లేనన్ని తప్పులు, లాజిక్ లేని సీన్స్, సీన్ కి సీన్ కి సంబంధం లేని సీన్స్ మరియు పంచ్ కోసం ప్రాసతో రాసిన డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ఇన్ని అంశాల మీద పెట్టిన శ్రద్దలో 20% అన్నా కథపై పెట్టుంటే సినిమాకి హెల్ప్ అయ్యేది. కానీ ఓ సినిమా సక్సెస్ కి కారణం ఎప్పుడూ ఓ మంచి కథే అవుతుంది అన్న లాజిక్ ని డైరెక్టర్ రామ్ ప్రసాద్ అండ్ టీం ఎలా మరిచారో అర్థం కాలేదు. ఓవరాల్ గా ఈ చిత్ర రైటింగ్ డిపార్ట్ మెంట్ మరియు డైరెక్టర్ రామ్ ప్రసాద్ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా 'వినవయ్యా రామయ్యా'. 

ఇక మిగిలిన డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. రసూల్ ఎల్లోర్ అందించిన సినిమాటోగ్రఫీ సాంకేతిక విభాగంలో మేజర్ హైలైట్. ప్రతి ఫ్రేం చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా ఉంది. ఇక అనూప్ రూబెన్స్ అందించిన పాటలు జస్ట్ ఓకే, అలాగే తను అందించిన నేపధ్య సంగీతం కూడా అంత గొప్పగా లేదు అలా అని చెత్తగానూ లేదు అనేలా ఉంది. వీరబాబు బాసిన డైలాగ్స్ లు పంచ్ లు, ప్రాసలు ఎక్కువ ఉన్నాయి తప్ప సినిమాకి హెల్ప్ అయ్యే డైలాగ్స్ ఒక్కటి కూడా లేవు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాలి. కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక పోతే చివరిగా తన కుమారుడి సినిమా కావడంతో నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి బాగానే ఖర్చు పెట్టాడు. దాంతో నిర్మాణ విలువలు బాగున్నాయి.  


ఒక కొత్త హీరోని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు అతని చేత ఓ టోటల్ డిఫరెంట్ సినిమా చేయిస్తే అతను ప్రేక్షకుల మదిలో రిజిష్టర్ అవుతాడు. ఇప్పటికే ఈ ఫార్ములాని చాలా మంది ప్రూవ్ చేసారు కూడా.. కానీ అలా ట్రై చేసింది చాలా కొద్ది మంది మాత్రమే.. మిగతా వారందరూ రియాలిటీకి దూరంగా, కథ అనే విషయన్ని పక్కన పెట్టేసి కమర్షియాలిటీ అనే దాని చుట్టూ పరిగెడుతున్నారు. కథ - కథనం అనే విషయాలకు కూసింత కూడా విలువ ఇవ్వకుండా నాలుగు కామెడీ సీన్స్, నాలుగు పాటలు, ఓ ఫైట్, లాస్ట్ లో ఓ సెంటిమెంట్ సీన్ ఉంటే చాలు అనే ఫార్మాట్ లో వచ్చిన సినిమా 'వినవయ్యా రామయ్యా'. ఈ సినిమాలో మొదటి నుంచి నేరేషన్ అనేది ఎటో ఎటేటో వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఒకటి రెండు సార్లు మీ పెదాలపైకి చిరునవ్వును తెచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్ప మీరు చూడటానికి ఏమీ లేదు.. మీరు పెట్టే టికెట్ ధరలో కనీసం 10% కూడా మిమ్మల్ని మెప్పించలేని సినిమా ఇది. ఓవరాల్ గా చెప్పాలంటే కమర్షియాలిటీ అనే చెట్టు కింద మొలిచిన మరో ఓల్డ్ ఫార్మటు నడ పరమ బోరింగ్ మూవీ వినవయ్యా రామయ్యా.. ఈ కమర్షియాలిటీ అనే దాని వెనక పరిగెడుతున్న వారందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా... కమర్షియాలిటీ అంటే 6 పాటలు, ఐదు సీన్స్, నాలుగు కామెడీ బిట్స్, మూడు ఫైట్స్, రెండు సెంటిమెంట్ సీన్స్ ఉండేలా కథని రాసుకోవడం కాదు.. ఎలాంటి కథని అయినా ప్రేక్షకుడు మెచ్చుకునేలా, ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా చెప్పడం. కానీ ఈ లాజిక్ ని మరిచిపోయి ఓ డూప్లికేట్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారు. కథ - కథనం - లాజిక్స్ అనేవి ఏమీ లేకుండా గుడ్డిగా ఓ కమర్షియాలిటీ అనే ఫార్మాట్ లో తీసే అట్టర్ ఫ్లాప్ సినిమాలకు పర్ఫెక్ట్ ఉదాహరనే ఈ 'వినవయ్యా రామయ్యా'.    

Naga Anvesh,Kruthika,G. Ram Prasad,Sindhura Puvvu Krishna Reddy,Anup Rubens.పంచ్ లైన్ : వినవయ్యా రామయ్యా - మేము వినలేము, మమ్మల్ని వదిలెయ్ రామయ్యో.!

మరింత సమాచారం తెలుసుకోండి: