Routine Love Story Tweet Review || Routine Love Story Full English Review ప్రవీణ్ సత్తారు రూపొందించిన సినిమా రొటీన్ లవ్ స్టోరీ. ఎల్ బి డబ్ల్యూ సినిమాతో ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ సారి రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.   సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.       చిత్రకథ :   ఇంజనీరింగ్ విద్యార్థి సందీప్ (సందీప్ కిషన్) తొలి చూపులోనే తన్వీ (రెజీనా)ను ప్రేమిస్తాడు. తాను ఓకే చెప్పాలంటే సందీప్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని తన్వీ అనుకుంటుంది. దీంతో సందీప్-తన్వీ లు ఒకసారి తమ కాలేజ్ విద్యార్థులతో కలసి కాశ్మీర్ విహార యాత్రకు వెళ్తారు. అలాగే తన్వీ తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు కలసి ఉంటారు. సందీప్-తన్వీ లు మధ్య బంధం చివరికి ఎక్కడికి చేరింది..? ఇద్దరూ ఏలా ఒక్కటయ్యారు అనేది చిత్ర కధ. కాగా, ఈ కథను ఓ దర్శకుడు ఓ నిర్మాతకు చెప్పే విధంగా సాగుతుంటుంది. నటీనటుల ప్రతిభ : ఆహ్లదంగా సాగే ఈ ప్రేమకథలో సందీప్ కిషన్-రెజీనా జోడి చక్కగా నటించింది. అలాగే వాళ్ల స్నేహితులుగా నటించిన వాళ్ళు ఆ సన్నివేశాలకు జీవం పోశారు. ఝూన్సీ, తాగుబోతు రమేష్ తదితరులు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాటలు సినిమాకు తగ్గట్లుగా సాగాయి. పేరుకు తగ్గట్లే ఈ సినిమా ‘ ఓ రొటీన్ లవ్ స్టోరీ’. పెద్ద పెద్ద మలుపులు కూడా ఈ సినిమాలో లేవు. అయితే ప్రేమికుల మధ్య ఉండే తగదాలు, అపార్థాలు, ప్రేమికుల మధ్య జరిగే సహజ సంఘటనలతో ఈ సినిమాను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. చక్కని హాస్యంతో కుటుంబ సభ్యులు చూడగలిగే విధంగా ఈ సినిమా రూపొందింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధించే విధంగా ఆడవాళ్ళ గురించి వివరించే సన్నివేశం, ఆడవిలో హీరోయిన్ తల్లిదండ్రలు చిక్కుకోవడం వంటి సన్నివేశాలు బాగున్నాయి.   హైలెట్స్ :   సందీప్ కిషన్- రెజీనా నటన, మిక్కీ జె మేయర్ సంగీతం, ఆహ్లాదంగా సాగే స్ర్కీన్ ప్లే,  డ్రాబ్యాక్స్ :   సాధారణమైన కథ, యువతను మాత్రమే ఆకట్టుకునే సినిమా  చివరగా :   రొటీన్ కు కాస్త బిన్నంగా ‘రొటీన్ లవ్ స్టోరీ’   More Articles on Krishnam Vande Jagadgurum || Krishnam Vande Jagadgurum Photos & Wallpapers || Krishnam Vande Jagadgurum Videos  

మరింత సమాచారం తెలుసుకోండి: