ఛార్మీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ఛార్మీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , నో థ్రిల్స్.. నో హర్రర్ ఎలిమెంట్స్ , తికమకగా చేసిన డైరెక్షన్ , స్ఫూర్తి పొందిన నేరేషన్ , సీన్స్ కి సీన్ కి సంబంధం లేకపోవడం

మంత్ర లాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మంత్ర 2 సినిమా కథ మొత్తం మంత్ర(ఛార్మీ)చుట్టూ తిరుగుతుంది. హాస్టల్లో ఒంటరిగా ఉంటూ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ గా ఉద్యోగం చేసే మంత్ర హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను రామరావు(తనికెళ్ళ భరణి), పద్మిని(పద్మిని) ఉండే ఓ స్పెషల్ హౌస్ లో వాళ్ళతో పాటు ఉంటుంది. అలా ఆ ఇంట్లో ఉంటూ లైఫ్ ని లీడ్ చేసే తనకి తన కాలేజ్ మేట్ అయిన ఎసిపి కే విజయ్(చేతన్ చీను) కనిపిస్తాడు. వీరి పరిచయం పెరుగుతున్న సమయంలో మంత్ర ని ఎవరో చంపాలని ట్రై చేస్తుంటారు. దాంతో విజయ్ మంత్రని తన ఇంట్లో పెట్టి, మంత్ర ఉంటున్న ఇంట్లో ఏమి జరుగుతోందా అని తెలుసుకోవడానికి మరో నలుగురు టీవీ రిపోర్టర్స్ తో కలిసి ఆ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ వింత శబ్దాలు వస్తుంటాయి, ముందుగా నలుగురు టీవీ రిపోర్టర్స్ చనిపోతారు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి.? ఆ హౌస్ నుంచి విజయ్ బయటపడ్డాడా.? ఆ హౌస్ కి మంత్రకి, రామారావు - పద్మిని - మంత్రలకు ఉన్న సంబంధం ఏమిటి.? మంత్రని చంపడానికి ట్రై చేస్తున్నడి దెయ్యమా మనిషా.? అన్న విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలి.

ఇటీవలే వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో ఛార్మింగ్ హాట్ బ్యూటీ ఛార్మీ తన పెర్ఫార్మన్స్ పరంగా పరవాలేదనిపించుకుంది. కానీ ఈ సినిమాతో మాత్రం ఛార్మీ ఒక నటిగా చెడ్డ పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూసాక ఎక్స్ ప్రెషన్ లేని దెయ్యం చెత్తగా ఉందా, సాఫ్ట్ వేర్ గా చేసిన హీరోయిన్ చెత్తగా ఉందనేది చెప్పలేకపోతున్నాం. ఛార్మీ హావభావాలు చాలా డంబ్ గా అనిపిస్తాయి. చాలా సీన్స్ లో తన ఎమోషన్స్, లుక్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఛార్మీ కెరీర్ లోనే వరస్ట్  పెర్ఫార్మన్స్ మీరు ఈ సినిమాలో చూడచ్చు. తొలి పరిచయం అయిన చేతన్ చీను నటుడిగా ఇంకా చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి డైలాగ్ డెలివరీ ఎలా చెయ్యాలన్నది నేర్చుకోవాలి. ఇక హావ భావాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. తనికెళ్ళ భరణి, పద్మిని తమ పాత్రలకు న్యాయం చేసారు. రాహుల్ దేవ్ కూడా ఓకే అనిపించాడు. ఇక సినిమాలో ఉన్న మిగతా పాత్రలన్నీ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చెయ్యడానికి ట్రై చేసినవే.. వారు వారు వారి పాత్రల్లో బాగానే చేసారు.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఎస్.వి సతీష్ ఎమోషనల్ హర్రర్ కథకి ఒక సెపరేట్ విలన్ ని జత చేసి ఏందో డిఫరెంట్ గా ట్రై చెయ్యాలి అనుకున్నాడు. కానీ కథలో దమ్ము లేకపోవడం వలన సినిమా అస్తవ్యస్తంగా తయారైంది. చాలా అంటే చాలా సిల్లీగా అనిపించే కథ. ఇదొక హర్రర్ సినిమా కానీ ఇందులో లేని అంశం అంటూ లేదు.. లవ్, ఐటెం సాంగ్, రివెంజ్, డ్రామా, కాస్త కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలనుకోవడం వలన డైరెక్టర్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి తికమకగా సినిమాని తీసేసాడు. అలాగే దెయ్యం కోసం రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ స్టొరీ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇదొక హర్రర్ సినిమా కానీ సినిమాలో మిమ్మల్ని థ్రిల్ చేసే లేదా భయపెట్టే సీన్ ఒక్కటి కూడా లేకపోవడం ఆ జోనర్ సినిమాకి పెద్ద అవమానం. డైరెక్టర్ ప్రోపర్ గా చెప్పడానికి ఏమీ లేకపోవడం వలన స్క్రీన్ ప్లే కూడా పెద్ద మైనస్ అయ్యింది. ఈ సినిమా చార్మీ కౌర్ పై వచ్చే 'భూమ్ భూమ్' సాంగ్ తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత నేరేషన్ మొత్తం 'మార్నింగ్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ' అనే సినిమాని స్పూర్తిగా తీసుకొని చేసారు. మొదట్లో తనపై జరిగే అటాక్స్ తో ఛార్మీ చూసే ఆడియన్స్ లో ఆసక్తినిపెంచుకుతుంది, అందరూ నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు, కానీ అక్కడ ఏమీ జరగదు.. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా డ్రాగ్ చేసి బోరింగ్ గా సాగుతుంది.  


ఇక సెకండాఫ్ లో డైరెక్టర్ ఒక రైటర్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అంతే కాక ప్రీ క్లైమాక్స్ ని మరింత సాగదీయడం వలన ఆడియన్స్ కి క్లైమాక్స్ చూడాలి అన్న ఆసక్తి పోతుంది. మధ్య మధ్యలో లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిస్టర్బ్ చెయ్యడమే కాకుండా ఇదొక హర్రర్ సినిమా అని గుర్తు చేస్తుంటుంది. ఇక అందరూ ఓ హౌస్ లో ఇరుక్కుపోతారు.. అక్కడ దెయ్యం అందరినీ చంపుతూ ఉంటుంది. కానీ ఒక్కరూ కూడా అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చెయ్యకపోవడం కాస్త విడ్డూరంగా ఉంటుంది. అలాగే మొదటి నుంచి అందరినీ దెయ్యం చంపుతుంది, కానీ మెయిన్ విలన్ ని చంపాలి అనుకున్నప్పుడు మాత్రం మంత్ర బాడీలోకి వస్తుంది, ఇదెక్కడి లాజిక్ డైరెక్టర్ గారు.. ఉంటె దెయ్యం మొదటి నుంచి సపోర్ట్ తీసుకోవాలి లేదా తీసుకోకూడదు, అంతే కానీ ఈ లాజిక్ ఏంది.? ఇలాంటి సిల్లీ లాజిక్స్ మీకు చాలానే దొరుకుతాయి. డైరెక్టర్ సతీష్ చాలా విషయాలను సినిమాలో చూపించేయాలి అని ఆరాటపడటం వలన సినిమా మొత్తం పెద్ద గందరగోలంగా తయారైంది. సునీల్ కశ్యప్ ని మ్యూజిక్ పరంగా మెచ్చుకోవాలి. తన మ్యూజిక్ లౌడ్ గా ఉన్నా తనవల్లే మనకు అక్కడక్కడా హర్రర్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఒక సీన్ తర్వాత వచ్చే సీన్ కి అస్సలు సింక్ ఉండదు. ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడం ఆడియన్స్ కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. సినిమాటోగ్రఫీ బాగుంది. మంత్ర 2 లో ఉన్న మరో సమస్య సినిమాని చాలా సింపుల్ గ చెప్పాలి కానీ సాగదీసి సుమారు రెండు గంటలు చెప్పడం ఆడియన్స్ కి తలనొప్పి తెచ్చిపెడుతుంది. సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా మంత్ర 2 మిమ్మల్ని ఎంటర్ టైన్ చెయ్యదు, థ్రిల్ చెయ్యదు. అలాంటప్పుడు ఆడియన్స్ కి తలనొప్పే వస్తుంది. తేజ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా ఉంది.


ఈ మధ్య కాలంలో కొంతమంది దర్శకులు టాలీవుడ్ కి కొత్త జానర్ సినిమా కథలను పరిచయం చేయాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమానే ఇది. అందులో భాగంగానే హర్రర్ కి కాస్త వేరే యాంగిల్ లో రివెంజ్ డ్రామాని జత చేసాడు. కానీ ఒక్క సినిమాలోనే అన్నీ చెప్పేయాలని అన్నీ పెట్టేసి పెద్ద గందరగోళం క్రియేట్ చేసాడు డైరెక్టర్ సతీష్. ఇదో సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కానీ ఇందులో ఒదతి సినిమాలోలా థ్రిల్ చేసే అంశం ఒక్కటీ లేకపోవడం ఆడియన్స్ లో సినిమాపై బాడ్ ఫీలింగ్ ని కలిగిస్తుంది.  ఈ సీక్వెల్ ఉన్నది ఏమిటి అంటే మొదటి పార్ట్ లో ఉన్న ఛార్మీనే ఇందులో కూడా లీడ్ రోల్ చెయ్యడం. కానీ ఈ సీక్వెల్ ఓరిజినల్ వెర్షన్ పేరుని చెడగొట్టడానీకె వచ్చిందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాం.. మంత్ర 2 లో చూసి ఎంజాయ్ చెయ్యడానికి ఒక్క అంశం కూడా లేదు.. సో ఈ సినిమాని లైట్ తీస్కోండి.. 

Charmi Kaur,Chethan,S.V.Sateesh,P.Showri Reddy,V.Yadagiri Reddy,Sunil Kashyapపంచ్ లైన్ : మంత్ర 2 - ఒరిజినల్ 'మంత్ర'కి ఉన్న పేరు చెడగొట్టడానికి వచ్చిన సీక్వెల్.!

మరింత సమాచారం తెలుసుకోండి: