మోహన్ లాల్ , విజయ్ కాంబినేషన్ అండ్ పెర్ఫార్మన్స్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ బిట్స్ , హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ , డి. ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , కాజల్ గ్లామర్ మోహన్ లాల్ , విజయ్ కాంబినేషన్ అండ్ పెర్ఫార్మన్స్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ బిట్స్ , హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ , డి. ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , కాజల్ గ్లామర్ రొటీన్ సెకండాఫ్ , ఓల్డ్ ఫార్మాట్ క్లైమాక్స్ , స్పీడ్ బ్రేకర్స్ గా అనిపించే సాంగ్స్ , ఊహాజనితమైన స్క్రీన్ ప్లే , తెలుగులో చాలా సినిమాల పోలికలు ఉండే కథ , సినిమా లెంగ్త్

2014 సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ అయిన తమిళ సినిమా జిల్లా'కి ఇది డబ్బింగ్ వెర్షన్. ఇక కథలోకి వస్తే.. ఆంధ్రలో పవర్ఫుల్ ప్రాంతమైన బెజవాడలో ఫేమస్ రౌడీ డాన్ శివయ్య(మోహన్ లాల్). అతని దగ్గర పనిచేస్తూ, తనని కాపాడపోయి చనిపోయిన డ్రైవర్ కొడుకు శక్తి(విజయ్)ని శివయ్య  పెంచుతాడు. శివయ్య - శక్తి సొంత తండ్రీ కొడుకుల్లా పెరుగుతారు. ఆ జిల్లాలో ఏం తప్పు జరిగినా అది మేమే చెయ్యాలి అనే మనస్తత్వం కలవాళ్ళే ఈ శివయ్య - శక్తి. తన తండ్రిని ఒక పోలీస్ ఆఫీసర్ చంపాడు అనే కారణం చేత శక్తికి పోలీసులంటే కోపం, అసూయ. ఓ రోజు శక్తి శాంతి(కాజల్ అగర్వాల్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ తను పోలీస్ ఆఫీసర్ అని తెలిసి ప్రేమని కాన్సల్ చేస్తాడు. ఇలా జరుగుతున్న టైంలో బెజవాడ కమీషనర్ గా ప్రదీప్ రావత్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వడమే శివయ్యని ఓ ఘోర అవమానానికి గురి చేస్తాడు. దాంతో శివయ్య తమకి అడ్డుగా నిలుస్తున్న ఆ ఏరియా ఏసిపిగా మన వాడు ఉంటేనే ఆ ఏరియాలో తనకి మరింత గ్రిప్ వస్తుందని శక్తిని ఏసిపి చెయ్యాలనుకుంటారు. శక్తికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏసిపిని చేస్తారు. శక్తి ఏసిపి అయిన తర్వాత ఓ సంఘటన వలన శివయ్యకి ఎదురు తిరుగుతాడు.? అలా ఎదురు తిరిగి ఏం చేసాడు.? శక్తిని శివయ్యకి ఎదురు తిరిగేలా చేసిన సంఘటన ఏది.? అనే విషయాలను మీరు సిల్వర్ స్క్రీన్ పైన చూడాలి.. 

ఈ సినిమాలో ఆడియన్స్ కి ఆసక్తి కలిగించేది మోహన్ లాల్ - విజయ్ కాంబినేషన్. మోహన్ లాల్ శివన్న పాత్రలో సూపర్బ్ గా చేసాడు. ఒకే పాత్రలో పాజిటివ్ మరియు నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు. ఇకపోతే ఇలయథలపథి విజయ్ కి ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాకపోవడం వలన ఎప్పటిలానే తన పాత్రకి న్యాయం చేసాడు. విజయ్ లో మనం కొత్తగా చూసేదీ ఏమీ ఉండదు. పాత్ర పరంగా కామెడీని, సీరియస్ నెస్ ని బాగా చూపించాడు. మోహన్ లాన్ - విజయ్ కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి. కానీ వీరికి చెప్పిన వాయిస్ లు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. కాజల్ అగర్వాల్ ది ఒక గ్లామరస్ రోల్ మాత్రమే.. కథలో అక్కడక్కడా గ్లామర్ అట్రాక్షన్ మరియు పాటల కోసం తప్ప ఇంకదేనికీ వాడుకోలేదు. సూరి చేసిన కామెడీలో ఒకటి రెండు పంచ్ లు బాగా పేలినా మిగతావి మాత్రం పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. బ్రహ్మానందం చేత చేయించిన గెస్ట్ రోల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సంపత్ నెగటివ్ షేడ్స్ పాత్రలో బాగానే చేసాడు. ప్రదీప్ రావత్, మహాత్ రాఘవేంద్ర, తదితరులు తమ పాత్రల్లో ఒక అనిపించారు. 

జిల్లా సినిమా మన తెలుగులో వస్తున్న చాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఫార్మాట్లో వచ్చిన తమిళ సినిమా.. ఇలాంటి సినిమా తమిళంలో మంచి విజయం అందుకోవడానికి కారణం.. ఈ సినిమాకి కెప్టెన్ అయిన డైరెక్టర్ నేసన్ ఒక క్రేజీ కాంబినేషన్ ని ఆన్ స్క్రీన్ సెట్ చెయ్యడమే.. అదే మోహన్ లాల్ - విజయ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ని సెట్ చెయ్యడం మరియు పాత్రలని డిజైన్ చేసుకున్న తీరు అంతా బాగానే ఉంది, కానీ సినిమా మొదట్లో చూపిన పాత్రలను చివరి వరకూ అదేలా చూపలేకపోవడం తను చేసిన పెద్ద మిస్టేక్. మొదట్లో పాత్రలు పవర్ఫుల్ గా ఉంటాయి, కానీ చివరికి వచ్చేసరికి అంత స్ట్రాంగ్ గా లేకుండా తేలిపోయాయి. ఇక కథ పరంగా కూడా నేసన్ కొత్త పాయింట్ ఏమీ చెప్పలేదు. చాలా రెగ్యులర్ సినిమాల్లో వచ్చిన ఫార్మాట్ నే కాస్త డిఫరెంట్ గా చెప్పడానికి ట్రై చేసాడు, డిఫరెంట్ గానే స్టార్ట్ చేస్తాడు కానీ చివరికి తీసుకొచ్చి ఆక్ ఈస్ పాక్, పాక్ ఈజ్ ఆక్ సో ఆక పాక్ కరేపాక్ అనేలా మరీ రెగ్యలర్ ఫార్మాట్ లోకి తీసుకోచ్చేసాడు. స్క్రీన్ ప్లే పరంగా సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది, అక్కడి నుంచి ఇంటర్వల్ కి వచ్చే సరికి ఆ ఫీలింగ్ కాస్త తగ్గుతుంది, ఇక సెకండాఫ్ కి వచ్చే సరికి పూర్తి ఊహాజనితంగా మారిపోతుంది. ముఖ్యంగా సెకండాఫ్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కి వచ్చే సరికి మరీ ఆడియన్స్ ఏమనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. సెకండాఫ్ విషయంలో నేసన్ ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేయడంలో టోటల్ గా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. కథ, స్క్రీన్ ప్లే పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేసన్ డైరెక్టర్ గా మాత్రం నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మన్స్ ని రాబట్టుకోవడమే కాకుండా, రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ ని స్క్రీన్ పై సూపర్బ్ గా తీయగలిగాడు. అవే ఈ సినిమాకి హెల్ప్ అయ్యాయి.


ఇక మిగిలిన డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. డి. ఇమాన్ మ్యూజిక్ అందించిన పాటలు తెలుగులో ఆడియన్స్ కి ఏ మాత్రం ఎక్కేలా లేవు. దానికి తోడూ సినిమాలో సందర్భానుసారంగా కాకుండా ఎలా పడితే అలా వచ్చి సినిమా ఫ్లోని దెబ్బతీసాయి. సాంగ్స్ ఫెయిల్ అయినా ఇమాన్ అందించిన నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. హీరోయిజం ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. గణేష్ రాజవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. అన్ని లొకేషన్స్, మరియు సీన్స్ ని బాగా షూట్ చేసాడు. తమిళ్ తో పోల్చుకుంటే తెలుగులో 20 నిమిషాలు కట్ చేసారు. కానీ డాన్ మాక్స్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని రన్ టైంలో ఇంకో 10 నిమిషాలు తగ్గించాల్సింది. తెలిసిన కథని అంతసేపు చూడడం వలన ప్రేక్షకులు ఏదో సంవత్సర కాలంగా సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సెల్వ యాక్షన్ కంపోజింగ్ బాగుంది. తెలుగు వెర్షన్ పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ వారి డబ్బింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

తమిళంలో గత ఏడాది మొదట్లో వచ్చి హిట్ అయిన ఈ సినిమా 'జిల్లా'. రొటీన్ కథే అయినా ఆడియన్స్ కోరుకునే అన్ని మాస్ మసాలా ఎలిమెంట్స్, మోహన్ లాల్ - విజయ్ క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాకి హెల్ప్ అయిన పాయింట్స్. తెలుగులో కూడా అవే ఎలిమెంట్స్ హైలైట్ అయ్యాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి మెప్పిస్తుంటాయి. కానీ ఇది మాత్రం మన తెలుగులో వచ్చిన ఎన్నో కమర్షియల్ మాస్ మసాలా సినిమాల్లానే ఉంటుంది. డైరెక్టర్ నేసన్ ఎలాంటి కొట్టడం లేకుండా రెగ్యులర్ కథకి కొన్ని మాస్ ఎలిమెంట్స్ ని జత చేసి ఈ సినిమాని తీసేసాడు. ఓవరాల్ గా జిల్లా సినిమా తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ఓ రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్టైనర్. కేవలం మాస్ ఆడియన్స్ నుంచి మాత్రం కాస్త కాసులు కలెక్ట్ చేసుకునే సినిమా 'జిల్లా'.   

Vijay,Kajal Aggarwal,Mohanlal,R T Nesan,RB Choudary,D. Imman.పంచ్ లైన్ : జిల్లా - తమిళం నుంచి వచ్చిన రొటీన్ తెలుగు ఫార్మాట్ కమర్షియల్ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: