మా కర్మ కాలిపోయి మేము ఈ సినిమాని చూడడం. మా కర్మ కాలిపోయి మేము ఈ సినిమాని చూడడం. సినిమా అంటే వచ్చే 24 డిపార్ట్ మెంట్లు అన్నీ మైనస్ లే.!

శ్రీలంక తమిళియన్స్ మధ్య జరిగిన వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పొలిటికల్ స్పై థ్రిల్లర్ మాలిని & కో. ఈ శ్రీలంక వార్ లో అన్యాయంగా చనిపోయిన తమిళియన్స్ కథే ఇది. ధనరాజ్(సుమన్ తల్వార్) మొగలియార్ కాలనీలో నడిపే ఒక స్పా సెంటర్ లో ఇన్నోసెంట్ వర్కర్ లా మాలిని(పూనమ్ పాండే) ఎంట్రీ ఇస్తుంది. ఆ కాలనీలోని అందరు లేడీస్ తనకి వ్యతిరేఖమైనా పోలీసులు తనని ఎవరూ అరెస్ట్ చెయ్యరు. అక్కడ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి ఓనర్ అయిన లేడీ(కావ్య సింగ్) మాలిని అసలు కథ చెబుతుంది. తన భర్త ధర్మేంద్ర(సామ్రాట్)ని ట్రీట్ మెంట్ కోసం ముంబైలో చేర్చారని, అప్పుడే మాస్టర్ వేల్ నాయకన్ - కమాండర్ రంగ రాజన్ లు ప్లాన్ చేసి మాలినిని ధనరాజ్ దగ్గరికి పంపి లంక తమిళియన్స్ కి సాయం చేయమని చెప్పారని చెబుతుంది. అప్పుడే కథలో అసలైన ట్విస్ట్.. అసలు మాలిని తన ఒరిజినల్ కథని రివీల్ చేసి, ఆ కాలనీలో జరగనున్న ఓ పెద్ద బాంబు బ్లాస్ట్ ని ఆపుతుంది. అసలు మాలిని రియల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి.? సామ్రాట్ ఎందుకు హాస్పిటల్ లో ఉన్నాడు.? అ కాలనీ జరగోబోయే బాంబు బ్లాస్ట్ ని ఎందుకు మాలిని ఆపింది అనే విషయాలు మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. 

మాలిని & కో సినిమాతో పూనం పాండే తెలుగు చిత్ర సీమకి పరిచయమైంది. స్వతహాగా హాట్ బ్యూటీ అయిన పూనమ్ పాండే తన యాక్టింగ్ స్కిల్స్ తో కంటే తన అందాల ఆరబోత, ఒంపు సొంపులతోనే ఎక్కువ ఆకట్టుకోవడానికె ట్రై చేస్తుంది. అదే ఈ సినిమాలోనూ జరిగింది. కానీ మాలిని పాత్రలో పూనమ్  పాండేకి చాలా ఎమోషన్స్ ని చూపే ఆస్కారం ఉంది. కానీ తన హావ భావాలతో అనుకున్న మాలిని పాత్రకి న్యాయం చేయలేకపోయింది. సుమన్ తల్వార్, అజయ్ రత్నం, జాకీర్ హుస్సేన్, రవి కాలే లాంటి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయలేకేపోయారు. ఇక్కడ ఆశ్చర్య పరిచే విష్యం ఏమిటంటే అసలు నిర్మాతలు ఎలా వీరందరినీ ఒక సినిమాలో పార్ట్ చేసారు, చేసి వారిని సరిగా ఎందుకు వాడుకోలేకపోయారు. మిగిలిన చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన  కావ్య సింగ్, ఖుషి, ఫరా ఖాన్, గీతిక, సునాల్ రతి, సామ్రాట్ లు కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. 

ఈ సినిమా గురించి ఏ పక్క మొదలు పెట్టి ఏ పక్క ఎండ్ చెయ్యాలో అర్థం కావట్లే.. సినిమాకి కథే కీలకం కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతా.. ఈ సినిమా కథని జాన్ అబ్రహం హీరోగా వచ్చిన మద్రాస్ కెఫే అనే సినిమా నుంచి పూర్తిగా ఇన్స్పైర్ అయ్యారు. దాన్లోని మెయిన్ రాజేవ్ గాంధీ బ్లాక్ ని తీసేసి మిగతా అంతా అలానే పెట్టి అక్కడక్కడే చిన్న చిన్న మార్పులు చేసారు. కథ ఇలా అయ్యింది, కనీసం కథనం అన్నా బాగుందా అంటే అదీ లేదు. కథనంలో వేగం అస్సలు ఉండదు. అలాగే డైరెక్టర్ సినిమాపై క్లారిటీ పూర్తిగా మిస్ అయ్యాడు. క్లారిటీ ఎంతలా మిస్ అయ్యాడు అంటే.. ఆయన అనుకున్నది చూపించాలి అనుకోలేదు, ఆడియన్స్ కి పూనమ్ పాండే ని ఎలా చూపిస్తే నచ్చుతుందా అని మాత్రమే ఆలోచించి దాన్నే చూపించాడు. అనుకున్నట్టుగానే పూనమ్ పాడే అందాలను స్కిన్ షో ని మాత్రమే కాప్చ్యూర్ చేసాడు. దాంతో సినిమా లో కంటెంట్ పక్కకి వెళ్ళిపోవడం కథనం గందరగోలంగా తయారయ్యింది. బేసిక్ లాజిక్స్ ఆలోచించే వారికి కూడా మాలిని అండ్ కో పెద్ద టార్చర్ అనిపిస్తుంది.  వాటికి తోడు పూనమ్  పాండే దొరికింది కదా అని మూడొస్తే ఓ పాట పెట్టేసాడు. అవి చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తాయి. అలాగే సినిమాలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సౌత్ లో వచ్చిన కొన్ని సినిమాలలోని ఫేమస్ మ్యూజిక్ బిట్స్ ని వాడుకున్నారు. ముఖ్యంగా సేల్ఫీ పుల్ల సాంగ్ ని బాగా వాడుకున్నారు. సినిమాటోగ్రాఫర్ కూడా లొకేషన్స్ మీదకంటే పూనమ్ పాండే ఒంపు సొంపుల మీదే ఎక్కువ ద్రుష్టి పెట్టాడు. అతను చూపిన కొన్ని జూమ్ షాట్స్ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. మనకు ఎంత నచ్చిన ఫుడ్ అయినా ఎక్కువ తింటే వెగటుగా అనిపిస్తుంది. అలాగే అనవరంగా చూపిన క్లీవేజ్ షాట్స్ చిరాకు పెడతాయి. డైలాగ్స్ లో అయితే అస్సలు సెన్స్ లేదు. ఈ సినిమాలో ఒక లైన్ ఉంది.. తన బ్రెయిన్ డెడ్ భర్తని కాపాడుకోవడం కోసమే స్పా సెంటర్ ఓపెన్ చేసానని చెబుతుంది. ఇందులో అస్సలు సెన్స్ అనేదే లేదు. ఎడిటర్ మాలిని & కో ని ఎంత బోరింగ్ గా చూపించవచ్చో అంట బోరింగ్ గా ఎడిట్ చేసాడు. గతంలో యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు లాంటి సినిమాలు చేసిన మనీషా ఫిల్మ్స్ కి ఇదొక మరచిపోలేని పీడకల లాంటి సినిమా. 

ఈ మధ్య కాలంలో క్రేజున్న అందాల భామలని, జస్ట్ హీరోయిన్స్ అందాలని బేస్ చేసుకొనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి కోవలో వచ్చిన సినిమానే 'మాలిని & కో'. ప్రతి నెల మేము ఎన్నో డిజాస్టర్ సినిమాలను థియేటర్స్ లో చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు టాలీవుడ్ లో దీనికంటే చెత్త సినిమాలు ఇంకేమీ రావేమో అనే ఫీలింగ్ వస్తుంది. కానీ వాటన్నిటి మీద ఉన్న ఒపీనియన్ పాటా పంచలు చేసి వాటికన్నా చాలా డిజాస్టర్ అండ్ వరస్ట్ ఫిల్మ్ ని చూసాం అనే ఫీలింగ్ ని కలిగించిన సినిమా 'మాలిని & కో'. భయపెట్టేలా ఉండే నటీనటుల పెర్ఫార్మన్స్, ఇంతకన్నా చెత్త లేదు అనిపించే ఎడిటింగ్, సోది స్క్రీన్ ప్లే, వీటికంటే డిజాస్టర్ గా అనిపించే డైరెక్షన్ ని మీరు ఈ సినిమాలో చూడచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది వచ్చిన, రాబోయే వరస్ట్  డిజాస్టర్ సినిమాల్లో 'మాలిని & కో'కి మొదటి స్థానాన్ని ఇచ్చేయచ్చు.

Poonam Pandey,Samrat,Veeru K,Mahesh Rathi & Kishore Rathi,Kasarla Shyam.మాలిని & కో - ఈ ఏడాది వచ్చే పరమ వరస్ట్ సినిమాలలో నెం.1 మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: