క్లైమాక్స్ ట్విస్ట్ , కొంతమంది పెర్ఫార్మన్స్ , సినిమాటోగ్రఫీ , ఆర్ట్క్లైమాక్స్ ట్విస్ట్ , కొంతమంది పెర్ఫార్మన్స్ , సినిమాటోగ్రఫీ , ఆర్ట్సాగదీసి వదిలిన కథనం , స్లో స్లో నేరేషన్ , 151 నిమిషాల రన్ టైం , హర్రర్ ఎలిమెంట్స్ మిస్సింగ్ , వర్కౌట్ కాని రొటీన్ సొల్లు కామెడీ , ఊహించదగిన కథ , వీక్ డైరెక్షన్ , కథకి కీలకమైన డ్రీమ్స్ అనే పాయింట్ నే వదిలేయడం , ఎడిటింగ్ , నేపధ్య సంగీతం , అవసరం లేకుండా వచ్చే పాటలు

బాగా హిట్ ఫార్ములాగా మారిన హర్రర్ కామెడీకి ఒక్క థ్రిల్లింగ్ పాయింట్ కూడా మిక్స్ చేసి తీసిన సినిమానే త్రిపుర. వరాహపట్నం అనే గ్రామానికి చెందిన అమ్మాయి త్రిపుర(స్వాతి). తనకి చిన్నప్పటి నుంచి కొన్ని కళలు వస్తుంటాయి, అవి నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. దానికి ట్రీట్ మెంట్ కోసం అని సిటీ తీసుకెళ్తే అక్కడ త్రిపురని ట్రీట్ చేసిన డాక్టర్ నవీన్ చంద్ర(నవీన్ చంద్ర) తన ప్రేమలో పడతాడు. ఫైనల్ గా త్రిపురని పెళ్లి చేసుకొని సిటీకి తీసుకొస్తాడు. మొదట్లో త్రిపుర కలల్ని సిల్లీగా తీసుకున్న నవీన్ కొన్ని సంఘటనల వలన త్రిపురని నమ్మడం మొదలు పెడతాడు. అలాగే తనతో పాటే పనిచేసిన డాక్టర్ ఈశ(పూజ రామచంద్రన్) కొద్ది రోజుల నుంచి కనపడకపోవడంతో తను చనిపోయిందని నిర్ధారించిన పోలీస్ ఆఫీసర్ తిలక్ ఆ మర్డర్ నవీన్ చంద్రనే చేసాడు అని అతన్ని టార్గెట్ చేస్తాడు. అదే టైంలో త్రిపుర కూడా తనే స్వయంగా నవీన్ ని చంపేస్తున్నట్టు ఓ కల కంటుంది. ఈ రెండు సంఘటనల నుంచి నవీన్ చంద్ర ఎలా భయటపడ్డాడు? నిజంగానీ నవీన్ ఈశని చంపాడా.? అసలు త్రిపురకి తన భర్త నవీన్ ని చంపే కల ఎందుకు వచ్చింది అనే విషయాలను మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోండి. 

నటీనటుల పరంగా చెప్పుకోవాల్సి వస్తే.. ఇది స్వాతి చుట్టూనే తిరిగే కథే కానీ తనొక్కతే ఈ సినిమాకి మెయిన్ కాదు. తనతో పాటు మెయిన్ రోల్స్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇక త్రిపురగా స్వాతి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. చెప్పాలంటే తనకోసం ఓ సూపర్బ్ రోల్ ని ఏమీ డిజైన్ చేయలేదు. ఇప్పటి వరకూ చేయనిది కూడా ఇందులో ఏమీ చేయలేదు. స్వాతి బెస్ట్ అనిపించుకున్న సీన్ అంటే క్లైమాక్స్ లో ఘోస్ట్ ఎపిసోడ్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇక హీరోగా చేసిన నవీన్ చంద్ర సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడు. చాలా బాగా నటించాడు. ఇన్నోసెంట్ గా, నెగటివ్ షేడ్స్ లో హావభావాలను బాగా పలికించిన నవీన్ చంద్ర, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్  లో సూపర్బ్ గా చేసాడు. ఇక పూజ రామ చంద్రన్ కూడా తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. పెర్ఫార్మన్స్ కూడా బాగా చేసింది. ధన రాజ్ పెళ్లి కొడుకుగా నవ్వించే ప్రయత్నం చేసాడు. సప్తగిరి సినిమాలో చాలా సేపు ఉన్నప్పటికీ నవ్వించింది మాత్రం చాలా తక్కువ. ప్రతి సినిమాల్లో లానే చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంది సప్తగిరి పాత్ర. ఇక జయప్రకాశ్ రెడ్డి, శకలక శంకర్ లు కాస్త నవ్వించారు. శ్రీమాన్, రావు రమేష్, తదితరులు తమ పాత్రల పరిదిమేర నటించారు. 

సాంకేతిక విభాగంలో త్రిపుర అనే సినిమాకి హెల్ప్ అయ్యింది ఒకే ఒక్క పాయింట్ అయితే, సినిమాని  ముంచేసిన పాయింట్ మాత్రం నాలుగు ఉన్నాయి. ఒక్కోదాని గురించి క్లియర్ గా చెబుతా.. హెల్ప్ అయిన పాయింట్ విషయానికి వస్తే.. హర్రర్ అనే పాయింట్ ని కొనసాగిస్తూనే చివర్లో రివీల్ చేసిన థ్రిల్లింగ్ పాయింట్ ని 80% ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కావున క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది. ఇక సినిమాకి బిగ్గెస్ట్ నెగటివ్స్ అనే పాయింట్ కి వస్తే.. మొదటగా చెప్పుకోవాల్సింది సినిమా నేరేషన్.. సినిమా స్టార్ అయినప్పటి నుంచీ చివరి దాకా సినిమా చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కడా స్పీడ్ అవ్వదు, స్పీడ్ అవకపోతే పోయింది కానీ స్లోగా సాగుతున్నది కొన్ని చోట్ల ఇంకా స్లో అయిపోతుంది. దాంతో చూసే ఆడియన్స్ బాగా బోరింగ్ గా ఫీలవుతారు. ఇక రెండవది కోన వెంకట్ - శ్రీనివాస్ వెలిగొండ అందించిన కథనం. కథనంలో ఉన్న సస్పెన్స్ ని క్లైమాక్స్ లో రివీల్ చేయాలనుకోవడం, చేసిన విధానం బాగుంది కానీ క్లైమాక్స్ లో తప్ప మిగతా ఎక్కడా సస్పెన్స్ అనేదే లేకుండా రాసుకున్న కథనం సినిమాకి పెద్ద సమస్యగా మారింది. స్టొరీ లైన్ బాగున్నా దానిని పూర్తి కథగా రాసుకోవడంలో చాలా మిస్టేక్స్ చేసేసాడు. పాత్రల కోసం అనుకున్న స్వభావాన్ని కూడా సరిగా చూపలేదు. అలాగే సినిమాకి మెయిన్ కీ పాయింట్ అయిన డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ గురించి అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. ఇక డైరెక్టర్ గా కూడా ఏ పాయింట్ ని క్లారిటీగా డీల్ చేయలేదు రాజ కిరణ్. అలాగే ఈ సినిమాని కేవలం 2 గంటల్లో ఫినిష్ చెయ్యాలి కానీ కమర్షియల్ అనే మోజులో పరమ రొటీన్ కామెడీని బలవంతంగా ఇరికించి చిరాకు పెట్టడమే కాకుండా, మధ్య మధ్యల్లో పాటల్ని పెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. చాలా చోట్ల ప్రేమ కథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది లాంటి సినిమాలలోని సీన్స్ నే మళ్ళీ రిపీట్ గా చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఓవరాల్ గా డైరెక్టర్ రాజ కిరణ్ సినిమాకి మైనస్ అయ్యాడు. 

ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ రవికుమార్ వర్క్ బాగుంది. విజువల్స్ పరంగా మాత్రం సినిమా మూడ్ కి సెట్ అయ్యేలా, చాలా కలర్ఫుల్ గా సినిమాని చూపించాడు. ఇక కమ్రాన్ అందించిన పాటలు బాలేకపోగా తను అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమాకి అస్సలు హెల్ప్ అవ్వలేదు. అలాగే ఉపేంద్ర ఎడిటింగ్ అనేది కూడా చాలా దారుణంగా ఉంది. సినిమా అంతలా సాగుతున్నా ఆయనకీ ఎక్కడా కట్ చేయాలి అనిపించకపోవడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. రాజా డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి. సిజి వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా క్రేజీ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.


త్రిపుర అనే సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ రజ్ కిరణ్ ఈ సినిమా కోసం పెద్దగా కష్టపడింది ఏమీ లేదు. ఎందుకు అంటే.. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి, కార్తికేయ, రాజుగారి గది లాంటివె కాకుండా ఓవర్ హర్ డెడ్ బాడీ, వైట్ డ్రీమ్స్, వెన్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ లాంటి సినిమాలన్నిటినీ మిక్సీలో వేసి తీస్తే ఈ త్రిపుర సినిమాకి కథ నుంచి సీన్స్ వరకూ అన్నీ దొరికేస్తాయి. కావున అతను ఎక్కడా కష్టపడలేదు. కష్టపడి ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. కథ, కథనం, నెరేషన్, డైరెక్షన్, ఎడిటింగ్ ఇలా అన్నిటినీ మిస్ చేస్తుకుంటూ రావడం వలన సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పించడంలో కూడా ఫెయిల్ అయ్యింది. త్రిపుర సినిమాకి వెళ్లి నిరుత్సాహపడడం కన్నా మేము రిఫర్ చేసిన సినిమాలనే మరొకసారి చూస్తే సరి.. దానివల్ల మీ మనీ సేవ్ అవుతుంది,అలాగే హిట్ సినిమాలు కాబట్టి సినిమాని కూడా ఎంజాయ్ చేయగలరు.

Colours Swathi,Naveen Chandra,Raj Kiran,Chinababu & M Rajasekhar,Kamranత్రిపుర - బాక్స్ ఆఫీసు వద్ద తిరగబడిన 'త్రిపుర'

మరింత సమాచారం తెలుసుకోండి: