డబుల్ రోల్లో నాగార్జున నటనలో చూపిన వైవిధ్యం , నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్యల కెమిస్ట్రీ , కళ్యాణ్ కృష్ణ రచన , టేకింగ్ , అనూప్ రూబెన్స్ మ్యూజిక్ , పిఎస్ వినోద్ , సిద్దార్థ్ ల బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ , పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ని చూపి అక్కడి ఆనందాల్ని మరోసారి పరిచయం చేయడండబుల్ రోల్లో నాగార్జున నటనలో చూపిన వైవిధ్యం , నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్యల కెమిస్ట్రీ , కళ్యాణ్ కృష్ణ రచన , టేకింగ్ , అనూప్ రూబెన్స్ మ్యూజిక్ , పిఎస్ వినోద్ , సిద్దార్థ్ ల బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ , పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ని చూపి అక్కడి ఆనందాల్ని మరోసారి పరిచయం చేయడం కథనంలో కట్టిపడేసే అంశాలు లేకపోవడం , సెకండాఫ్ స్లోగా ఉండడం , మా తాతల కాలం నాటి సింపుల్ స్టొరీ లైన్ , స్లో నేరేషన్ , ఎడిటింగ్ , దైవం , మంత్రానికి మధ్య సీన్స్ బాలేకపోవడం

శివపురం గ్రామంలో బంగార్రాజు(నాగార్జున) ఫ్యామిలీ ఓ ఉన్నతమైన కుటుంబం. తను ఊరికోసం ఎన్నో చేసి ఉంటాడు. బంగార్రాజుకు ఉన్న వీక్ నెస్ తన మాటలతో అమ్మాయిలను తన మాయలో పడేసుకోగలడు. సడన్ ఓ రోజు యాక్సిడెంట్ లో బంగార్రాజు చనిపోతాడు. బంగార్రాజు భార్య సత్యభామ(రమ్యకృష్ణ) తన కొడుకు రామ్ మోహన్(నాగార్జున) అమ్మాయిలకి దూరంగా ఉండాలని ఊరవతల ఉంచి డాక్టర్ ని చేస్తుంది. రామ్ మోహన్ సీత(లావణ్య త్రిపాటి)ని పెళ్లి చేసుకొని అమెరికాలో ఉంటాడు. కానీ ఓ రోజు వీర్ద్దరూ విడిపోవాలనుకొని ఇండియా వస్తారు. వారిద్దరిని కలపడం కోసం సత్యభామ ఏం చేసింది? చనిపోయిన బంగార్రాజు ఆత్మగా మళ్ళీ కిందకి ఎలా వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది? తన కొడుకు - కోడల్ని కలపడం కోసం బంగార్రాజు ఏమన్నా చేసాడా? లేదా అన్నదే అసలు కథ. 

అక్కినేని నాగార్జున వయసు పెరిగే కొద్దీ ఇంకా అందంగా ఎలా అయితే కనిపిస్తున్నాడో, అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ తను సెలక్ట్ చేసుకుంటున్న సినిమాల చాయిస్ తో పాటు తనలోని నటుడికి కూడా పదును పెడుతూ కొత్తరకమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనాలో చేసిన బంగార్రాజు, రామ్మోహన్ అనే రెండు పాత్రల్లో వైవిధ్యం చూపడంలో, నటనపరంగా కెవ్వు కేక అనిపించాడు. బంగార్రాజు పాత్రలో ఫన్ అండ్ చిలిపితనంతో పాటు మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇక రాము పాత్రలో అమాయకత్వం.


ఈ రెండు చాలా బాగా చేసారు. ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు నాగ్. ఇక లావణ్య త్రిపాటి సినిమా అంటా ఇంటి పట్టున ఉండే భార్య పాత్రలో, చీరకట్టుతో ఆకట్టుకుంది. అలాగే ప్రతి సన్నివేశానికి పర్ఫెక్ట్ హావ భావాలని పలికించింది. ఈ సినిమా చూసాక సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఫేస్ లో ఇంకా క్యూట్ నెస్ పోలేదని అనిపిస్తుంది. నాగార్జున(ఇద్దరు) - లావణ్య - రమ్యకృష్ణల మధ్య వచ్చే సీన్స్ మరియు వీరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అనసూయ, హంసా నందిని, దీక్ష పంత్ లాంటి వారు సినిమాకి అదనపు గ్లామర్ అట్రాక్షన్. వారి ద్వారా డైరెక్టర్ అనుకున్న అట్రాక్షన్ అయితే వచ్చింది కానీ వాళ్ళ పాత్రల వల్ల సినిమాని సాగదీయడం తప్ప పెద్ద ఉపయోగం అయితే లేదు. సంపత్ రాజ్ మరోసారి నెగటివ్ షేడ్స్ ని బాగా పలికించాడు. సీనియర్ యాక్టర్స్ అయిన నాజర్, చలపతి రావులు తమ పాత్రల పరిదిమేర నటిస్తే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, సప్తగిరిలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. కృష్ణ కుమారి ఎవరు అంటూ సస్పెన్స్ ని క్రియేట్ చేసిన అతిధి పాత్రలో అనుష్క అలా కనిపించి, అలా తన అందంతో మాయ చేసి మెప్పించి వెళ్ళిపోతుంది.    

సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాకి మెయిన్ స్టొరీ లైన్ అందించించి చిన్న చిత్రాల నిర్మాత పి. రామ్ మోహన్. ఆయన కథ కోసం ఎంచుకున్న లైన్ చాలా పాతకాలం నాటి సింపుల్ లైన్.. అందులో కొత్తదనమూ లేదు, ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యే మాటర్ కూడా అలేదు.  సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ స్క్రీన్ ప్లే గురించి తర్వాత క్లియర్ గా చెప్తా.. రామ్ మోహన్ ఇచ్చిన స్టొరీ లైన్ ని కొత్తవాడైన కళ్యాణ్ కృష్ణ చాలా వారకూ ఫీల్ గుడ్ సన్నివేశాలతో, ఒక అందమైన ఫ్యామిలీ జర్నీలా పూర్తి కథని సిద్దం చేయడమే ఈ సినిమాకి మేజర్ హైలైట్. దైవం - మనిషి - నమ్మకం అనే పాయింట్ ని ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో చెప్పడమే కరెక్ట్ అని కథని అలా రాసుకున్నాడు. అక్కడి వరకూ బాగానే ఉంది.


కానీ ఇలాంటి సింపుల్ స్టొరీ లైన్ కథకి కీలకమైన స్క్రీన్ ప్లే - నేరేషన్ విషయాలే సినిమాని కాస్త దెబ్బ తీసాయి. ముందుగా సత్యానంద్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఉన్న ఒక్క మెయిన్ పాయింట్ ని చివర్లో చూపించాలని సినిమాని సాగదీసారు. ఫస్ట్ హాఫ్ నే కథ అనేదానిలోకే ఎంటర్ కాకుండా సాగదీసారు, కానీ సెకండాఫ్ సగం వరకూ కథలోకి ఎంటర్ అవ్వకుండా సాగదీయడం మాత్రం స్క్రీన్ ప్లే అనేది ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ. అదీకాక మెయిన్ పాయింట్ ని ముందే ట్రైలర్స్ లో చెప్పేసి, ఆ బాలన్స్ ని చూపడం కోసం చివరి దాకా సాగదీసి కిక్ పోగొట్టేసారు. కథ ఏదీ ఫస్ట్ హాఫ్ లో చెప్పకుండా అన్నీ సెకండాఫ్ లోనే చెప్పాలని ఫిక్స్ అయ్యారు. అందులో తప్పు లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే చివర్లో రివీల్ చేసే ట్విస్ట్ చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది.


ఇంతా చేసింది దీని కోసమా అనే ఫీలింగ్ కలగక మానదు. అలాగే ఉన్న బెస్ట్ మొమెంట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్ లోనే ఉండడం వలన సెకండాఫ్ ని సాగదీసేసారు. అలా స్క్రీన్ ప్లేని బోరింగ్ గా మార్చేసారు. ఇక నేరేషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది. పాత్రల పరిచయాలు, ఎస్టాబ్లిష్ మెంట్ కే ఎక్కువ టైం తీసేసుకొని బాగా స్లోగా కథని నేరేట్ చేస్తారు. మంచి ఫీల్ గుడ్ సీన్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు కానీ ఆ సీన్స్ కి ఒక సరైన కథ కనిపించకపోతే మాత్రం ఆ సీన్ అయిపోగానే, ఆ ఫీల్ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, దానివలన కంటిన్యూస్ గా ఒక లైన్ కి సింక్ అవ్వరు.


ఇక్కడా స్లో నేరేషన్ వల్ల అదే జరిగింది. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కొత్త వాడైనాకొన్ని విషయాల్లో బెస్ట్ అనిపించాడు.. ఉదాహరణకి తను రాసుకున్న సీన్స్ లోని క్యూట్ నెస్, రొమాన్స్, ఎమోషన్స్ ని తెరపై చూపించడంతో పాటు నటీనటులను కొత్తగా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. కానీ ఒక డైరెక్టర్ గా థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ లో ఆధ్యంతం ఆసక్తితో కూర్చునేలా చేయలేకపోయాడు. కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు పాత్రకి రాసిన కోనసీమ డైలాగ్స్ తో పాటు సినిమాలోని అన్ని సంభాషణలు బాగున్నాయి. పల్లెటూరి ఎఫెక్ట్ వల్ల ఫ్రెష్ గా కూడా అనిపిస్తాయి. కథ కథనాలు వీక్ కానీ కళ్యాణ్ కృష్ణ రచన టేకింగ్ ఈ సినిమాని నిలబెట్టాయి. 


మిగిలిన సాంకేతిక నిపుణులు కూడా సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యారు. అనూప్ రూబెన్స్ సినిమాకి సూపర్బ్ అనిపించే మెలోడీ సాంగ్స్ ఇస్తే వాటిని జబర్దస్త్ అనేలా తెరపై షూట్ చేసారు. ఇక నేపధ్య సంగీతం అయితే సినిమాని చాలా వరకూ నిలబెట్టింది. పిఎస్ వినోద్ - సిద్దార్థ్ ల సినిమాటోగ్రఫీ కూడా అదిరింది. పల్లెటూరి ఫెలింగ్ వచ్చేలా ప్రతి సీన్ కి దానికి తగ్గా మూడ్ ని కాప్చ్యూర్ చేయడంలో వినోద్ తన పనితనాన్ని చూపాడు.


సినిమా బడ్జెట్ స్థాయి ప్రకారం ఇందులో చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కుడా బాగున్నాయి. ఎస్. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. మెయిన్ గా రెండు మూడు సీన్ కోసం వేసిన యమలోకం సెట్ బాగుంది. అలాగే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ హౌస్, సెటప్ అంతా నాచురల్ గా అనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ జస్ట్ యావరేజ్ గా ఉంది. సినిమాని బాగా సాగదీశారు. ఆ విషయంలో షార్ప్ ఎడిట్ ఉండాల్సింది. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉంటుంది.


నాగార్జున అనగానే మన్మధుడు, అమ్మాయిలకు గ్రీకువీరుడు అనే ముద్ర ఉంది.. అదే ఇమేజ్ ని బేస్ చేసుకొని కథని మొత్తం రాసుకోవడమే ఈ సినిమాని ప్రేక్షకులకు కనెక్ట్ చేయగలిగింది. ఆ ఫ్లేవర్లో గనుక సినిమా లేకపోయి ఉంటే తేడా కొట్టేసేది. నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు సినిమాల తర్వాత నాగార్జునని ఆ స్టైల్లో ప్రెజంట్ చేస్తూ, పర్ఫెక్ట్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రొమాన్స్ ని మిక్స్ చేసిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. నాగార్జున మరియు కుటుంబ కథా చిత్రాలు నచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా సూపర్ అనిపిస్తుంది. అది తప్పిస్తే రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా బాగుందనిపిస్తుంది కానీ సూపర్ అయ్యే ఫీలింగ్ ని అయితే కలిగించదు. ఫైనల్ స్టేట్మెంట్ ఒక్కటే ఈ సంక్రాంతికి వచ్చిన నలుగు సినిమాల్లో ది బెస్ట్ విన్నర్ ఇదే..

Nagarjuna,Ramya Krishnan,Lavanya Tripathi,Kalyan Krishna,Ram Mohan P,Anup Rubensసోగ్గాడే చిన్ని నాయనా - సంక్రాంతి విన్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: