రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ , పాటల్లో అదిరిపోయే విజువల్స్ , అక్కడక్కడా పేలిన కామెడీరసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ , పాటల్లో అదిరిపోయే విజువల్స్ , అక్కడక్కడా పేలిన కామెడీపరమ రొటీన్ అండ్ బోరింగ్ కథ , కథ కంటే రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , నీరసం తెప్పించే స్లో నేరేషన్ , సాగ దీసిన రన్ టైం , సందర్భం లేకుండా వచ్చే పాటలు , వరస్ట్ అండ్ సిల్లీ క్లైమాక్స్ , వీక్ డైరెక్షన్ , నో లాజిక్స్ అండ్ నో మేజిక్స్ , పాత్రలకి జస్టిఫికేషన్ లేదు , వీక్ అండ్ సిల్లీ విలనిజం

ఓపెన్ చేస్తే మన హీరో పేరు శివ(రామ్).. మనవాడికి నచ్చినట్లు ఉంటూ, నచ్చింది చేస్తూ, ఫ్రెండ్స్ కి చుక్కలు చూపిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేసే మెంటాలింటీ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడు. కానీ వీడికి ఉన్న మెయిన్ క్వాలిటీ ప్రేమికుల కోసం ఎంత రిస్క్ అన్నా చేసి వారి పెళ్లి చేస్తాడు. అలాగే ప్రేమ విషయంలో మనోడికి ఉన్న ఒకే ఒక్క క్లారిటీ.. 'మనకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకూ వెయిట్ చెయ్యాలి. దొరికాక ఆ అమ్మాయి కోసం ఫైట్ చెయ్యాలి'. అలా అనుకునే మనోడికి నచ్చిన అమ్మాయి దొరుకుతుంది. తన పేరే తను(రాశీ ఖన్నా). ఇక తన వెంట పడుతూ ఉన్న టైంలో జడ్చర్ల ఏరియాలో బాగా బలం ఉండి రౌడీయిజం చేసే బోజి రెడ్డి(వినీత్ కుమార్) మనుషులు శివాని చంపాలని వెతుకుతూ ఉంటారు. అదే టైంలో హైదరాబాద్ లో దందాలు చేసే అభి(అభిమన్యు సింగ్) కూడా శివ కోసం వెతుకుతూ ఉంటాడు. శివ ప్రేమని తను ఓకే చేసే టైంకి శివాని బోజి రెడ్డి మనుషులు, తనుని అభి మనుషులు తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే శివ కోసం వచ్చిన అభి మనుషులు తనుని ఎందుకు తీసుకెళ్ళారు.? బోజి రెడ్డి మనుషుల నుంచి శివ ఎలా తప్పించుకుకొని తన ప్రేమను, తనుని కాపాడుకున్నాడు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన పరం రొటీన్ కథ..   

మన హీరో రామ్ కి ఉన్న పేరు ఎనర్జిటిక్ స్టార్. అక్కడక్కడా పలువురు స్టార్స్ ని ఇమిటేట్ చేసినట్టు కనిపించినా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పటి వరకూ తన సినిమాల్లో చేసిన తరహాలో ఉండే పాత్రనే మరోసారి ఇందులో చేసాడు. ఈ పాత్రలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. సో ఎలాగూ ఇన్ని రోజులు ఇదే తరహా పాత్రలు చేసిన రామ్ కి ఈ పాత్ర చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అదే ఎక్స్ ప్రెషన్స్, అదే ఫైట్స్, అదే డాన్సులు.. సో అన్నీ యాజిటీజ్ గా చేసేసాడు. కానీ చాలా చోట్ల అవసరం లేకపోయినా ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేసాడు, వాటిని డైరెక్టర్ కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. శివ పాత్రలో రామ్ ఓ చేసేసింది అనడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్ రాశి ఖన్నా మాత్రం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి రెండు సినిమాల కంటే మించి ఈ సినిమాలో స్కిన్ షో చేసింది. కానీ పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం రెండు సినిమాల కంటే బాగా తక్కువ. ఇక్కడ సమస్య కూడా దర్శకుడే, తనకు కావాల్సింది నటీనటుల నుంచి సరిగా రాబట్టుకోలేదు. విలన్ గా చేసిన అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ లను సినిమాకి విలన్స్ అనడం కంటే జోకర్స్ అనడం బెటర్. వారికి ఒక పాత్ర లేదు, పాడు లేదు. దాంతో సినిమాలో విలనిజం జీరో, వాళ్ళని జోకర్ గా చేసి చూపడం వలన మనకు ఇర్రిటేషణ్ ఒకేసారి వస్తాయి. ఇక ఎప్పటిలానే మన తెలుగు హిట్ ఫార్ములా అయిన కామెడీ గ్యాంగ్ ని పెట్టి నవ్వించడం లో కూసింత ట్రై చేసిన డైరెక్టర్ బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణభగవాన్, చంటి, శకలక శంకర్, తాగోబోతు రమేష్ ఇలా ఎవ్వరూ ఆడియన్స్ ని పెద్దగా నవ్వించలేకపోయారు. వీరికంటే కాస్త బెటర్ గా ఫిష్ వెంకట్ నవ్వించాడు. ఇక సినిమాలో చెప్పుకోదగిన పాత్రలు చేసిన వారు లేరు, వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. 

సాంకేతిక నిపుణుల్లో ఎన్నో కలలతో డైరెక్టర్ గా మారి ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచిన శ్రీనివాస్ రెడ్డి నుంచి మొదలు పెడదాం.. శివమ్ విషయంలో శ్రీనివాస్ రెడ్డిని ముంచేసిన బిగ్గెస్ట్ నెగటివ్ పాయింట్.. పాత రొటీన్ మరియు పరమ సొల్లుగా అనిపించే కథని తన తొలి సినిమాకి ఎంచుకోవడం. ఈ కథ ఢీ, రెడీ, హ్యాపీ, కందిరీగ, కృష్ణ, దేనికైనా రెడీ, కిక్, దమ్ము లాంటి ఎన్నో సినిమాల కథలకి దాదాపు ఈక్వల్ అనిపించుకునే కథే. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలలో బాగున్నాయి అనిపించిన అన్ని సీన్స్ ని అక్కడక్కడా వేసుకుంటూ సినిమా కథని అల్లుకున్నాడు. కావున చూసే ఆడియన్స్ కి కథ విషయంలో బాగా చిరాకు కలుగుతుంది. కొంతమంది అయితే ఏమయ్యా కొత్త దర్శకులకి కూడా ఇంతకు మించిన కథ, అదే పాత సొల్లు కథలు తప్ప మరొకటి దొరకదా స్వామీ అని పెదవి విరుస్తారు. ఇది ఫస్ట్ మేజర్ నెగటివ్ అయితే, సినిమాకి హెల్ప్ అయిన పాయింట్ ఎక్కడో ఓ చోట కామెడీ ప్రేక్షకులను కాస్త ఊపిరి పీల్చుకునే విషయం అయితే, జడ్చర్ల రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకోవడం కొంతలో కొంత శ్రీనివాస్ రెడ్డి నుంచి వచ్చిన బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కథ విషయంలో ఇంత ఓల్డ్ సక్సెస్ఫుల్ ఫార్మాట్ ని తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి కథనం విషయంలో కూడా పెద్ద తప్పు చేసాడు. కథే మాకు తెలిసింది, మేము చూసిందే అని ఫీలవుతున్న ఆడియన్స్ కి హీరో ఇంట్రడక్షన్ తర్వాత నుంచే సినిమాలో నెక్స్ట్ అమ్మాయి ఉంది హీరో లవ్ లో పడతాడు, పాప నో అంటుంది, వెంటపడి వేదిస్తాడు, పడుద్ది, కట్ చేస్తే పాప అండ్ హీరో లైఫ్ లో విలన్ ఎంట్రీ.. అక్కడితో ఓ సమస్య(అదికూడా మాకు తెలిసిందే).. దాని కోసం ఓ కామెడీ గ్యాంగ్ ని వాడుకుంటూ కాస్త గజిబిజి క్రియేట్ చేసి క్లైమాక్స్ ని అందరూ ఊహించిన తెలుగు సినిమా ఆల్ టైం ఫార్ములాతో కథని సుఖాంతం చేయడం.. ఈ మాత్రం స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ ఎప్పుడో అలవాటు పడిపోయారు. కావున నెక్స్ట్ సీన్ రాకముందే ఆడియన్స్ నెక్స్ట్ ఏం చూపిస్తాడో చెప్పేస్తుంటారు. ఇక కిక్ ఏముంది చూసే ఆడియన్స్ కి చెప్పండి. సో కథ - కథనాలు పూర్తిగా నెగటివ్ అయ్యాయి. ఇక నేరేషన్ విషయానికి వస్తే మొదలయిన కాసేపటి తర్వాత డెడ్ స్లో గా నేరేషన్ సాగుతుంది, అలాగే రన్ టైం చూసే కొద్దీ ఇంకా ఉంది ఇంకా ఉంది అని సాగుతూనే ఉంటుంది తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. దాంతో ఆడియన్స్ కి చాలా టార్చర్ కూడాను. ఎంతలా అంటే సినిమా ఇంకా 20 నిముషాలు ఉండగానే సగం మంది థియేటర్ నుంచి లేచి వెళ్లిపోయేంత లెంగ్త్ ఉంది. ఇక డైరెక్టర్ కామెడీతో మేనేజ్ చేద్దాం అనుకున్న కామెడీ కూడా పూర్తిగా పేలలేదు. అక్కడక్కడ మాత్రమే పేలింది. ఇక డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డికి చెప్పుకోదగిన డెబ్యూ మూవీ అయితే కాదు. కమర్షియల్ సక్సెస్ అనే దాని కోసం పరం రొటీన్ కథని తీసుకొని సేఫ్ జోన్ లో ఉండేలా సినిమా చేసేసాడు. కానీ ఇప్పుడది పూర్తి రివర్స్ అయిపోయి సినిమాని డిజాస్టర్ చేసింది. వీటితో పటు డైరెక్టర్ కి తను అనుకున్న రాసుకున్న సీన్స్ నే ప్రాపర్ గా తెరపైకి తీసుకురావడం వీలు కాలేదు. తనకి ఇంకా అనుభవం కావాలి. సినిమా ఏయే సినిమాలతో మొదలై ఎలా ఎంద అవుతుంది అంటే.. కిక్ ఇంట్రడక్షన్ ఫార్మాట్ లో మొదలయ్యి అటు నుంచి రెడీ, వెంకీ ఫార్మాట్ లవ్ ట్రాక్ ని మొదలెట్టి, ఇడియట్ తరహాలో టీజింగ్ చేసి, మళ్ళీ కిక్ ఫాదర్ టైపుతో హీరోకి హైప్ ఇచ్చి అటునుంచి కిక్ -> గులాబీ -> జల్సా-> రెడీ -> కందిరీగ -> అతనొక్కడే -> దమ్ము టైపు క్లైమాక్స్ తో సినిమా ముగుతుంది.  

ఇక లాజిక్స్ విషయానికి వస్తే..
1.హీరోయిన్ లవ్ లో పాడడం అనేదానికి అస్సలు రీజన్ ఉండదు.
2. పోసాని కృష్ణమురళి హీరోని ఎందుకు చంపాలనుకుంటాడో నో క్లారిటీ,
3. చివరిగా ఫ్లాష్ బ్యాక్ లో రామ్ ఫ్రెండ్ చనిపోవడానికి రోడ్ మీద నిలబడుకుంటే అక్కడెక్కడో వచ్చే వెహికల్ బ్రేక్ కూడా వెయ్యకుండా గుద్దేసి వెళ్ళిపోతుంది, ఏదో వాణ్ణి చంపడానికే వచ్చినట్టు...  ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే ఇలాంటి సినిమాలు తీయడానికి, ఇలాంటి సినిమాలే తీస్తున్న డైరెక్టర్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. మళ్ళీ అలాంటి దర్శకుడే టాలీవుడ్ కి ఎందుకూ అంటా..   


ఇక మిగిలిన డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. సినిమాకి విజువల్స్ చాలా రిచ్ లుక్ ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా సాంగ్స్ లో యూరప్ అందాలను చాలా బాగా బందించి చూపించారు. సాంగ్స్ లో విజువల్స్ మాత్రం సూపర్బ్. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఓకే, కానీ కొత్తగా లేదా చార్ట్ బస్టర్ గా నిలిచే సాంగ్స్ అయితే ఒక్కటి కూడా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా గంతకు తగ్గా బొంత (పాటలకి తగ్గట్టే నేపధ్య సంగీతం కూడాను) అన్న సామెతని గుర్తు చేసేలా ఉంది. కిషోర్ తిరుమల - శ్రీనివాస్ రెడ్డి కలిసి అందించిన పంచ్ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగ్గానే పేలాయి. కొన్ని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మధు ఎడిటింగ్ అస్సలు బాలేదు. చాలా చోట్ల సినిమాని డ్రాగ్ డ్రాగ్ చేసి వదిలి పెట్టాడు. అసలే పాత కథ, తెలిసిన కథనం కాస్త ఎడిటింగ్ అన్నా షార్ప్ గా ఉండాల్సింది. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జస్ట్ ఓకే. ఫైనల్ గా స్రవంతి మూవీస్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి మాంచి గ్రాండియర్ ని తెచ్చిపెట్టాయి.  


దాదాపు 9 ఏళ్ళుగా టాలీవుడ్ లో బాగా హిట్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే 'శివమ్'. మొదటి నుంచి చివరి దాకా అదే పాత కొట్టుడు ఎలా అంటే - హీరో పెద్ద తోపుగాడు, హీరోయిన్ తో లవ్వయ్యిద్ది, కట్ చేస్తే విలన్ ఎంట్రీ, వాడి దగ్గరికే వెళ్లి వాన్నే బకారానికి చేసి హీరోయిన్ ని తెచ్చుకోవడం. ఇంతోటికి కథకేనా అంత బిల్డప్ అనుకోకండి.. ఎందుకంటే దీనికన్నా మించి తీయాలని మనోళ్ళు అస్సల ట్రై చేయడం లేదు. శివమ్ సినిమా ద్వారా పరమ రొటీన్ ఆడియన్స్ కోరుకునే 4 యాక్షన్ ఎపిసోడ్స్, 5 పాటలు, 6 కామెడీ బిట్స్ ని కూడా అందించలేకపోయారు. ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ దర్శకులు కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి కథలని పట్టుకోవడం, వాటితోనే సినిమాలు చేయడం టాలీవుడ్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉంది. ఓవరాల్ గా శివమ్ లో మీకు కిక్ ఇచ్చే పాయింట్ లేదా సీన్స్ ఏమీ ఉండవు. సింపుల్ గా శివమ్ అనే సినిమాని మీరు స్కిప్ చేస్తేనే మీకు మీ ఆరోగ్యానికి, మీ టైంకి చాలా చాలా మంచిది. టాలీవుడ్ లో వచ్చిన మరో ది వరస్ట్ డిజాస్టర్ మూవీ 'శివమ్'.   

Ram Pothineni,Rashi Khanna,Srinivas Reddy,Sravanti Ravikishore,Devi Sri Prasadశివమ్ - దూలతీర్చెస్తాడు.!

మరింత సమాచారం తెలుసుకోండి: