అనుష్క లుక్ అండ్ పెర్ఫార్మన్స్ , ఎంఎం కీరవాణి అందించిన సూపర్బ్ మ్యూజిక్ , నిరవ్ షాహ్ అందించిన కలర్ఫుల్ విజువల్స్ , స్టార్ హీరో, హీరోయిన్ల స్పెషల్ అప్పియరెన్స్ అనుష్క లుక్ అండ్ పెర్ఫార్మన్స్ , ఎంఎం కీరవాణి అందించిన సూపర్బ్ మ్యూజిక్ , నిరవ్ షాహ్ అందించిన కలర్ఫుల్ విజువల్స్ , స్టార్ హీరో, హీరోయిన్ల స్పెషల్ అప్పియరెన్స్ లాజిక్ లెస్ సెకండాఫ్ , అసలు కథనం అనేది ఉందా?? , ఇంతకన్నా రొటీన్ పాయింట్ ఉండదేమో?? , డెడ్ స్లో నేరేషన్ - పూర్ ఎడిటింగ్ , నో ఎమోషన్స్ , నో ఎంటర్టైన్మెంట్ , వీక్ వీకెస్ట్ డైరెక్షన్

స్వీటీ అలియాస్ సౌందర్య(అనుష్క) బాగా బొద్దుగా, లావుగా ఉంటుంది. దాంతో స్వీటీ మదర్ రాజేశ్వరి (ఊర్వశి) ఎన్ని పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకురారు. ఫైనల్ గా మన హీరో అభి(ఆర్య) వస్తాడు, కానీ ఓ రీజన్ వల్ల స్వీటీ అభిని రెజెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కలుసుకున్న అభి - స్వీటీలు ఫ్రెండ్స్ అవుతారు. స్వీటీ ఫ్రెండ్షిప్ కాస్తా ప్రేమగా మారుతుంది. అది చెప్పే టైంలో వీరి మధ్యలోకి సిమ్రాన్(సోనాల్ చౌహాన్) ఎంటర్ అవుతుంది. దాంతో అభి సిమ్రాన్ ప్రేమలో పడతాడు. అది చూసిన స్వీటీ బాగా బాధపడి, అర్జంట్ గా సన్నబడి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. అందులో భాగంగా సత్యానంద్(ప్రకాష్ రాజ్) స్థాపించిన సైజ్ జీరో అకాడమీలో చేరుతుంది బరువు తగ్గడానికి. కట్ చేస్తే అక్కడ ఓ సమస్య, ఆ సమస్యని పరిష్కరించడం కోసం మళ్ళీ అభి, సిమ్రాన్ ల హెల్ప్ తీసుకుంటుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? ఎలా ఆ సమస్యను పరిష్కరించారు? ఈ సమస్యని పరిష్కరించే టైంలో వచ్చిన మార్పులేమిటి? చివరికి ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు అన్నదే అసలైన కథ..     

అనుష్కకి ప్రస్తుతం భీభత్సమైన స్టార్డం ఉంది, ఉన్నపాటుగా తను 20 కేజీలు బరువు పెరిగి తన రూట్ నుంచి పక్కకెళ్ళి, గ్లామర్ రోల్స్ ని పక్కనబెట్టి ఇలాంటి ఓ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ నటిగా సినిమా కథకి ప్రాముఖ్యత ఇచ్చి ఈ సైజ్ జీరో సినిమాని అటెంప్ట్ చేసినందుకు నటిగా తనకు సెల్యూట్ చెయ్యాలి.. ఇక సినిమాలో తన నటన విషయానికి వస్తే.. తన సైజ్ తో పడే ఇబ్బందులతో ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. సినిమాలో అనుష్కనే కాస్త నవ్విస్తుంది. అనుష్క ఇలాంటి పాత్ర ఇంతముందు చేయలేదు. అందుకే చాలా బాగా చేసింది. ఇకపోతే బాగా బొద్దుగా కనిపించినా అనుష్క లుక్ మాత్రం ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఆర్య సినిమాలో హాన్డ్సంగా కనిపిస్తాడు. అంతకన్నా అతను చేసింది ఏమీలేదు. ఇక సోనాల్ చౌహాన్ సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ తప్ప సినిమాలో చేసింది ఏమీ లేదు. ఇక ప్రకాష్ రాజ్, ఊర్వశి, గొల్లపూడి మారుతి రావు, హేమలు ఎవరికీ వారు తమ తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. బ్రహ్మనందం, భరత్ లు కామెడీతో నవ్వించడానికి తెగ కష్టపడ్డారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నాగార్జున, రానా దగ్గుబాటి, జీవ, అడవి శేష్, బాబీ సింహా, తమన్నా, హన్సిక, శ్రీ దివ్య, లక్ష్మీ మంచులు అతిధి పాత్రలు ఒక రెండు నిమిషాల పాటు సినిమాలోని పరమ బోర్ ని పోగొట్టడంలో ఉపయోగపడ్డాయి.   



కనిక కోవెలమూడి 'సైజ్ జీరో'కి కథ-కథనం అందించింది. కనిక తన కజిన్ ఇలానే బాగా లావుగా ఉండి పెళ్లి కాకుండా పడుతున్న ఇబ్బందులను ఫేస్ చేస్తోంది. దీనిని కథ చెప్పాలనుకున్న కనిక మన ఓల్డ్ ఫార్మాట్ నే ఫాలో అయ్యింది. ఎలా అంటే.. సినిమాలోని పాయింట్ లావుగా ఉన్న అమ్మాయికి పెళ్ళిళ్ళు అవ్వవా? అవ్వాలి ఎందుకంటే వారికి మంచి మనసు ఉంటుందని చెప్పాలనుకుంది.  సో ఈ పాయింట్ ని ముందే రివీల్ చేసెయ్యడం వలన సినిమా మొత్తం అనుష్క కి పెళ్లి చేయడమే కాన్సెప్ట్ మీదకి వెళ్తుంది. బేసిక్ గా ఈ కాన్సెప్ట్ ని గంట సేపు చిఎన్మా తీయడమే ఎక్కువ కానీ ఇక్కడ 131 నిమిషాల సినిమా కావడం వలన మరో గంట సినిమాని జత చేయాల్సి వచ్చింది. అందుకే ఫస్ట్ హాఫ్ అంటా ఒకలా ఉంటె సెకండాఫ్ అంటా ఒకలా ఉంటుంది. చూసే ప్రతి ఆడియన్ ఏంది బాబు మాకిది ఫస్ట్ హాఫ్ లో ఏం చెప్పావ్, సెకండాఫ్ లో ఏం చెప్తున్నావ్., ఒక అమ్మాయి సమస్యని కాస్తా సోషల్ ఇంష్యూ చేసేసావ్ అనే ఫీలింగ్ కలుగుద్ది. సరే ఇంత దారుణమైన కథకి కథనంలో అన్నా మేజిక్ చేయాలి, లేదా సినిమాలో అన్నా ఎంటర్టైన్మెంట్ తో మేజిక్ చేయాలి. కానీ ఆ రెండూ జరగలేదు. కథనంలో సస్పెన్స్ అనేది వీక్లీ బుక్స్ లో వచ్చే షార్ట్ స్టోరీస్ లో ఉన్నంత కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఇక పోతే డైరెక్టర్ చేసిన నేరేషన్ లో వేగం నత్తకన్నా స్లోగా ఉంటుంది. సెకండాఫ్ లో అయితే దేనికి దేనికి సంబంధం ఉండదు. సీన్స్ ఎలా పడితే అలా వస్తుంటాయి. మనమే ఏరుకొని ఆర్డర్ లో సెట్ చేసుకున్నా కథ అర్థమా కాదు.. ఎందుకంటే వీరి దగ్గర సరైన కథలేక ఇలా తీసేశారు. డైరెక్టర్ ప్రకాష్ కోవెల మూడి మరోసారి ఫెయిల్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులను మరింత ఎక్కువగా నిరాశపరిచాడు. అనుష్క అనుష్క అంటూ థియేటర్స్ కి వచ్చిన వారిని దారుణంగా బాధపడేలా చేసాడు. ఓవరాల్ గా సైజ్ జీరో అనే సినిమాని క గంట చ్నేమాగా తీసి ఉంటే ఎలాంటి గోల లేకుండా నీట్ గా ఉండేది. ప్రకాష్ కోవెలమూడి అనుష్క ఇమేజ్ ని డామేజ్ చేయడానికే ఈ సినిమా తీసినట్లుగా ఉంది.    


నిరవ్ షాహ్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. సినిమాలోని కంటెంట్ లోని ఫీల్ విజువల్స్ లో ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకుంటూ వచ్చాడు. విజువల్స్, కలరింగ్ చాలా బాగుంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రెండూ చాలా బాగుండడమే కాకుండా సినిమాకి బలాన్ని చేకూర్చాయి. చాలా చోట్ల కీరవాణి మ్యూజిక్ సినిమాని నిలబెడుతుంది. ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ చాలా చాలా బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అస్సలు బాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ అయితే ది వొర్స్త్ అని చెప్పాలి. కిరణ్ డైలాగ్స్ సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అక్కడక్కడా హై క్లాస్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా రాసాడు. ప్రశాంతి కాస్ట్యూమ్స్ సెలక్షన్ బాగుంది. ఫైనల్ గా పరమ్ వి పొట్లూరి ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉన్నాయి.  


బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమా తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా అనగానే, అది ఏ జానర్ సినిమా అయినప్పటికీ అంచనాలు మాత్రం బాగానే ఉంటాయి. కానీ ఆ అంచనాలను 5% కూడా అందుకోలేకపోయిన సినిమా 'సైజ్ జీరో'. ఈ వారం రిలీజ్ అయిన 'తను నేను' లానే ఈ సినిమాని కూడా ఒక గంట డాక్యుమెంటరీ సినిమాలా చేసి యు ట్యూబ్ లో రిలీజ్ చేసి ఉంటే మంచి పేరు వచ్చేది,అలాగే అనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పాం అన్న ఫీలింగ్ కూడా దక్కేది. కానీ దానిని సాగదీసి 131 నిమిషాలు చేసి డబ్బులు పెట్టి వచ్చే ప్రేక్షకులను భాగా ఇబ్బంది పెట్టేసారు. సైజ్ జీరో సినిమాలో థియేటర్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. మీరు అనుష్కకి డై హార్డ్ ఫ్యాన్ అయితే వెళ్ళండి, వెళ్లి అనుష్కని మాత్రమే చూస్తూ ఉండండి, అలా కాదని ఈ కథేంది, ఎలా వెళ్తోంది అని ఆలోచించారో మీకు తలనొప్పి వస్తుంది. సైజ్ జీరో కోసం అనుష్క వెయిట్ పెరిగింది కానీ కథలో మాత్రం అస్సలు వెయిట్ లేదు.

Arya,Anushka Shetty,Sonal Chauhan,Prakash Kovelamudi,PVP Cinema,M.M. Keeravaaniసైజ్ జీరో - జీరో ఎంటర్టైన్మెంట్

మరింత సమాచారం తెలుసుకోండి: