మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయిన సందర్భంలో  ఈవిషయం పై మెగా అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈవిషయమై మెగా హీరోలు ఎవరు ఇంతకు వచ్చి స్పందించక పోవడంతో రకరకాల ఊహాగానాలు హడావిడి చేసాయి. 

అయితే ఈమధ్య ప్రసారం అయిన ఒక  టివి ఇంటర్యూలో  నిహారిక మాట్లాడుతూ తన పెదనాన్న చిరంజీవికి తన కోరికను చెప్పగానే వెంటనే ఎస్ అన్నారని అదేవిధంగా తన అన్నయ్య చరణ్, వరుణ్ లు కూడ ఓకె అన్నారని చెప్పింది. అయితే ఈ విషయానికి రామ్ చరణ్ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. 

నిహారిక సినిమాలలోకి వస్తున్నట్లు తనకు తెలియదని తాను కూడ మీడియాలో వచ్చిన వార్తలు బట్టే తెలుసుకున్నాను అని కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇదే సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి నిహారిక హీరోయిన్ గా మారడం మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ఈ ట్విస్ట్ ఇచ్చాడు అని సమాచారం. నిహారిక హీరోయిన్ అయితే ఏమైనా ఇబ్బంది ఉంటే తన బాబాయ్ నాగబాబుకు ఉండాలి కాని తమ కుటుంబానికి ఎటువంటి సమస్యా లేదు అని కామెంట్ చేసినట్లు టాక్. తండ్రిగా తన బాబాయ్ కు ఒకే అయినప్పుడు తనకు కూడ ఒకే అంటూ నవ్వుతూ ఆ టాపిక్ ని అక్కడితో తప్పించి వేసాడు రామ్ చరణ్. 

ఈ కామెంట్స్ చరణ్ నోటి వెంట విన్న వారు మాత్రం షాక్ అయినట్లు టాక్. ఒక వైపు నిహారిక టాలీవుడ్ లాంచింగ్ అక్టోబర్ 30న ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చరణ్ ఈవిధంగా తెలివిగా కామెంట్ చేసాడు ఏమిటి అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: