సంచలన దర్శకుడు వర్మ ఏదన్న విషయం మీద కామెంట్ చేయడం మొదలెట్టాడంటే దాన్ని చీల్చి చెండాడుతాడు.. అయితే వర్మ చెప్పిన దానిలో నిజం ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. వర్మ ఏం చేసిన ఎవరిని టార్గెట్ చేసినా.. కాంగా ఉంటారు. అయితే పరిస్థితులు ఎప్పటిలా లేవు అందుకే వర్మ కామెంట్స్ కి ఈమధ్య అదిరిపోయే రెస్పాన్సులు ఇస్తున్నారు. రీసెంట్ గా హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం గురించి వర్మ విరిచుకు పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరక్షరాస్యులని.. వాళ్లని ఎడ్యుకేట్ చేయాల్సిన భాధ్యత పవన్ కళ్యాణ్ కే ఉందని గట్టిగానే చెప్పాడు.


ఫ్యాన్స్ కి కోపం వచ్చి వర్మ చనిపోయినట్టుగా ఫోటోషాప్ ఇమేజ్ కూడా డిజైన్ చేయించారు. దాన్ని కూడా వర్మ చూపిస్తూ నానా వీరంగం చేశాడు. అయితే సడెన్ గా సీన్లోకి పవర్ స్టార్ ని దేవుడిగా అభిమానించే బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్ పవజినం డే నాడు ఫ్యాన్స్ హడావిడి చేస్తుంటే వర్మ తన మార్క్ సెటైరికల్ కామెంట్ ఒకటి పేల్చాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా బాహుబలి కన్నా బాగా ఆడాలని.. ఆ సినిమా ఇక్కడే కాదు ఫారిన్ కంట్రీస్ లో కూడా భారీగా ఆడుతుందని రెచ్చిపోయాడు.


ఇక చిర్రెత్తుకొచ్చిన బండ్ల ఎటాక్ కి దిగాడు.. వర్మ గారు మీరు గొప్ప దర్శకుడు మిమ్మల్ని కామెంట్ చేయడం నిమిషం పని కాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పర్సనల్ గా మీకు మంచి అభిప్రాయం ఉందని నాకు తెలుసు. అనవసరంగా మీ కామెంట్స్ లో నైట్స్ నిద్ర లేకుండా.. పగలు పని చెడకొట్టకుండా చేయకండి అని ఘాటుగా స్పందించాడు. అయితే వర్మ ని పొగుడుతూనే నీ అంతుచూస్తా అని అన్నట్టుగా మాట్లాడాడు గణేష్.


రచ్చ రచ్చ అయిన ఈ ట్విట్టర్ యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇన్నాళ్లకు వర్మకు సరైన మొగుడు దొరికాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో బండ్ల గణేష్ తనకు పవర్ స్టార్ అంటే ఉన్నఅభిమానాన్ని ఈ విధంగా చాటి చెప్పడం ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: