మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ బ్రూస్ లీ, ఈ మూవీ, ఇదే నెల 16న ఘనంగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ని తెలుసుకుంటే, అక్టోబర్ 16న రిలీజ్ కోసం చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్లాన్స్ చేస్తుంది. కనీసం 2500 థియోటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయటం కోసం ప్లాన్ చేసింది.


తెలుగులో ఓ వైపు రుద్రమదేవి సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతున్నప్పటికీ, ఆ థియోటర్స్ ని సైతం బ్రూస్ లీ మూవీ ఆక్యుపై చేసే ప్రయత్నం లోఉంది. దీంతో రుద్రమదేవి మూవీకి కష్టకాలమే అని చెప్పాలి. ఇదిలా ఉంటే, రుద్రమదేవి సక్సెస్ పై దాసరి నారాయణరావు స్పందించిన విషయం తెలిసిందే.


అయితే ఇందులో రుద్రమదేవి గురించి పొగుడుతూనే, మరోవైపు ఈ మూవీకి పోటీగా వస్తున్న బ్రూస్ లీ మూవీపై విమర్శనలనూ చేశాడు. ఈ పోటీ విషయంలోనూ తను సైతం చేయగలిగిందేమి లేదు అని గుణశేఖర్ కి చెప్పుకొచ్చాడంట. “రుద్రమదేవి లాంటి మూవీ, థియోటర్స్ వద్ద కలెక్షన్స్ ని బాగా రాణిస్తున్న ఈ సమయంలో, దీనికి బాక్సాపీస్ వద్ద కొంత సమయం ఇవ్వాలి. కానీ, పోటీగా వస్తున్న యంగ్ హీరోల మూవీలు ఏ మాత్రం అర్ధం లేనివి” అంటూ చెప్పుకొచ్చాడు.


అయితే ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం, “చరణ్ దూకుడు భవిష్యతలో అంత మంచి రిజల్ట్స్ ని ఇవ్వదు. తగ్గితే బాగుండు” అని సన్నిహితులతో చెప్పుకొచ్చాడంట. గతంలోనూ దాసరి, చరణ్ ల మధ్య ఓపెన్ వారే జరిగింది. కానీ, దాసరి ఈసారి చరణ్ కి అంటినట్టుగా చురుకలు అంటించి వదిలేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: