నిన్న దాసరి ‘రుద్రమదేవి’ చూసిన తరువాత  అల్లుఅర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర చాలా అమోఘo అంటూ దాసరి చేసిన పొగడ్తలు ఏమాత్రం  కలిసిరాలేదు. నిన్న బన్నీని అదేవిధంగా అనుష్కను పొగిడిన తరువాత దాసరి ఈవారం విడుదల అవుతున్న ‘బ్రూస్ లీ’ సినిమా విడుదల ఈవారం కాకుండా వచ్చే వారం విడుదల అయితే ‘రుద్రమదేవి’ కి కలిసి వస్తుంది అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే  ఈవ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో దాసరికి రివర్స్ పంచ్ వేసాడు బన్నీ. 

ఈ వారం విడుదల అవుతున్న ‘బ్రూస్ లీ’ వల్ల ‘రుద్రమదేవి’ కి నష్టం జరుగుతుంది అని దాసరి వ్యక్త పరుస్తున్న భావన తప్పు అని అంటూ ఈవిషయంలో ‘బ్రూస్ లీ’ ప్రొడ్యూసర్‌ ను బ్లేమ్ చేయటం మంచి పద్దతి కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లుఅర్జున్. ‘బ్రూస్ లీ’  అక్టోబర్ 16న విడుదల అవుతుందని చాలారోజుల కిందట ఎనౌన్స్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఈరెండు సినిమాలు కేవలం ఒకవారం గ్యాప్ లో వస్తున్నా ఈరెండు సినిమాలు  బాగా ఆడతాయనే నమ్మకం తనకు ఉంది అంటూ ట్విట్ చేసాడు. 

ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న దాసరి చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్సులో తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు టాక్. దీనితో చాలామంది మెగా అభిమానులు వెబ్ మీడియా లో  దాసరి పై అదేవిధంగా  ‘రుద్రమదేవి’ టీమ్ పై విరుచుకుపడ్డారు.  అయితే జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన  గుణశేఖర్ భార్య నీలిమా గుణశేఖర్ మెగా అభిమానులకు క్లారిటీ ఇచ్చే పనిలోపడి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.  

‘మెగాస్టార్ వాయిస్ మాసినిమా సక్సెస్ కు ఎంతో ఉపయోగబడింది అని చెప్పడం లో  ఎటువంటి సందేహమూ లేదు. ఆయనకు మేం జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే దాసరి గారు స్వయంగా ఆయనే సినిమా చూసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు తప్పించి మేం ఆయన దగ్గరకు వెళ్లలేదు, ఏమి అడగలేదు. దయచేసి అర్ధంచేసుకోండి. రేపు రిలీజ్ అయ్యే ‘బ్రూస్ లీ’ మా ‘రుద్రమదేవి’ రెండింటినీ సపోర్టు చేయండి. ఈరగడ ఆపేయండి ప్లీజ్’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ తో మెగా అభిమానుల కోపంతీరినట్లు టాక్. ఏది ఎలా ఉన్నా అల్లుఅర్జున్ దాసరికి గట్టి షాక్ ఇచ్చాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: