తెలుగు ఇండస్ట్రీలో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా రెండేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’ గత శుక్రవారం విడుదలైన ఈ భారీ హిస్టారికల్ ఫిల్మ్ బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించి తెలుగులో టాప్ 3 చిత్రంగా నిలిచింది. ఈచిత్రానికి సంబంధించిన మూడు రోజు కలెక్షన్ వివరాలు ఏరియా వైజ్ వివరాలు నిర్మాతలు విడుదల చేసారు. హిందీలో కూడా ఈ సినిమా విడుదలైంది. ఈ మొత్తం కలిసి రూ. 32 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.  

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కి దగ్గరవుతుందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తెలుగు వెర్షన్ శనివారం రూ.6 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసినట్లు అంచనా. తొలి రోజుతో పోలిస్తే థియేటర్లు, షోలు తగ్గుతాయి కాబట్టి ఇది చాలా పెద్ద మొత్తంగానే భావించాలి. ఆదివారం కలెక్షన్లు ఇంకా ఎక్కువ గానే వచ్చాయి. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా లనాటి స్టార్స్ నటించడం ఈ సినిమాకి మొదటి ప్లస్ అయితే, మనకు తెలియని హిస్టారికల్ సినిమాని భారీ భారీ సెట్టింగులతో ఆవిష్కరించి చూపించడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.


రుద్రమదేవి పోస్టర్


రుద్రమదేవి మొదటి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన వివరాలు : 


నైజాం: రూ. 8.10 కోట్లు

సీడెడ్: రూ. 3.44 కోట్లు

ఆంధ్రా: రూ. 8.08కోట్లు

వైజాగ్: రూ. 1.83 కోట్లు

ఈస్ట్ : రూ. 1.55 కోట్లు

వెస్ట్: రూ. 1.08కోట్లు

కృష్ణా: రూ. 1.07 కోట్లు

గుంటూరు: రూ. 1.73 కోట్లు

నెల్లూరు: రూ. 82 లక్షలు

టోటల్ ఏపి, నైజాం షేర్: రూ. 19.62 కోట్లు

ఓవర్సీస్: రూ. 3.62 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: రూ. 1.81 కోట్లు

3 డేస్ టోటల్ తెలుగు వెర్షన్ షేర్: రూ. 25.05 కోట్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: