రుద్రమదేవి సినిమాలో ముందు చిన్న పాత్ర అని తను చేస్తానని ఓకే చెప్పిన అల్లు అర్జున్ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసి ఆ పాత్రని ఇంకాస్త పెంచాడు గుణశేఖర్. సినిమా ఓ విధంగా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది అంటే అది బన్నీ వేసిన గోన గన్నారెడ్డి పాత్ర వలనే.. తెలంగాణ యాక్సెంట్ లో బన్నీ 'గమ్మునుండవోయ్..' అంటూ అంటుంటే థియేటర్లో అరుపులే వినిపిస్తున్నాయి. అయితే రుద్రమదేవి సినిమాను అనుకోకుండా అక్టోబర్ 9న రిలీజ్ చేశాడు గుణశేఖర్. ఇదే నెలలో 16న రిలీజ్ అవ్వబోతుంది చరణ్ బ్రూస్ లీ. 


చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. అయితే సినిమాకు వన్ వీక్ ముందే మెగా అల్లుడు అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా అదరగొట్టాడు. మరి చెర్రి ఏ విధంగా అలరిస్తాడో చూడాలి. అనుకోకుండానే ఇద్దరు ఈ దసరాకు నువ్వా.. నేనా.. అనుకునే పరిస్థితి వచ్చింది. చరణ్, బన్నీ ఎవరి సత్తా ఏమిటో తెలే సమయం వచ్చింది. అనుష్క లీడ్ రోల్ చేసినా సినిమా అంతా ఓకే అనిపించినా అల్లు అర్జున్ చేసిన అరగంట గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది.


బ్రూస్ లీ సినిమాలో చరణ్ :


ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫైటర్ కథాంశంతో తెరకెక్కించిన బ్రూస్ లీ కూడా భారీ అంచనాలతో వస్తుంది. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. మరి మెగా ఫ్యామిలీ హీరోలు చరణ్, బన్నీలు నిలిచిన ఈ దసరా పోటీలో నెగ్గేదెవరో చూడాలి.


కరెక్ట్ గా బ్రూస్ లీ రిలీజ్ అయిన వారానికే అఖిల్ అక్కినేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న'అఖిల్' సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి ప్రేక్షకులు ఏ సినిమాను హిట్ బాట పట్టిస్తారో.. ఏ సినిమా కెలెక్షన్ల ప్రభజనం సృష్టిస్తుందో కొద్దిరోజుల్లో తెలుస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: