సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ భయపడుతుంది ఒకే ఒక్కదానికి గురించి..అదే పైరసీ భూతం.. దీనిపై ప్రభుత్వ పరంగా ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇదిమాత్రం రోజు రోజుకు విస్తరిందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా ప్రీయిర్ షో వేసిన కొద్ది గంటల్లోనే నెట్ లో ప్రత్యక్షమైతున్న రోజులు ఇవి.. సోషల్ మీడియాలో ఎంత వెగంగా విస్తరిస్తూ ఇలాంటి పైరసీలు కూడ అలాగే విస్తరిస్తున్నాయి.  ఒక్క సినిమా కోసం  అహోరాత్రిళ్లు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి, కోట్లకు కోట్టు ఖర్చు పెట్టి  సినిమాలను రూపొందిస్తుంటే అక్రమార్కులు మాత్రం వారికి తీరని నష్టాలను  మిగులుస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకాక ముందే పైరసీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాదం అప్పట్లో టాలీవుడ్‌లో దుమారం రేపింది.

ఇక సినిమా విడుదలకు ముందే సగం సినిమా మొత్తం నెట్ లో హల్ చల్ చేసింది. సోషల్ మీడియా వల్ల బాహుబలికి ఎంత హైప్ వచ్చిందో మీ అందరికి తెలియంది.   పైరసీ పిసాచిని తరిమి కొట్టమని మొన్న ఇండస్ట్రీ పెద్దలు అంత ప్రెస్ మీట్ పెట్టి  గగ్గోలు పెట్టినా ఎంతమాత్రం వాటిని అరికట్టలేక పోతున్నారు. రెండు వందలు ఖర్చు పెట్టిన బాహుబలి చిత్రం సైతం పైరసీ రక్కసికి బలైంది.  తాజాగా రుద్రమదేవి సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీకి గురైంది. పైరసీ జరిగినట్టు ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ ఫిర్యాదు చేయడంతో నిందితులను సిసిఎస్‌ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కంప్యూటర్లు, పలు పైరసీ సీడీలతోపాటు అందుకు ఉపయోగిస్తున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం అదనపు సిపి స్వాతిలక్రా తెలిపిన సమాచారం ప్రకారం... ఆర్‌సిపురానికి చెందిన ప్రశాంత్‌ చైతన్‌కర్‌(20), పవన్‌ కుంబ్లే (20) ఇంజినీరింగ్‌ చదువుతూ జల్సాలకు అలవాటు పడ్డారు.  'రుద్రమదేవి, బాహుబలి తదితర 1200 సినిమాలను పైరసీ చేశారు. వాటిలో బిహెచ్‌ఈఎల్‌లో నివాసముంటున్న తన్‌వీర్‌ హైమద్‌(30) అనే వ్యాపారికి కొన్నింటిని అమ్మేవారు. మిగిలినవి మార్కెట్‌లో విక్రయిస్తూ నెలకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు సంపాదిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సోమశేఖర్‌ కోసం గాలిస్తున్నట్టు స్వాతి లక్రా వెల్లడించారు.

రుద్రమదేవి పోస్టర్


సినిమా విడుద‌లైన ఫ‌స్ట్ రోజే సీడీలు ఇలా మార్కెట్లోకి వ‌చ్చేస్తే కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాత‌లు, కోట్ల రూపాయ‌ల‌కు సినిమాను కొన్ని బ‌య్య‌ర్లు ఏమైపోవాల‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఫైర‌సీ అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వాలు కూడా  విష‌యంలో స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా ఈ విష‌యంపై సీరియ‌స్‌గా దృష్టిపెడితే టాలీవుడ్ న‌ష్టాలు రాకుండా క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: