సమాజానికి మద్దతుగా ప్రతి దశలోనూ వినోద పరిశ్రమ ముందుకు వచ్చిందని, పరిశ్రమలో ఉన్న తామూ సామాన్యులమే కానీ విలన్లం కామని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెబుతున్వినారు.  చిత్రపరిశ్రమకు హృదయం ఉందని, విపత్తులు ఎదురైన ప్రతిసారీ ఆదుకోవడానికి స్వచ్చందంగా అది తరలి వచ్చిందనీ అమితాబ్ స్పష్టం చేశారు. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, నానా పటేకర్‌లాగా మీరు ఏదైనా చేయగలరా అని విలేకరులు అడిగి ప్రశ్నకు బదులుగా అమితాబ్ పైవిధంగా సమాధానమిచ్చారు.

 

ఒక్కోసారి చిత్రపరిశ్రమను ముగ్గులోకి లాగుతుంటారని, కానీ విపత్తులు ఎదురైనప్పుడు చిత్రపరిశ్రమ దూరంగా ఉంటుందనటం నిజంకాదని అమితామ్ సమర్తించుకున్నారు. జాతీయ విపత్తులాంటిది సంభవించినప్పుడు మొట్టమొదటగా ఆదుకోవడానికి ముందుకొచ్చింది చిత్రపరిశ్రమేనన్నారు. ఆపన్నులకు సహాయం అవసరమైనప్పుడు చిత్రపరిశ్రమ ఒక్కతాటిపై నిలబడి సంఘీభావం తెలిపిన రోజులున్నాయని అమితామ్ గుర్తు చేసుకున్నారు.1960ల ప్రారంభం నుంచి చిత్రపరిశ్రమ సహాయ చర్యల్లో పాలు పంచుకున్న చరిత్ర మీకు తెలియకపోవచ్చు. పరిశ్రమ మొత్తంగా అంటే నాలుగైదువందల మందిమి వీధుల్లోకి వెళ్లి ప్రదర్శనలు నిర్వహించి విపత్తు సంభవించిన ప్రాంతాలకు డబ్బు సేకరించి పంపేవారం. మేం బాధితుల కోసం సెలబ్రిటీ మ్యాచ్‌లు కూడా నిర్వహించాము. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. చాలామంది తమ తమ పరిధుల్లో అలా సహకరిస్తున్నారు. మేం  ఈ విషయంలో విలన్లం కాము. పరిశ్రమకు హృదయం ఉంది అని అమితామ్ నొక్కి చెప్పారు.

 

అదే సమయంలో తాను చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ఎక్కువగా చెప్పుకోలేనని, అలా చెప్పుకోవడం తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. నేను చేసిన సహాయాల గురించి పైకి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు సమాచార మీడియా ఎంతో బలంగా ఉన్నందున అలాంటి విషయాలకు దూరంగా ఉండటం ఎంతో కష్టమని, అమితాబ్ చెప్పారు.

వాస్తవానికి గత తొమ్మిదేళ్లుగా  నేను వీటిపై పనిచేస్తూనే ఉన్నాను. దేశం లోని కొన్ని ప్రాంతాలను నేను సందర్శించాను. కేవలం 5 వేల రూపాయల అప్పు చెల్లించలేనందుకు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వార్తలు చదివాను. కానీ ఇలాంటివి పైకి చెప్పుకోవడం నాకు ఇష్టముండదని, అయితే ఎప్పుడు అవసరం వచ్చినా నేను ముందుంటూను అని అమితాబ్ స్పష్టం చేశారు.

 

తాతలు, తండ్రులు, కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు, వాళ్ల పిల్లలు ఇలా కుటుంబం కుటుంబం మొత్తంగా సినీ పరిశ్రమను గుత్తకు తీసుకుని ఊరేగుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ గుండె ధైర్యం కోల్పోయి నిలువునా జీవితాలను కోల్పోతున్న రైతులను, తదితరులను గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? వైట్ మనీ, బ్లాక్ మనీ లెక్కపెట్టుకుని దాపెట్టుకోవడానికే వారి సమయమంతా సరిపోతోందా? మెగాలు, రెబల్స్, పవర్‌లు, సామ్రాట్‌లు, నట కిరీటిలు, కిశోరాలు, బఫూన్లు, నానా జాతి చిత్ర సంతానం తమకూ హృదయం ఉందని నిరూపించుకోగలదా?


మరింత సమాచారం తెలుసుకోండి: