ఒకప్పుడు మళియాల ఇండస్ట్రీ లో పెద్ద పెద్ద స్టార్స్ కే ముచ్చెమటలు పోయించిన శృంగార తార షకీలా అందరికీ సుపరిచితమే.. అప్పట్లో ఈమె సినిమాలు విడుదల అయితే బిగ్గెస్టు సినిమాల కలెక్షన్లు సైతం ఢీలా పడిపోయేవట..అందుకే ఈ అమ్మడు సినిమా రిలీజ్ టైమ్ లో పెద్ద హీరోల సినిమాలు సైతం వాయిదా వేసుకునే వారట.. అంత  పాపులర్ ఫిగర్ షకీలా...తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఈ పేరుతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ స్థాయిలో దూసుకు వెళ్తున్న సమంత ఒక సినిమాలో కనిపించబోతుంది..అదేంటీ సమంత పేరు షకీలా ఎంటీ అని అనుకుంటున్నారా..? అవునండీ  '10 ఎన్ రథకుల్లా' లో సమంత పేరు షకీలా అట.

విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న '10 ఎన్ రథకుల్లా' సినిమాలో సమంత పాత్ర పేరు షకీలా అట.. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోని ఓ సీన్ లో హీరో విక్రమ్ నీ పేరేంటి అని అడిగితే షకీలా అని సమాధానమిస్తుంది సమంత. అంతే కాదు ఈ సినిమాలో సమంత చాలా అమాయకంగా కనిపిస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నట్లు సమాచారం.  మరో విచిత్రమేమిటంటే ఈ సినిమాలో హీరో విక్రమ్ పేరు కూడా గమ్మత్తుగానే ఉంది..విలన్ గ్యాంగ్ నీ పేరేంటని ప్రశ్నిస్తే జేమ్స్ బాండ్ అని ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమాలో మరికొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి.

 '10 ఎన్ రథకుల్లా' పోస్టర్


తెలుగు ఇండస్ట్రీలో  ‘హృదయకాలేయం’ సినిమాతో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కమెడీయన్ సంపూర్ణేష్ బాబు కూడా కనింపిచబోతున్నాడు..ఇక పంజాబీ సెక్సీ బ్యూటీ చార్మి  గానా గానా తెలంగాణ అంటూ సాగే ఓ ఐటమ్ సాంగ్ లో హాట్ హాట్ గా కనిపించ బోతుందట..   ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలసి మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్మెంట్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయంటూ ట్రైలర్ లోనే హింట్ ఇచ్చాడు దర్శకుడు విజయ్ మిల్టన్. ఇక విక్రమ్ మార్క్ మాస్ బీట్ స్టెప్పులు, సమంత క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలచాయి.ఈ మూవీ ఈ నెల 21న విడుదల కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: