దేవీనవరాత్రులుగా అమ్మను పూజించే ఈ 9 రోజులలో రెండవ రోజైన నేడు అమ్మను బ్రహ్మచారిణి గా పూజలు చేస్తాం. ఈరోజు అమ్మవారు కుడిచేతిలో జపమాల – ఎడమచేతిలో కమండలం తో శ్వేత వస్త్ర ధారిణి అయి ఈరోజు అమ్మ దర్శనం ఇస్తుంది. 

బ్రహ్మచారిణి అనగా తపస్సును ఆచరించునది అని అర్ధం. హిమవంతుని కుమార్తిగా ఉన్న అమ్మ నారద మహర్షి ఉపదేశానుసారం శంకరుడుని భర్తగా పొందాలని ఆయన కోసం అమ్మ బ్రహ్మచారిణిగా ఘోర తపస్సు చేసింది. వేల సంవత్సరాలు పాటు ఈమె కేవలం ఆకులు మాత్రమే భుజిస్తూ అహర్నిశలూ శివారాధన చేసింది అమ్మ.

వేల సంవత్సరాలుగా ఈమె చేసిన తపస్సుతో ఈమె శరీరం కృశించి పోవడంతో ముల్లోకాలు తల్లడిల్లి పోవడంతో బ్రహ్మ స్వయంగా వచ్చి తపస్సు ఆపమని కోరడమే కాకుండా ఓ దేవి నీతపస్సు చాలించు ఆ పరమేశ్వరుడు తప్పకుండా భర్తగా లభిస్తాడని వరం ఇచ్చాడని అంటారు. ఆ వరంతో బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మ తన తపస్సును విరమించింది అని అంటారు. 

ఈరోజున అమ్మవారిని దర్శించుకున్న వారికి అజ్ఞానం, సకలపాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారిని ఎవరు  అర్చిస్తారో వారికి జ్ఞానానందo కలుగడమే కాకుండా కామక్రోధాలను జయించి ముక్తిని పొందుతారు. ఈరోజు పూజానంతరం అమ్మవారికి ప్రసాదంగా కట్టెపోoగలి నివేదన చేస్తారు. బ్రహ్మచారిణిగా ఈరోజున అమ్మను పూజించి ఆ తల్లి ఆశీర్వాదం పొందుదాం..


మరింత సమాచారం తెలుసుకోండి: