నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న మూవీ డిక్టేటర్.. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తుంది. శ్రీవాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే మొన్నటిదాకా ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహన్ మాత్రమే హీరోయిన్స్ అన్నారు కాని స్క్రిప్ట్ పరంగా మరో హీరోయిన్ అవసర పడ్డదట. అందుకే హాట్ గాళ్ అక్షను తీసుకున్నారు. దాదాపు కెరియర్ అయిపోయిందనుకున్న అక్షకు బాలయ్య సినిమాలో ఆఫర్ రావడం లక్కీ ఛాన్సే అని చెప్పొచ్చు.


సినిమాలో అక్ష రోల్ చిన్నదే అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెబుతున్నారు డైరక్టర్ శ్రీవాస్. ముసాఫిర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యువత సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అక్ష  తర్వాత రైడ్, అది నువ్వే, శతృవు, రై.. రై.. సినిమాల్లో నటించింది. హాట్ హాట్ అందాలు కురిపిస్తున్న స్టార్ ఇమేజ్ ని మాత్రం తెచ్చుకోలేక పోయింది అమ్మడు. అయితే కందిరీగ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయ్. తెలంగాణా యాక్సెంట్ లో అమ్మడు ఇరగదీసింది. కాని ఏం లాభం అమ్మడికి అవకాశాలు మాత్రం రాలేదు. 


ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న అమ్మడికి శ్రీవాస్ పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడట. అంతేకాదు బాలయ్య సినిమాలో ఆఫర్ అంటే అదో పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. అదృష్టం బాగుంటే అమ్మడు ఫేట్ మారిపోద్ది కూడా డిక్టేటర్ సినిమాతో. సంక్రాంతి రిలీజ్ అవుతుకున్న బాలయ్య బాబు డిక్టేటర్ సినిమా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రానుంది. మరోసారి బాలయ్య తన వర్సెటైల్ నటనతో ఆకట్టుకోనున్నారు. రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన గణ గణ సాంగ్ ఇప్పటికే ఆడియెన్స్ ని అలరిస్తుంది.


మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తున్నాడన్న మాట. మరి సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.. సంక్రాతి సీజ్ఞలో పోటీకి నిలుస్తున్న మిగతా సినిమాలకు డిక్టేటర్ ఎలాంటి దెబ్బ వేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: