స్వశక్తితో పైకి వచ్చిన దర్శకుల్లో శ్రీనువైట్ల కూడా ఒకడు. కాని సినిమాలన్నీ ఒకే జానర్లో తీస్తూ తనకు ఉన్న మంచి పేరుని కాస్త చెడగొట్టుకుంటున్నాడు. మొదట్లో మాంచి కసి మీద పనిచేసిన శ్రీనువైట్ల ఇప్పుడు స్టార్ హీరోల డేట్స్ అయితే తీసుకుంటున్నాడు కాని దానికి తగ్గ హిట్ మాత్రం వారికి ఇవ్వలేకపోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రూస్ లీతో శ్రీనువైట్ల మరీ దిగజారిపోయాడు. అదే కామెడీ అదే కథ కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులకు శ్రీనువైట్ల ఇక పనికిరాడనే డిసైడ్ అయ్యారు.


అయితే ఈ ఆలోచన వచ్చిందని తనకూ తెలిసిందనుకుంట అందుకే మరోసారి తన టాలెంట్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు శ్రీను. తనకు దర్శకుడిగా మంచి పేరుని తెచ్చిపెట్టిన ఢీ సినిమాకు సీక్వెల్ గా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. 2007లో వచ్చిన ఢీ సినిమా మంచు విష్ణుకి మొట్టమొదటి సూపర్ హిట్ ఇచ్చింది. విష్ణుకు జోడీగా జెనిలియా నటించి అలరించింది.


ఢీ సినిమాలో మంచు విష్ణు, జెనిలియా:


అయితే ఇప్పుడు అదే సినిమాను సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట శ్రీనువైట్ల. దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన శ్రీను ఈమధ్య టైం అస్సలు బాలేదు అందుకే వరుసెంట ఫ్లాప్ సినిమాలను తీస్తున్నాడు. ఇక చరణ్ తన మీద పెట్టుకున్న ఆశలన్ని అడి ఆశలు చేసి సినిమాలో మెగాస్టార్ ఉన్నా సరే సినిమా యావరేజ్ గా నిలిచేలా చేశాడు. అయితే పని అయిపోయింది అనుకుంటున్న ఈ టైంలోనే తానో సూపర్ హిట్ ఇచ్చి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. అందుకే ఢీ-2 కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 


ప్రస్తుతం మంచు విష్ణు సరదా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అతన్ని ఒప్పించి ఢీకి ప్లాన్ చేస్తున్నాడు శ్రీనువైట్ల. మరి శ్రీనువైట్లకు ఆ సినిమా అయినా అదృష్టం కలిసి వచ్చి సూపర్ హిట్ అయితే బాగుంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: