ఫ్యాన్ ఫాలోయింగ్ లో అత్యంత భారీగా ఉండే ఫ్యామిలీస్లో మెగా ఫ్యామిలీ ఒకటి.. అదీ స్పెషల్ గా మెగాస్టార్ కి అయితే అభిమానులకు వల్లమాలిన అభిమానం.. తెలుగు సినిమాల రికార్డులను సృష్టించినా మళ్లీ వాటిని తిరగరాసినా అది మెగాస్టార్ తర్వాతే.. మొన్నటిదాకా పాలిటిక్స్ లో బిజీ అయిన బాస్ రీసెంట్ గా మళ్లీ ఫుల్ టైం సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తుండటంతో మళ్లీ మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ ఏర్పడింది. అయితే ఆ జోష్ తోనే రీసెంట్ గా రామ్ చరణ్ బ్రూస్ లీలో అలా మెరిసి అదరగొట్టాడు మెగాస్టార్.. 


దాదాపు 7 ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ ఎదుర్తుచూస్తున్న తరుణంలో బ్రూస్ లీ హీరో మెగాస్టారే అన్న ఇంపాక్ట్ వచ్చింది. ఇకపోతే నార్త్ అమెరికాలో ఉన్న మెగాస్టార్ ఫ్యాన్స్ చిరుకి బంగారు నాణెం బహుమతిగా అందించారు.. 


చిరు బంగారు నాణెం: 


మెగాస్టార్ చిరంజీవి బొమ్మ ఉన్న బంగారు నాణెం తయారు చేయించి దాన్ని ఆయనకు అందించారు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) సభ్యులు. అంతేకాదు చిరు తీసిన అన్ని భాషల చిత్రాలు రికార్డులు.. చిరు బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్ కు సంబంధించిన విశేషాలను బుక్ రూపంలో ప్రింట్ చేసి అన్ని విషయాలు అందులో పొందు పరిచారు.


నార్త్ అమెరికా మెగా ఫ్యాన్స్ ఇలా తన పేరు మీద బంగారు నాణెం ఇవ్వడం మెగాస్టార్ ని సైతం ఆశ్చర్యపడేలా చేసింది.. దానికి వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.. ఈరోజు జూబ్లీ హిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంతా ఫ్యాన్స్ హంగామాతో జరిగింది. చరణ్ తో కలిసి నటించే మజా కోసమే బ్రూస్ లీలో నటించానని చెప్పారు చిరు.. ఇక 150వ సినిమా మీద నోరు విప్పుతారేమో అనుకున్నారు కాని దాని గురించి మాత్రం మాట్లకుండా కార్యక్రమాన్ని ముగించేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: