విజయదశమినాడు అత్యంత ఘనంగా ఆంధ్రప్రదేశ్ నూతన  రాజధాని అమరావతి శంఖుస్థాపన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూసేకరణ చట్టం ప్రయోగించేందుకు రెడీ అవుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో ఒకసారి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసి పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటించి గర్జించడoతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గింది. 

దాదాపు 300 ఎకరాల భూములకు సంబంధించిన రైతులను ఒప్పించి ఆ భూములను రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణలో తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో  భూసేకరణకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం వెల్లడించారు అని తెలుస్తోంది. 
నవంబర్ మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ ఉండవచ్చునని అధికారులు అంటున్నారు. తుళ్లూరు ప్రాంతం లోని 21 గ్రామాల్లో 300 ఎకరాల భూమిని సేకరించాల్సివుందని అధికారులు అంటున్నారు.

గతంలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు పవన్ కళ్యాణ్ రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి తనదైన శైలిలో ధైర్యం చెప్పాడు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం స్టేట్‌మెంట్‌తో పవన్ తదుపరి ఎత్తుగడ ఏమిటి అని పవన్ అభిమానులు ఆ శక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ తన గుజరాత్ ట్రిప్ నుండి భాగ్యనగరం చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చీ రావడంతోనే పవన్ తన ఇంటికి వెళ్ళి కొద్ది రోజుల క్రితం తన ఇంటి మీద దాడి చేసిన విషయాలు గురించి చాల లోతుగా విచారణ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 1 నుండి మళ్ళీ హైదరాబాద్ లోనే తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ ను మొదలు పెడతాడట పవన్. అయితే ఈ బిజీలో పవన్ రాజధాని ప్రాంత రైతుల విషయంలో నెక్ట్స్ స్టెప్పు ఏమిటి? అనే విషయం పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: