‘బళ్లారి బావా’ అంటూ చాన్నాళ్ల తరువాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది సమీరా రెడ్డి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, చిరంజీవిల చిత్రాల్లో కనిపించిన సమీరా ఆ తరువాత తెరమరుగైపోయింది. బాలీవుడ్ లోనూ సరైన బ్రేక్ రాలేదు. అక్కడా కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే... ‘క్రిష్ణం వందే జగద్గురం’లో ఆమె వేసిన స్టెప్స్ కి థియేటర్లలో జనాలు ఈలలు కొడుతున్నారు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాల్లో చిందేయడానికి సిద్ధమౌతోంది సమీరా. త్వరలో ప్రారంభం కానున్న ఓ అగ్ర హీరో చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుందట. మరో కుర్ర హీరో పక్కన డాన్స్ కీ రెడీ అవుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని సమీరానే అధికారికంగా వెల్లడిస్తుంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: