కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. కలాంగారి ఈ మాటలను తెలుగు దర్శకుడు రాజమౌళి నిరూపించారు. అసలు తెలుగు సినిమాకు అంత స్టామినా ఉందా అన్నవాళ్లు ఆశ్చర్యపోయేలా 250 కోట్లతో సినిమా తీసి దాదాపు 550 కోట్లు కొల్లగొట్టాడు. అక్కడితో ఆగితే ఆయన రాజమౌళి ఎందుకవుతాడు.. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు.

ఓవైపు బాహుబలి రెండో పార్ట్ పనులు సాగుతుండగానే రాజమౌళి తదుపరి చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. బాహుబలి 2 తర్వాత బాహుబలి 3 ఉంటుందా.. ఉండదా అన్నదానిపై పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. బాహుబలి స్ఫూర్తి కొనసాగుతుందంటూ ఆ మధ్య టీట్ ద్వారా ఊహించారు. దాన్ని బట్టి బాహుబలి 3 ఉండదు.. కానీ అంతకుమించిన అద్భుతం రాబోతోందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. 

గరుడ పేరుతో రాజమౌళి ఓ భారీ పౌరాణికి చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందట. మరి అంత బడ్జెట్ అంటే మన నిర్మాతలు తట్టుకోగలరా.. అందుకే ఈ చిత్ర నిర్మాణంలో విదేశీ సంస్థలను పార్టనర్లుగా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. 

అందుకే ముందుగా ఈ సినిమాకు హైప్ తెచ్చేందుకు ఓ మాంచి టీజర్ తయారు చేస్తారట. సినిమా లాగానే టీజర్ కూడా భారీ నిర్మాణవ్యయంతో ఉంటుందట. దాదాపు పాతిక కోట్లు ఖర్చు చేసి అదిరిపోయేలా టీజర్ విడుదల చేస్తారట. మరి ఈ గరుడ.. ఇంకెన్ని గారడీలు చేస్తుందో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: