పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ఏం చేసినా, ఆ రోజు మీడియా వారికి పండుగ వాతావణమే అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాకి పవన్ కళ్యాణ్ టి.ఆర్.పి లను తెచ్చే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పినా, దానికి సంబందించిన టి.ఆర్.పి పీక్స్ కు చేరుతున్నాయి.


ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తెలుగుసాంప్రదాయమైన పంచె కట్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడానికి విజయవాడ వెళ్ళాడు. ఆయన పంచె కట్టులోవెళ్ళడం అందరినీ ఆశ్ఛర్య పరచడమే కాకుండా న్యూస్ లో బ్రేకింగ్ నిలిచింది. తను పంచె కట్టులో కనిపించటానికి కారణం సాధరణమే. కార్తీక మాసం ప్రారంభం అయిన కారణంగా దీక్షని పవన్ కళ్యాణ్ ప్రారంభించాడు. 


అందులోభాగంగానే ఆ రోజు ఉదయమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసి ఆ తర్వాత ఇంటినుంచే నేరుగా విజయవాడ వెళ్ళాడు. ఇదీ అందరికీ తెలిసిన మేటర్. ఇక ఈ న్యూస్ ని పదే చూపిస్తూ, ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ మరే న్యూస్ లేనట్టుగా ప్రముఖ న్యూస్ ఛానల్స్ బాధ్యతారహితంగా ప్రవర్తించాయంట. ఓ రకంగా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ కట్టిన పంచె కట్టు కథనాలతో న్యూస్ ఛానల్స్ ఈ న్యూస్ ని ఉతికిపారేసి, న్యూసెన్స్ ని క్రియేట్ చేశాయి.  


తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విలువైన సమాచారాన్ని వదిలేసి, కేవలం టి.ఆర్.పి ల కోసమే ఈ విధంగా పంచె కట్టుపై గంటల తరబడి కథనాలు నడపటం విలువల్లేని జర్నలిజాన్ని చూపిస్తుందంటూ సామాజిక బాధ్యత కలిగిన పౌరులు, ప్రముఖులు వారి ఆవేధనని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాన్ ఇక నుండి 45 రోజులు పాటు దీక్షలోనే ఉంటాడంట. ఈ విషయం మీడియా తెలిసింది కాబట్టి, డే1, డే2...డే 45 అంటూ దీక్షకి సంబంధించిన న్యూసే ఈ కార్తీక మాసంలో మీడియాకి అసలైన న్యూస్ గా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: