తెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు ప్రభాస్. మొదట్లో పెద్దగా హిట్ సినిమాలు లేక పోయినా..రాజమౌళి  తెరకెక్కించిన ‘చత్రపతి’ సినిమా తో మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇక రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాలీవుడ్ లో అయితే ఇప్పటి వరకు ప్రభాస్ అంటే తెలియక పోయినా ‘బాహుబలి ’ హిందిలో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రభాస్ వెంట కార్పోరేట్ సంస్థలు పడుతున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ పెళ్లి విషయంపై రక రకాల రూమర్లు పుట్టుకు వస్తున్నాయి.  మరో వైపు  ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మాత్రం గత ఐదు సంవత్సరాల పెళ్లి విషయం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు.  ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే మనోడికి రక రకాల హీరోయిన్లతో జోడి కుదిరిందీ అని వార్తలు సృష్టిస్తున్నారు. దీనిపై ప్రభాస్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో వాళ్లతో ప్రభాస్ కి వివాహం జరపబోమని తెల్చి చెప్పారు. ఇక ప్రభాస్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లోని అమ్మాయిలలో ప్రభాస్ కు జోడిని సెట్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్.గతకొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది

కృష్ణం రాజు, ప్రభాస్


తాజాగా ప్రభాస్ వివాహంపై రెబల్ స్టార్ కృష్ణం రాజు కాస్త ఘాటుగా స్పందించాడు..గత కొంత కాలం నుంచి ప్రభాస్ పై వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని ఆయన ఖండించారు. ఈ పుకార్లను ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఒకవేళ ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయితే మేమే మొదటగా మీడియా ద్వారా అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతం ‘బాహుబలి2’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పారని ఒకవేళ ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయితే మేమే మొదటగా మీడియా ద్వారా అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దు అంటూ స్పష్టం చేసారు.మరి ‘బాహుబలి2’ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అనే విషయం భవిష్యత్తులోనే తెలియనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: