‘బాహుబలి’ ఘన విజయంతో ప్రభాస్ జాతీయస్థాయి సెలిబ్రిటీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో కూడ ప్రభాస్ నటించడానికి  అంగీకరిస్తీ చాలు కోట్లు కురిపించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. దీనికి తోడు పెరిగిపోయిన ప్రభాస్ క్రేజ్ ను తమ వ్యాపారలకు వాడుకోవడానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని అనేక వ్యాపార సంస్థలు ప్రభాస్ వెంట పడుతున్నాయి. 

ఈ క్రేజ్ ఇలా కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభాస్ కొంచం కొత్తగా కనబడాదామని కాబోలు  ప్రభాస్ తన ఫేస్ బుక్ కవర్ ఫోటోను కూడ మార్చేశాడు. ‘బాహుబలి’ లో శివుడు గెటప్ లో  ఉన్న ఫోటోను అప్ టుడేట్ చేశాడు.  దీనితో ఫ్యాన్స్ ఒక్కసారిగా తెగ సంబర పడిపోయారు. కేవలం రెండు గంటల్లో ఆ కవర్ ఫోటోకు 1,51,593 లైక్ లు వచ్చాయి. అంతేకాదు ఈఫోటోను 1184  మంది షేర్ చేసుకున్నట్లు టాక్. 

దీనితో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరొకసారి బయట పడింది. ఇక ఈ పరిస్థుతుల నేపధ్యంలో ‘బాహుబలి-2’ విడుదల తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయం అంచనాలకు కూడ అందటం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. ‘బాహుబలి 2’ లో ప్రభాస్  రానా తో తలపడే ప్రతి సన్నివేశం పీక్ లో ఉంటుంది అనే ప్రచారం ఇప్పటికే కొనసాగుతోంది. 

ప్రభాస్ కూడ ఊహించని స్థాయిలో ఏర్పడ్డ ఈ క్రేజ్ ను శాశ్వితoగా నిలుపుకోవడానికి ఈమధ్య ప్రభాస్ తరుచూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఫ్యాన్ మీట్ లను కూడ ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. లేటెస్ట్ గా హైదరాబాద్ లోని జీసస్ ఓల్డేజ్ హోంకు 5 లక్షల విరాళం అందించి ప్రభాస్ తనలోని సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నాడు. ఏమైనా ఈరోజు వెబ్ మీడియాకు ప్రభాస్ శివుడు గెటప్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: