కథ డిమాండ్ చేస్తే బికినీలు వేసుకోవడానికి లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి తమకు అభ్యతరం లేదు అంటూ హీరోయిన్స్ మీడియా ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటారు. అయితే ఒక బాలీవుడ్ హీరోయిన్ సినిమా  కథ అవసరం బట్టి సెక్స్ సన్నివేశాల్లో నటించడం తప్పులేదని తన అమ్మ చెప్పిందని ఈ మధ్య ఒక  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ మాటలు అన్నది ఎవరో కాదు  ‘హేట్ స్టోరీ3’ లో హాట్ సన్నివేశాల్లో ధైర్యంగా నటించిన బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్. ఈమెకు కత్రీనా కైఫ్ పోలికలు ఉండటంతో జూనియర్ కత్రినా అంటూ ఉంటారు. సల్మాన్ ఖాన్ చేత వెండి తెరకు పరిచయం కాబడ్డ జరీనా ఖాన్ నటించిన ‘హేట్ స్టోరీ3’ వచ్చే నెల 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ ఇటీవల విడుదలయ్యాయి. 

ఈ ట్రైలర్ ను బట్టి ఈసినిమాలో జరీనా ఖాన్ శృంగార విశ్వరూపం ఉంటుంది అన్న ఒక అంచనాలకు రావడంతో, అంత హాట్ సీన్స్ ను చూడటానికి భయపడుతున్నారు అనే కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈ కామెంట్స్ పై జరీనా ఖాన్ స్పందిస్తూ తాను 'హేట్ స్టోరీ 3' సినిమా చేయడానికి ముందు ఈ సిమిమాలో చాల శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో తాను చేయాలా ? వద్దా ? అని ఆలోచిస్తున్న సమయంలో తన తల్లి సలహాతో ఈసినిమాను అంగీకరించానని అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది జరీనా. 

అంతేకాదు  సినిమాలో ఉండే హాట్ సీన్స్ లో నటించినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని తన తల్లి తనను కన్వెన్స్ చేయడంతో తాను ఈపాత్ర చేసాను అంటోంది జరీనా. ఏమైనా జరీనా విశ్వరూపం పూర్తిగా చూడాలి అంటే ఆ సినిమా విడుదల వరకు ఎదురుచూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: