ఈనెల 27న విడుదల కాబోతున్న ‘సైజ్ జీరో’ సినిమాను ఫ్యామిలీ సినిమాగా ఆ సినిమా నిర్మాతలు ప్రమోట్ చేస్తూ ఉంటే ఆ సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఇప్పుడు ఫిలింనగర్ లో సంచలన వార్తగా మారింది. ఈసినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే కాకుండా ఈసినిమా కోసం హీరోయిన్ అనుష్క సహజత్వం కోసం చాల లావుగా తయారైన విషయం తెలిసిందే. 

ఈ మూవీ ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్, పోస్టర్స్ ఇలా ఇప్పటికి విడుదలైన అన్నింటిని చూసిన సినిమా అభిమానులు ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ కామెడీ అని అనుకున్నారు. అటువంటి సినిమాకు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కథ విషయంగా చూసుకుంటే కూడ ఎక్కడా ఈసినిమాలో అశ్లీల సందర్భాలకు చోటు ఉండే అవకాశం లేదు. మరి అలాంటి సినిమాలో సెన్సార్ వారికి ఎడల్ట్ కంటెంట్ ఏమి కనిపించింది అనే విషయమై ఇప్పుడు రకరకాల చర్చలు ఫిలింనగర్ లో జరుగుతున్నాయి. 

సామాన్యంగా ఫైటింగులు, బీభత్సాలు, రక్తపాతాలు ఎక్స్ పోజింగ్ లు, డబుల్ మీనింగ్ సంభాషణలు ఉన్న సినిమాలకు ఇలా యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఈసినిమాలో అటువంటి సన్నివేశాలు ఏమి ఉంటాయి అన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ బికినీ క్వీన్ అని పేరు తెచ్చుకున్న సోనాల్ చౌహాన్ ఈసినిమాలో నటిస్తూ ఉండటంతో ఆమె బికినీతో ఏమైనా రెచ్చగొట్టిందా ? లేదంటే ఆర్య – అనుష్కల మధ్య ఒక లిప్ లాక్ సీన్ ఉంది అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో అటువంటి సీన్ వల్ల సెన్సార్ ఈ సర్టిఫికేట్ ఇచ్చిందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. 

అంతేకాదు ఈసినిమా దర్శకుడు ప్రకాష్ తన తండ్రి రాఘవేంద్రరావు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈసినిమాలో ఇంకా ఏమైనా హాట్ సీన్స్ ఉన్నాయా అన్న ఆ శక్తి పెరుగుతోంది. ఏది ఏమైనా ‘సైజ్ జీరో’ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం షాకింగ్ న్యూస్..


మరింత సమాచారం తెలుసుకోండి: