ఈరోజు ఉదయం ప్రారంభం అయిన వరంగల్ ఉప ఎన్నిక ఫలితాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ పంచ్ డైలాగులు ఎంత వరకు ప్రభావితం చేస్తాయి అన్న ఆ సక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాలు అంటే తనకు అవగాహనా లేదు అని చెప్పే మహేష్ డైలాగులను వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం బట్టి మహేష్ కు తెలంగాణ ప్రాంతంలో కూడ ఎంత క్రేజ్ ఉందో అర్ధం అవుతుంది.

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మహేష్ తన రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలో సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహేష్ ను తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు కూడ బాగా అభిమానిస్తున్నారు. ఆ అభిమానం వల్లనే కాబోలు ఈరోజు జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో మహేష్ పంచ్ డైలాగులను కూడ వాడారు. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలోకి వెళితే వరంగల్ ఉప ఎన్నిక ప్రచారo చివరి రోజున జరిగిన సభలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిని గెలిపించండి అని ప్రచారం చేసిన కెటిఆర్ తన ప్రసంగంలో మహేష్ పంచ్ డైలాగులను వాడటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘మీ ఓటుతో కాంగ్రెస్ బిజేపి పార్టీల మైండ్ బ్లాంక్ కావాలి’ అంటూ మహేష్ ‘పోకిరి’ సినిమాలోని పంచ్ డైలాగులను వాడుతూ తన పార్టీ అభ్యర్ధి విజయానికి కెటిఆర్ ప్రయత్నించడం బట్టి మహేష్ కు తెలంగాణలో కూడ ఎంత క్రేజ్ ఉందో మరొకసారి అర్ధం అవుతుంది..

ఈరోజు ఉదయం ప్రారంభం అయిన ఓరుగల్లు ఉపఎన్నిక ఓటర్ మైండ్ ను మహేష్ పంచ్ డైలాగులు ఎంత వరకు ప్రభావితం చేస్తాయో చూడాలి. రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ పంచ్ డైలాగులు ఎంత సహకరిస్తాయో తెలిస్తే రానున్న ఎన్నికలలో మహేష్ బావ రాజకీయ వేత్త గల్లా జయదేవ్ కూడ ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: