తమిళ ఇండస్ట్రీలో హాస్యనటులు ఎవరా అంటే వెంటనే చెబుతారు వడివేలు అని..తెలుగులో కూడా వడివేలు కామెడీ అంటే పడిచస్తారు.  కమెడియన్  గానే కాకుండా ‘హింసించే 23వ పులకేషి’ సినిమాతో హీరోగా కూడా మంచి పేరు సంపాదించాడు. ఆ మద్య తమిళనాడులో రాజకీయాల్లో చాలా వివాదాలను ఎదుర్కొన్నారు...ఒకదశలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో వైరం పెట్టున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అన్ని మానుకొని తిరిగి కమెడియన్ గా సినిమాల్లో నటిస్తున్నారు.

తాజాగా వడివేలు మరో వివాదంలో చిక్కుకున్నారు..తమిళ సినీ నటుల సమాఖ్య 'నడిగర్ సంఘం'పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. విచారణకు హాజరు కావాలని కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది.  ఆ మద్య విలేఖరులు సమావేశంలో దక్షిణ భారత నటుల సంఘం కనిపించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలు తమిళ నాట పెను చాలా వివాదం నెలకొంది..అంతే కాదు మొన్నామద్య జరిగిన  'నడిగర్ సంఘం' ఎలక్షన్స్ కూడా ఎన్ని వివాదాలకు దారితీసిందో అందరికీ తెలుసు. విశాల్, శరత్ కూమార్ ల మద్య పెద్ద యుద్దమే నడిచింది.  


‘హింసించే 23వ పులకేషి’ చిత్రం పోస్టర్

ఇక ఇలాంటి సున్నతమైన అంశంపై వడివేలు కామెంట్ చేయడంతో ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నామక్కల్‌ జిల్లా నడిగర్‌ సంఘం కార్యకర్తల సమిటీ సభ్యుడు, జిల్లా నాటక నటుల సంఘ అధ్యక్షుడైన ఆటో రాజా వడివేలుపై కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. సున్నితమైన అంశంపై తనకు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసి సినీ నటుల మనోభావాలను దెబ్బదీశారని అందుకే ఆయనపై చర్యలు చేపట్టాలని పిటిషనలో కోరారు.  శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి 27వ తేదీన జరిగే విచారణకు వడివేల్‌ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: