స్క్రిప్ట్ లో లోపాలకారణంగా ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ కు బ్రేక్ పడటంతో మ‌హేష్ తన ఆలోచనలను అత్తారింటి దారి వైపు మళ్ళించాడు. ఈమధ్యనే ప్యారిస్ నుండి తిరిగి వచ్చిన మహేష్ తన సినిమాల షూటింగ్ లు లేకపోవడంతో తన భార్య నమ్రత తల్లితండ్రులు ఉంటున్న ముంబాయి పట్టణానికి వెళ్ళడమే కాకుండా అక్కడ తన భార్య సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఇంటికి కూడ వెళ్ళి ఆ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు మహేష్.

ఇలా సరదాగా మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను మహేష్ భార్య నమ్రత తన ఫేస్ బుక్ లో అభిమానులు అందరికీ షేర్ చేసింది. అంతేకాదు మహేష్ శిల్పా శిరోద్కర్ పుట్టినరోజు వేడుకలలో కూడ పాల్గొని తన అత్తవారింటిలో అందరి అభిమానాన్ని పొందాడు అని తెలుస్తోంది. మహేష్ పిల్లలు గౌతమ్ సితారలు ఈ అనుకోని హాలిడే ట్రిప్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ నమ్రత కామెంట్ చేసింది.

బయట ఎంతో హుందాగా కనిపించే మహేష్ తనకు నచ్చిన వారిని కలిసినప్పుడు మటుకు తెగ జోక్స్ వేసి నవ్విస్తాడని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ మహేష్ తన జోక్స్ తో తన అత్తారింటిలో తెగ హడావిడి సృష్టిస్తున్నాడు అంటూ నమ్రత ఆనందపడిపోతు ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. 

‘శ్రీమంతుడు’ ఘన విజయం తరువాత ప్రారంభమైన ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ రకరకాల కారణాలతో బ్రేక్ పడుతూ ఉండటంతో మహేష్ తన కుటుంబ సభ్యులతో ఇలా వరస పెట్టి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ వరస బ్రేక్స్ తో ‘బ్రహ్మోత్సవం’ మహేష్ నిర్ణయించిన  ఏప్రిల్ నెలలో విడుదల అవుతుందా అనే అనుమానం ఇప్పటికే చాలమందిలో ఏర్పడింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: