ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల మధ్య ఎప్పుడూ పోటీనే ఉంటుంది. అయితే ఆ టాప్ హీరోలు ఇద్దరూ ఒకే మూవీలో నటిస్తే..ఇందులో ఎవరు గొప్ప అని ఎలా తెలుస్తుంది. ఆ మూవీలో ఎవరో ఒకరుఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా చేస్తే..ఆ హీరోకి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా భారీ రెమ్యునరేషన్ తీసుకుని నటిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోఇటువంటిదే ఉపేంద్ర విషయంలో జరుగుతుంది.


దీనికి సంబందించిన వివరాల్లోకి వెళితే, కన్నడలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న సుధీప్ ఈ మధ్య తన మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.‘ఈగ’ బాహుబలి, పులి సినిమాలలో నటించిన సుధీప్ కి ఇప్పుడు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమాని కన్నడలోరీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.


అలాగే తాజాగా సుధీప్ మరో పవన్ సినిమా రీమేక్ పై కన్నేసాడు. ‘గోపాల గోపాల’ సినిమాని కన్నడలో రీమేక్ చేసి, మరో సక్సెస్ ని అందుకోవాలనిచూస్తున్నాడు. ఇక సుధీప్ ఈ సినిమాలో పవన్ చేసిన శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించనుంటే, వెంకటేష్ పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రని అప్రోచ్ అయ్యాడు.


ఇందుకోసం ఉపేంద్ర దాదాపు కోటిరూపాయలకు పైగానే తీసుకుంటున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఉపేంద్రకి ఇంతటి భారీ రెమ్యునరేషన్ ఇస్తేనే నటించనున్నట్టుగా పి.ఆర్ ద్వారా సుధీప్ కి తెలియజేసినట్టుగా టాక్స్వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: