మోహన్ బాబు నటించిన ‘స్వర్గం నరకం’ విడుదల అయి 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంలో నిన్న పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఫంక్షన్ లో తన కెరియర్ తొలిరోజులలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు చేసుకుని కన్నీరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆరోజులలో తాను  ఉండే రూమ్ రెంటు ఇరవై రూపాయలు అని చెపుతూ ఆ రెంట్ కుడా కట్టలేని పరిస్థితులలో తాను 3 నెలల రెంట్ ఆ రూమ్ ఓనర్ కు కట్టే స్థోమత లేక పడిన ఇబ్బoది వివరిస్తూ అనుకోకుండా కంట కన్నీరు పెట్టుకున్నాడు మోహన్ బాబు. 

రెంటు డబ్బులు కోసం  తన ఇంటి ఓనరు రోజూ పీక్కుతినే ఆరోజులలో తానులేని సమయంలో తన రూమ్ లోకి  వచ్చిన రూమ్ ఓనర్ తనను ఏదోవిధంగా ఖాళీ చేయిద్దామని తానూ వంట వండుకునే పాత్రల్లో యూరిన్ పోసి వెళ్ళిపోయిన విషయాన్ని గుర్తుకు చేస్కున్నాడు మోహన్ బాబు. 

ఆ రోజు రాత్రి తన రూమ్ కు వచ్చిన తరువాత వంట వండుకుందామని చూస్తే పాత్రలు ఒకటే కంపు కొడుతున్న సందర్భంలో ఏమీ చేయలేని పరిస్థుతులలో  ఆ రాత్రంతా పస్తులతో  పడుకున్నాను అంటూ మోహన్ బాబు చెపుతున్నప్పుడు మోహన్ బాబు కంటకన్నీరు పెట్టుకోవడం ఆకార్యక్రమానికి వచ్చిన వారు అందరినీ కలిచి వేసింది. 

దాదాపు 520 సినిమాలలో నటించి 50 సినిమాలు నిర్మించడమే కాకుండా శ్రీవిద్యా నికేతన్ లాంటి ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పిన మోహన్ బాబు 40 సంవత్సరాల సినిమా ప్రవేశవేడుకకు సినిమా రంగానికి చెందిన ఎందరో అతిరధ మహారధులు రావడంతో ఆవేడుక కళకళ లాడింది. ఈ విలక్షణ నటుడు జీవితంలో ఎదుర్కున్న పరిస్థితులు నేటితరం నటులలకు జీవన పాఠాలు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: