ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో “కుమారి 21F” అధిరే కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. పెద్ద మూవీలేవి రిలీజ్ కి రెడీ లేక థియోటర్స్ వెల వెలబోతున్న సమయంలో..చిన్న మూవీగా వచ్చిన “కుమారి 21F”, బాక్సాపీస్ వద్ద సందడిన క్రియేట్ చేస్తుంది. ఇక థియోటర్స్ వద్ద ప్రెష్ గా కనిపిస్తున్న అఖిల్ మూవీ, ప్రేక్షకుల ఆలోచలనలో అప్పుడే అవుట్ డేట్ గా మారింది. దీంతో “కుమారి 21F” మూవీ థియోటర్స్ వద్ద సత్తా చాటుతుంది.


ఇక ఈ చిత్రానికి వచ్చిన స్టన్నింగ్‌ ఓపెనింగ్స్ రావటమే కాకుండా వీకెండ్ కలెక్షన్స్ సైతం ధుమ్మురేపాయి. ఒక గుంటూరులోనే “కుమారి 21F” మూవీ వీకెంట్ లో కోటి రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టడం విశేషంగా మారింది. ఈ చిత్రానికి మౌత్ టాక్‌ బాగుండడం, యూత్‌ బాగా ఇష్టపడడంతో రెండు వారాల పాటు “కుమారి 21F” మూవీకి  తిరుగుండదని అంటున్నారు. ఇక ఒకే రూఫ్ లో ఉంటున్న అఖిల్, “కుమారి 21F” మూవీలలో అందరూ “కుమారి 21F”  మూవీని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.


కొన్ని సందర్భాల్లో థియోటర్స్ మధ్య అండర్ స్టాండింగ్స్ తెచ్చుకొని అఖిల్ పోస్టర్స్ ని థియోటర్ బయట పెట్టి...లోపల మాత్రం “కుమారి 21F” మూవీని ప్రదర్శిస్తున్నారు. ఈ విధమైన ప్రదర్శన చాలా చోట్ల జరుగుతుండటంతో అందరూ “కుమారి 21F” మూవీని చూడాటానికి ఇష్టపడుతున్నారు.


మొత్తంగా థియోటర్స్ అన్నీ“కుమారి 21F” మూవీతో కళ కళలాడుతుంటే, అఖిల్ థియోటర్స్ మాత్రం వెల వెలబోతున్నాయని అంటున్నారు. ఇక“కుమారి 21F” చిత్రానికి ఫుల్‌ రన్‌లో 20 కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: