తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది..ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్న వర్థమాన నటుడు కేశవన జలపాతంలో కొట్టుకొనిపోయి దుర్మరణం పాలయ్యాడు. కేశవన్ 'క్కాక్కాకా' అనే తమిళ చిత్రంలో హీరోగా నటించారు. నూతన దర్శకుడు విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ ప్రైవేటు ఛానల్‌ ప్రదర్శన నిమిత్తం ఇటీవలే మలేషియా వెళ్లిన కేశవన  తల్లిదండ్రులతో కలిసి ఐపో, బి డోర్‌ అనే జలపాతాన్ని వీక్షించేందుకు వెళ్లాడు.

అక్కడి జలపాతాలు చూసి ముచ్చట పడ్డ కేశవన స్నానం చేద్దామని నీటిలోకి వెళ్లాడు కానీ అప్పటికే జలపాతం ఉధృతి బాగా పెరిగిపోవంతో అందులో కొట్టుకొని పోయాడు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు..తమ కళ్ల ముందే కన్నకొడుకు అలా నీటిలో కొట్టుకు పోతుంటే తల్లిదండ్రుల ఆవేదన చెప్పనలవి లేకుండా పోయిందట. సమాచారం తెలుసుకున్న మలేషియా పోలీసులు కేశవన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా  కేశవన మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో కూరుకుపోయింది.

‘కా కా కా’ చిత్రం ఓ దృశ్యం


కాగా 'క్కాక్కాకా'  చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో చిత్ర హీరో మరణం ఎంతగానో బాధించిందని చిత్ర దర్శకుడు విజయ్ అన్నారు. ఈ సంఘటనపై కోలీవుడ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నటుడిగా ఎదిగే సమయంలో ఇటువంటి దుర్వార్త వినడం మనసుకు చాలా భారంగా ఉందని చిత్రం యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: